అస్థిర పరిచేందుకు పొరుగుదేశం కుట్ర:రాజ్ నాథ్ | Neighbouring country trying to destabilise India: Rajnath | Sakshi
Sakshi News home page

అస్థిర పరిచేందుకు పొరుగుదేశం కుట్ర:రాజ్ నాథ్

Published Sun, Jun 26 2016 6:53 PM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM

Neighbouring country trying to destabilise India: Rajnath

ఫతేగఢ్ సాహిబ్: పొరుగుదేశం భారత్ లో అశాంతి, అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ పై విరుచుకుపడ్డారు. ఎనిమిదిమంది సీఆర్ పీఎఫ్ జవాన్లు ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన ఘటనపై రాజ్ నాథ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధ వీరుడు బాబా బండ సింగ్ బహదూర్  వర్థంతి ఉత్సవంలో మాట్లాడుతూ ఆయన మాట్టాడుతూ..


ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరి ఆధ్వర్యంలో కమిటీని వేసి పాంపోర్ కు పంపాల్సిందిగా హోం శాఖ కార్యదర్శిని ఆదేశించారు. జరిగిన పొరపాట్లు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆయన సూచించారు. సైనికుల ధైర్యం, దేశ భక్తికి సైల్యూట్ చేస్తున్నానని ఆయన అన్నారు.  సైనికుల త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. శనివారం జమ్ముకశ్మీర్ లోని పాంపొరాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎనిమిదిమంది జవాన్లు మరణించగా మరో 21 మంది గాయపడిన విషయం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement