భోపాల్: పెళ్లైన రెండు రోజులకే ఓ యువతికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో అటు వధూవరుల కుటుంబాలతోపాటు పెళ్లికి వచ్చిన బంధువుల్లోనూ కలవరం మొదలైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. భోపాల్‌లోని జట్ ఖేడి ప్రాంతానికి చెందిన యువతి మంగళవారం పరిమిత బంధువుల సమక్షంలో వరుడిని వివాహమాడింది. అయితే ఆమెకు గత కొద్ది రోజులుగా జలుబు, జ్వరం ఉండటంతో మాత్రలు వేసుకోగా కాస్త ఉపశమనం లభించింది. ఎందుకైనా మంచిదని పరీక్షలు కూడా చేయించుకుంది. (స్వామీజీ అంత్యక్రియల్లో నిబంధనల ఉల్లంఘన)
ఈ క్రమంలో గురువారం వచ్చిన పరీక్షా ఫలితాల్లో ఆమెకు కరోనా ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం వధూవరుల ఇంటిసభ్యులతోపాటు పెళ్లికి హాజరైన 32 మంది బంధువులను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. కాగా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా 50 మంది అతిథుల మధ్య వివాహాలు జరుపుకోవచ్చని కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. మధ్య ప్రదేశ్‌లో కేసుల సంఖ్య ఆరు వేలకు చేరుకుంది (ఆదివారాల్లో పెళ్లిళ్లకు అనుమతిస్తాం.. !)
Comments
Please login to add a commentAdd a comment