సాక్షి, న్యూఢిల్లీ : బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ భారీ కుంభకోణానికి పాల్పడి, దేశం విడిచి వెళ్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనందాల్చడాన్ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తప్పుపట్టారు. నీరవ్ వ్యవహారంపై మోదీ నోరుమెదపకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. దేశానికి కాపలాదారుగా ఉంటానని చెప్పుకున్న ప్రధాని ఎక్కడున్నారో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని రాహుల్ ట్వీట్ చేశారు.
నీరవ్ ఉదంతంపై గతంలోనూ మోదీ టార్గెట్‌గా రాహుల్ ట్వీట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడంపై పిల్లలకు సూచనలు ఇచ్చేందుకు ప్రధాని రెండు గంటల సమయం కేటాయిస్తారు కానీ..రూ 22,000 కోట్ల బ్యాంకింగ్ స్కామ్‌పై మాత్రం రెండు నిమిషాలు కూడా మాట్లాడరని రాహుల్ అన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నీరవ్ మోదీ స్కాంపై నోరుమెదపలేదని విమర్శించారు. అరుణ్ జైట్లీ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment