సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ దోషులకు ఉరిశిక్షపై విచారణ వాయిదా పడింది. కేసు తదుపరి విచారణను ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా నిర్భయ అత్యాచారం, హత్యకేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్ తనకు విధించిన మరణ శిక్షపై వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ ఉదయం కొట్టివేసిన విషయం తెలిసిందే.
నిర్భయ దోషులకు ఉరిశిక్ష సరైందేనని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దోషికి సమీక్ష కోరే హక్కు లేదని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్‌కు దోషుల తరఫు న్యాయవాది మూడు వారాల గడువు కోరినా... క్షమాభిక్షకు వారం రోజులు చాలని తెలిపింది. మరోవైపు 14 రోజుల్లోగా దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని నిర్భయ తల్లిదండ్రులు కోరారు.
సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పై నిర్భయ తల్లి ఆశాదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణ వాయిదా వేసిన తర్వాత స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. పరిష్కారం కోసం దోషులకు సమయం కేటాయించి కోర్టు ఒకవైపు నుంచి మాత్రమే చూస్తుందని ఆమె మీడియాకు తెలిపారు. తదుపరి విచారణ తర్వాత కూడా తీర్పు వస్తుందని మాకు నమ్మకం లేదంటూ స్పందించారు.
(చదవండి : నిర్భయ దోషి రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు)
Comments
Please login to add a commentAdd a comment