Requiem
-
నిర్భయ దోషుల ఉరిశిక్ష విచారణ వాయిదా
-
నిర్భయ దోషుల ఉరిశిక్ష విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ దోషులకు ఉరిశిక్షపై విచారణ వాయిదా పడింది. కేసు తదుపరి విచారణను ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా నిర్భయ అత్యాచారం, హత్యకేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్ తనకు విధించిన మరణ శిక్షపై వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ ఉదయం కొట్టివేసిన విషయం తెలిసిందే. నిర్భయ దోషులకు ఉరిశిక్ష సరైందేనని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దోషికి సమీక్ష కోరే హక్కు లేదని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్‌కు దోషుల తరఫు న్యాయవాది మూడు వారాల గడువు కోరినా... క్షమాభిక్షకు వారం రోజులు చాలని తెలిపింది. మరోవైపు 14 రోజుల్లోగా దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని నిర్భయ తల్లిదండ్రులు కోరారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పై నిర్భయ తల్లి ఆశాదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణ వాయిదా వేసిన తర్వాత స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. పరిష్కారం కోసం దోషులకు సమయం కేటాయించి కోర్టు ఒకవైపు నుంచి మాత్రమే చూస్తుందని ఆమె మీడియాకు తెలిపారు. తదుపరి విచారణ తర్వాత కూడా తీర్పు వస్తుందని మాకు నమ్మకం లేదంటూ స్పందించారు. (చదవండి : నిర్భయ దోషి రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు) -
అత్యాచారానికి ఉరిశిక్షే సరి!
సాక్షి, హైదరాబాద్: మహిళలు, పిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారికి సత్వరమే ఉరిశిక్ష విధించాలని, దీనిపై పునః సమీక్షకు వీల్లేని చట్టాలను తీసుకురావాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కె.తారకరామారావు.. ప్రధాని నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. చట్టాలంటే భయం లేకుండా మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్న దుర్మార్గుల నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జస్టిస్ ఫర్ దిశ ఘటన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ప్రధాని దృష్టికి కేటీఆర్ పలు విషయాలు తీసుకెళ్లారు. మహిళలపై అఘాయిత్యాల పట్ల ఆవేదన చెందుతూ, నిస్సహాయంగా న్యాయం కోరుతున్న లక్షలాది మంది తరఫున ఈ వినతి చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. అత్యాచార నిందితులకు శిక్ష అమలులో జాప్యం జరుగుతోందని, న్యాయం ఆలస్యమైతే అన్యాయం జరిగినట్లేనని అన్న నానుడిని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఇలాంటి ఉదంతాల్లో అమలు చేయాల్సిన చట్టాలపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఒకరోజు పాటు చర్చ జరపాలని విజ్ఞప్తి చేశారు. నిందితులకు కఠిన శిక్ష విధించేలా, కాలం చెల్లిన ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ) చట్టాలను సవరించాల్సిన అవసరముందన్నారు. ఏడేళ్ల కింద జరిగిన నిర్భయ ఘటనలో నిందితులకి పడిన ఉరి శిక్షలను ఇప్పటి వరకు అమలు చేయలేదని గుర్తు చేశారు. 9 నెలల పసి పాపపై అత్యాచారం చేసిన నిందితులకు దిగువ కోర్టు విధించిన ఉరి శిక్షను పైకోర్టు జీవిత ఖైదుగా మార్చిన ఉదంతాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. దిశ హత్య కేసులో నిందితులను సత్వరంగా పట్టుకున్నారని, తమ బిడ్డను కోల్పోయి దుఖంలో ఉన్న ఆమె కుటుంబానికి ఎలా స్వాంతన చేకూర్చాలో అర్థం కావట్లేదన్నారు. -
వారికి ఉరే సరి
న్యూఢిల్లీ: సంచలన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో తమకు విధించిన ఉరిశిక్షపై పునఃసమీక్ష కోరుతూ ముగ్గురు దోషులు దాఖలు చేసుకున్న పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. గత తీర్పును పునఃసమీక్షించేందుకు తగిన కారణమేదీ లేదంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం దోషుల పిటిషన్లను తోసిపుచ్చింది. 2012 డిసెంబరు 16న రాత్రి ఢిల్లీలో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు కదులుతున్న బస్సులో అత్యాచారం జరిపి, ఆమెను మాటల్లో చెప్పలేని తీవ్ర శారీరక హింసకు గురిచేసి రోడ్డుపైకి విసిరేసి వెళ్లిపోయారు. అనతరం ఆమె చికిత్స పొందుతూ డిసెంబరు 29న సింగపూర్‌లో ప్రాణాలు కోల్పోయింది. నిర్భయ అత్యాచార ఘటనగా పేర్కొనే ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. మహిళలకు రక్షణ కోరుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆంక్షలను ధిక్కరించి రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. అత్యాచారాలను నిరోధించడానికి ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని కూడా తీసుకురావడం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు 2012 డిసెంబరులోనే అరెస్టు చేశారు. వారిలో ఒకరు నేరానికి పాల్పడిన సమయానికి మైనర్ కావడం, అతను 2013 ఆగస్టులో దోషిగా తేలడంతో మొదట మూడేళ్ల శిక్ష విధించి బాలల కారాగారానికి తరలించారు. అయితే 2015 డిసెంబరులోనే విడుదలయ్యాడు. మిగిలిన ఐదుగురిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణ జరుపుతుండగా 2013 మార్చిలో రామ్ సింగ్ అనే నిందితుడు జైలులోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మిగిలిన నలుగురిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషులుగా తేల్చి 2013 సెప్టెంబరులో మరణ శిక్ష విధించింది. అనంతరం వారికి ఉరిశిక్షను 2014లోనే ఢిల్లీ హైకోర్టు కూడా సమర్థించింది. ఆ తర్వాత దోషులు ఉరిశిక్షను సుప్రీంకోర్టులోనూ సవాల్ చేయడంతో 2017 మే నెలలోనే సుప్రీంకోర్టు కూడా వారికి ఉరిశిక్ష సరైందేనని తీర్పు చెప్పింది. గతంలోనే నిశితంగా విన్నాం.. నిర్భయ అత్యాచారం కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్‌లకు ఉరిశిక్ష విధించింది. ఈ శిక్షను గతంలోనే సుప్రీంకోర్టు కూడా సమర్థించినప్పటికీ, మరణశిక్షపై మరోసారి సమీక్షించాలంటూ ముకేశ్, పవన్, వినయ్‌లు మరోసారి అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. గతంలో విచారణ సమయంలోనే ఈ ముగ్గురి వాదనలను న్యాయమూర్తులు నిశితంగా పరిశీలించారనీ, ఇప్పుడు మళ్లీ నాటి తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదనీ ధర్మాసనం స్పష్టం చేసింది. అక్షయ్ సింగ్ మాత్రం శిక్షపై పునఃసమీక్ష కోరలేదు. మరణ వాంగ్మూలాలపై... నిర్భయ ఇచ్చిన మరణ వాంగ్మూలాలు ఒకదానితో ఒకటి సరిపోలడం లేదనే వాదనను దోషుల తరఫు న్యాయవాది లేవనెత్తగా ధర్మాసనం తోసిపుచ్చింది. దోషులు మళ్లీ మళ్లీ ఇదే అంశాన్ని లేవనెత్తడం సరికాదని మంద లించింది. నిర్భయ డిసెంబరు 16, 21, 25 తేదీల్లో మూడుసార్లు వాంగ్మూలాలిచ్చింది. మరణశిక్షను రద్దు చేయలేం.. బ్రిటన్, పలు లాటిన్ అమెరికా దేశాలు, ఆస్ట్రేలియా తదితర చోట్ల మరణశిక్షను రద్దు చేశారు కాబట్టి భారత్‌లోనూ అలాగే చేయాలనడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. శిక్షా స్మృతిలో మరణశిక్ష ఉన్నన్ని రోజులూ, ఆ శిక్ష విధింపదగ్గ కేసుల్లో కోర్టులు మరణ శిక్షనే విధిస్తాయనీ, ఇందుకు కోర్టులను ఎవరూ నిందించజాలరని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని నిబంధనలు, పౌరుల, నేరస్తుల హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలను పరిశీలించిన మీదట, మరణ శిక్ష విధించడం రాజ్యాంగబద్ధమేనంది. నమ్మకం తిరిగొచ్చింది: నిర్భయ తల్లి ‘ఉరిశిక్షను సుప్రీంకోర్టు మరోసారి సమర్థించడం.. అలాంటి హీన నేరాలకు పాల్పడేవారికి ఓ హెచ్చరిక. న్యాయవ్యవస్థపై మా నమ్మకం తిరిగొచ్చింది. మహిళలు, అమ్మాయిలపై దురాగతాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని నేను కోరుతున్నా’ అని నిర్భయ తల్లి ఆశాదేవి పేర్కొన్నారు. దోషులకు శిక్షను అమలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందనీ, ఈలోపు దేశంలో తన కూతురిలాగే మరెంతోమంది అమ్మాయిలు బలైపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత ఏం చేయొచ్చు? దోషులకు మరణశిక్షను సుప్రీంకోర్టు మరోసారి సమర్థించడంతో ప్రస్తుతం ఉరి శిక్షను తప్పించుకోడానికి మరో రెండు మార్గాలున్నాయి. వాటిలో ఒకటి.. మరణ శిక్షను నిలిపేయాల్సిందిగా కోరుతూ దోషులు మళ్లీ సుప్రీంకోర్టులోనే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం. రెండోది క్షమాభిక్ష పెట్టాల్సిందిగా రాష్ట్రపతిని వేడుకోవడం. ఈ రెండు అవకాశాల్లో కూడా దోషులకు ఊరట లభించని పక్షంలో వారికి ఉరి శిక్ష తప్పదు. కేసులో దోషులకు శిక్షను తగ్గించేందుకు సాయపడేవైనప్పటికీ గతంలో ఎప్పుడూ కోర్టు దృష్టికి తీసుకురాని అంశాలేవైనా ఉంటే, ఆ అంశాలపై విచారణ కోసం దాఖలు చేసేది క్యూరేటివ్ పిటిషన్. అలాంటి అంశాలేవైనా ఉన్నా యని ముందుగా జడ్జీలు భావిస్తేనే పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తారు. లేదంటే పిటిషన్ వేసిన వారికి జరిమానా వేస్తారు. ఉరితో నేరాలు తగ్గవు: ఆమ్నెస్టీ ఉరి శిక్షలు విధించినంత మాత్రాన మహిళలపై నేరాలు తగ్గవని మానవ హక్కుల పోరాట సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా పేర్కొంది. ‘ఉరిశిక్ష వల్ల మహిళలపై నేరాలు కానీ, మరే ఇతర నేరాలు కానీ తగ్గినట్లు రుజువులేవీ లేవు. చట్టాలు సరిగ్గా అమలయ్యేందుకు, వీలైనన్ని ఎక్కువ కేసుల్లో దోషులకు సరైన శిక్ష పడేలా చేసి బాధితులకు న్యాయం చేకూ ర్చేందుకు ప్రభుత్వం నిధులు సమకూర్చాలి. రేప్‌ల చట్టాల సంస్కరణలపై ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిటీ కూడా ఉరిశిక్షను వ్యతిరేకించింది’ అని ఆమ్నెస్టీ ఇండియా ప్రోగ్రాం డైరెక్టర్ అస్మిత అన్నారు. నిర్భయ అత్యాచారం, హత్య కేసులో గత తీర్పును పునఃసమీక్షించేందుకు తగిన కారణమేదీ లేదు. గత విచారణ సమయంలోనే ఈ ముగ్గురి వాదనలను న్యాయమూర్తులు నిశితంగా పరిశీలించారు. ఆ తీర్పులో ఏ తప్పూ లేదు. – సుప్రీంకోర్టు ధర్మాసనం ఉరిశిక్షను సుప్రీంకోర్టు మరోసారి సమర్థించడం.. అలాంటి హీన నేరాలకు పాల్పడే వారికి ఇది ఓ హెచ్చరిక. మహిళలు, అమ్మాయిలపై దురాగతాలు జరగకుండా కఠినచర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరుతున్నా. – నిర్భయ తల్లి ఆశాదేవి సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్న నిర్భయ తల్లిదండ్రులు -
ఆ మృగాళ్లకు ఉరే సరి
ఉధంపూర్: తన బిడ్డను పొట్టనపెట్టుకున్న మృగాళ్లకు ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నట్లు కఠువా హత్యాచార బాధితురాలి తల్లి చెప్పారు. ఈ కేసును సీబీఐకి అప్పగించనక్కర్లేదని, క్రైం బ్రాంచ్ విచారణపై పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ‘నా బిడ్డ చాలా తెలివైనది. పెద్దయ్యాక తనను డాక్టర్‌ను చేయాలనుకున్నాం. మరే కుటుంబం ఇలాంటి వేదనకు గురికాకుండా ఉండాలంటే దోషులకు ఉరి వేయడమే సరైన నిర్ణయం’ అని బాధితురాలి తల్లి డిమాండ్ చేశారు. ఇంతకు ముందు హిందువులతో తమకు సన్నిహిత సంబంధాలుండేవని, కానీ ఇప్పుడు అవి దెబ్బతిన్నాయని, తాము భయభ్రాంతులకు గురవుతున్నామని తెలిపింది. హిందూ ముస్లింలకు తేడా తెలియని తన కూతురుని అత్యంత కిరాతకంగా చంపేసిన సంగతి ఈ లోకానికంతా తెలుసని ఆమె కన్న తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. మరోవైపు, ఈ కేసును విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేయాలని కశ్మీర్ సీఎం మెహబూబా ఆరాష్ట్ర హైకోర్టు సీజేకి లేఖ రాశారు. వైదొలగిన ఇద్దరు బీజేపీ మంత్రులు.. కఠువా రేప్, హత్య ఉదంతంలో నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులను రాష్ట్రకేబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ శ్రీనగర్‌లో నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సత్‌శర్మ రాజీనామా లేఖలను సీఎంకు పంపారు. వాటిని గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. రాజీనామా చేసిన వారిలో అటవీ శాఖ మంత్రి లాల్‌సింగ్, పరిశ్రమల మంత్రి చందర్ ప్రకాశ్ గంగా ఉన్నారు. -
బాలికపై అత్యాచారం.. ఏడుగురికి ఉరి
కొలంబో(శ్రీలంక): నేటి సమాజంలో బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన ఘటనలో ఏడుగురికి శ్రీలంక హైకోర్టు మరణ శిక్ష విధించింది. 2015లో తమిళులు అధికంగా ఉండే జాఫ్నా ప్రావిన్స్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. పున్కుడివితు ప్రాంతానికి చెందిన శివలోగనాథన్(18) అనే యువతి 2015 మే 13వ తేదీన స్కూల్‌కు వెళ్లి కనిపించకుండా పోయింది. మరుసటి రోజు కాళ్లు, చేతులు, కట్టేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులు చూసి దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన జాఫ్నా హైకోర్టు ఏడుగురిని దోషులుగా తేల్చి వారికి మరణశిక్ష విధించింది. ఇందులో ప్రధాన నిందితుడు స్విస్ కుమార్ బాలికపై గ్యాంగ్‌రేప్‌తో పాటు హత్యను వీడియో తీశారు. ఈ హత్యాచారానికి సంబంధించి నిందితులపై పోలీసులు 41 అభియోగాలు మోపారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నిందితులు ఏడుగురికి 30 ఏళ్ల కఠిన కారాగారంతోపాటు మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాక పది లక్షల డాలర్ల జరిమానా విధించాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, నిందితుల్లో ఒకరు జైలు నుంచి తప్పించుకోవటానికి కారకుడయ్యారని సీనియర్ పోలీస్ అధికారి లలిత్ జయసింగేను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సర్వీసులో ఉండగా అరెస్టైన ఉన్నత స్థాయి పోలీసు అధికారి ఈయనే కావటం గమన్హారం. -
ఉరికోత
ప్రాణం తియ్యడం ప్రాణం తీస్తుంది. ఉరివేస్తే గుండె కోస్తుంది. ప్రాణం ఒకరికి పోతే... మరణం ఇంకొకరికి వస్తుంది. మరి శిక్ష ఎవరికి పడినట్టు ? పోయినవాడికా? తీసినవాడికా? నేరము–శిక్ష పై స్టోరీ కాదు ఇది. ఉరి కరెక్టా కాదా.. అన్న డిస్కషనూ కాదు. పాత ఫ్రెంచి సామెత ఒకటి ఉంది. ఉరి తాడుకు కూడా దోషి మెడకు బిగుసుకోవడం ఇష్టం ఉండదట! ఉరి తీసే తలారికి మాత్రం ఇష్టం ఉంటుందా? ఉండదు. శిక్ష విధించిన జడ్జికి ఇష్టం ఉంటుందా? ఉండదు. మనుషులం కదా.. చట్టానికి అతీతంగా ఆలోచిస్తాం. నేరం చేసినవాడు, నేరం చేసేటప్పుడు ఆలోచించకపోవచ్చు. ఉరిశిక్ష వేసేవాళ్లు, ఉరి వేసి ప్రాణం తీసేవారు మాత్రం.. ఒక్క క్షణమైనా ఆలోచిస్తారు. రెండేళ్ల క్రితం. ఇదే నెల. పవన్ కుమార్ ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ కాల్ ఏ రోజైనా, ఏ క్షణమైనా అతడికి రావచ్చు. అందుకు సిద్ధంగా కూడా ఉన్నాడు. నేరస్థుడి బరువుకు సమానమైన ఇసుక బస్తాను ఒక బలమైన తాడుకు వేలాడగట్టి ఆ తాడు పటుత్వాన్ని పరీక్షించి చూస్తున్నాడు. తాడును తన గొంతుకు తగిలించుకుని ముడి ఏ మాత్రం మృదువుగా జారుతున్నదీ శ్రద్ధగా గమనిస్తున్నాడు. అదృష్టం కలిసొస్తే.. అతడికి తొలిసారిగా ఉరితీసే భాగ్యం లభిస్తుంది. అందుకోసమే ఈ ‘ట్రయల్స్’. అతడి తాతగారు ఇందిరాగాంధీ హంతకులను ఉరితీశారు. అతడి తండ్రి 12 మందిని ఉరితీశాడు. ఆ వంశంలో ఇక మిగిలి ఉన్న ఉరితీతగాడు పవన్ కుమార్ ఒక్కడే! అతడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే వాళ్లను ఈ దారిలోకి రానివ్వడం పవన్ కుమార్‌కు ఇష్టం లేదు. పవన్ ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూడ్డానికి కారణం, అప్పటికి నెలక్రితం అతడికి ఓ ఫోన్ కాల్ రావడం. మీరట్‌కి 250 మైళ్ల దూరంలో ఉన్న జైపూర్ సిటీ జైలు నుంచి వచ్చింది ఆ కాల్. ‘శిక్ష పడిన ఒక నేరస్థుడిని ఉరితియ్యాలి. సిద్ధంగా ఉండు’ అన్నది సారాంశం. పవన్ కుమార్ ఉద్వేగానికి లోనయ్యాడు. తొలిసారి తను ఉరితియ్యబోతున్నాడు! అయితే అతడికి ఆ అవకాశం రాలేదు. ఆఖరి నిముషంలోని క్షమాభిక్ష ఉత్తర్వులు ఆ నేరస్థుడిని ఉరిశిక్ష నుండి తప్పించాయి.పవన్‌కు మళ్లీ రెండోసారి ఉరితీసే అవకాశం వచ్చింది! నర హంతకుడు సురీందర్ కోలిని ఉరితియ్యడానికి ఏర్పాట్లు చేసుకొమ్మని అధికారులు వర్తమానం పంపారు. అయితే సురీందర్ ఉరి కూడా చివరి క్షణాలలో వాయిదా పడింది. అందుకు పవన్ నిరుత్సాహపడలేదు. కానీ బాధపడ్డాడు. కనీసం ‘నిర్భయ’ లాంటి కేసుల్లోనైనా నేరస్థులకు తనే స్వయంగా ఉరిశిక్ష విధించాలని అతడి కోరిక. 52 ఏళ్ల (అప్పటికి) పవన్ కుమార్ ప్రభుత్వ రికార్డులలో అధికారికంగా నమోదై ఉన్న తలారి. ఉరితీతలకు నిమిత్తం లేకుండా నెలకు అతడికి 3000 రూపాయల జీతం చేతికొస్తుంటుంది. అయితే అది.. మీరట్ నగరంలో ఏడుగురు సభ్యులున్న కుటుంబాన్ని నడపగలిగేంత మొత్తం కాదు. సైకిల్ స్టాండు వెనుక బట్టల తాన్లను ఎత్తుగా కట్టుకుని ఇల్లిల్లూ తిరిగి అమ్ముతుంటాడు పవన్. ఉరి కళ పవన్‌కి పారంపర్యంగా అబ్బింది కానీ, ఉరి తీసే అవకాశమే ప్రభుత్వం నుండి రాలేదు. 2013లో తీహార్ జైల్లో అఫ్జల్ గురును ఉరితీసింది పవన్‌కుమార్ అని అంటారు. అయితే 2014 సెప్టెంబరులో ‘ది గార్డియన్’ పత్రిక విలేఖరి జేసన్ బర్క్ చేసిన ఇంటర్వ్యూని బట్టి పవన్ కుమార్ అప్పటికింకా తన జీవితంలో ఉరి తీసే తొలి అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలింది 2015 నాటి యాకుబ్ మెమన్ ఉరి. అది కూడా పవన్ తీసిన ఉరి కాదు. హై ప్రొఫైల్ ఉరిశిక్షలు కాకుండా, పవన్ ఇంకెవరినైనా ఉరి తీశాడేమో మరి. మారిన నిబంధలన ప్రకారం తలారి వివరాలను ప్రభుత్వం వెల్లడించడం లేదు కాబట్టి ఎవరు ఎవరిని ఉరితీశారన్నది కచ్చితంగా తెలిసే అవకాశం లేదు. కసబ్‌కి ఉరి శిక్ష పడగానే, అతడిని మేం ఉరి తీస్తామంటే, మేం ఉరితీస్తామని ప్రభుత్వానికి కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వెళ్లాయి! రాజీవ్ టాండన్ అనే ఒక ప్రాపర్టీ డీలర్ అయితే ఏకంగా రాష్ట్రపతికే లెటర్ పెట్టాడు.. ‘ప్లీజ్.. వాణ్ణి ఉరి తీసే అవకాశం నాకు కల్పించండి’ అని. ఒక ఉగ్రవాదిని చేజేతులా ఉరి తీయడాన్ని మించిన దేశ సేవ ఏముంటుందన్న భావనే టాండన్ లెటర్లోనూ, మిగతా దరఖాస్తులలోనూ ప్రధానంగా కనిపించింది. అయితే వాళ్లెవరూ అధికారికంగా తలారులు కారు. ఆ అర్హత ఒక్క మమ్ము సింగ్‌కే ఉంది. ప్రభుత్వ రికార్డులలో ఉన్న చిట్టచివరి భారతీయ తలారి మమ్ము సింగ్. పైన మనం చెప్పుకున్న పవన్ కుమార్ తండ్రి అతడు. ముమ్ము సింగ్ ఉరితాడుకు గ్రీజు పెట్టాడంటే ప్రాణం పోతున్నది కూడా తెలీదు. అంత ఎక్స్పర్ట్. అయితే అతడు కస ను ఉరి తీయడానికి ఏడాది ముందే అనారోగ్యంతో తన 66 ఏళ్ల వయసులో 2011లో చనిపోయాడు. వెంటనే ఆ పోస్టు వారసత్వంగా పవన్‌కుమార్‌కు వచ్చింది కానీ, కసబ్‌ను ఉరితీసే అవకాశం మాత్రం రాలేదు. మరైతే కసబ్‌ను ఉరితీసిన తలారి ఎవరు? బాబు జల్లాద్ అని ఓ పేరు బయటికి వచ్చింది. అది కూడా ఎప్పుడు వచ్చిందంటే.. 2015లో అదే వ్యక్తి యాకుబ్ మెమన్ను ఉరి తీసేందుకు నాగపూర్ వచ్చినప్పుడు! జల్లాద్ అంటే హిందీలో తలారి అని. అంటే తలారి బాబు. తలారి బాబు అన్నది పేరెలా అవుతుంది? జస్ట్ కోడ్ నేమ్. అసలు పేరు యోగేశ్ దేశాయ్ అని, అతడు నాగపూర్ జైలు సూపరింటెండెంట్ అనీ ఆ తర్వాత ప్రచారంలోకి వచ్చింది. కసబ్‌ని, మెమన్‌నీ ఉరి తీసినందుకు అతడికి ఐదూ, ఐదూ.. పదివేల రూపాయలను ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ తలారిబాబుకు ఎర్రవాడ జైల్లో తను ఉరి తీయబోతున్నది కసబ్నేని తెలీదు! అంత రహస్యంగా ఉంచారు. అధికారికంగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న తలారి ఇప్పటి వరకు ఒక్క పవన్ కుమారే అయినా, ఆపద్ధర్మంగా వెళ్లి దోషికి ముసుగు కప్పి, మెడకు తాడు బిగించి, లీవర్ లాగి అతడి ప్రాణాలను పంచభూతాల్లో కలిపేసిన అన్ అఫిషియల్ తలారి ఎక్స్పర్ట్లూ మనం దేశంలో కొంతమంది ఉన్నారు. వారిలో ముఖ్యుడు నాతా మల్లిక్. కోల్‌కతాలోని అలీపూర్ సెంట్రల్ జైలు చేతికింది తలారి అతడు. తన జీవితకాలం మొత్తం మీద అతడు వంద మందికి పైగా ఉరితీశాడు! 2009తో తన 89 ఏళ్ల వయసులో చనిపోయాడు. అతడి ఇరవై ఐదేళ్ల ‘ఉరి కెరీర్’లోని ముఖ్యమైన ఒక సందర్భం ధనంజయ్ ఛటర్జీని ఉరి తియ్యడం. విచారణ ఖైదీగా పద్నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాక కూడా అతడికి ఉరిశిక్ష విధించడం సరికాదని దేశంలోని ప్రగతిశీల ఉదారవాదులు ఎన్ని నినాదాలు చేసి, ఎన్ని కేసులు వేసినా కోర్టు తన తీర్పుకే కట్టుబడి ఉంది. ధనంజయ్‌ని ఉరితియ్యడానికి ముందు నాతా మల్లిక్‌తో ఒక రోజు మొత్తం కూర్చొని జోసీ జోసెఫ్ అనే ఫిల్మ్ మేకర్ ‘ఎ డే ఫ్రమ్ ఎ హ్యాంగ్మన్స్ లైఫ్’ అనే 83 నిమిషాల డాక్యుమెంటరీ తీశాడు. మల్లిక్ కూడా ధనంజయకు ఉరిశిక్ష విధించడం ఇష్టం లేదన్న భావం అందులో లీలగా వ్యక్తం అవుతుంది. లక్నోలోని నఖాస్ ప్రాంతంలో ఉంటాడు అబ్దుల్లా. అతడికో దుకాణం ఉంది. అందులో క్యాండీలు, పెన్సిళ్లు అమ్ముతుంటాడు. నఖాస్లోని ముస్లిం క్వార్టర్స్‌లో ఉంటున్న అబ్దుల్లా గురించి ఆ చుట్టపక్కల వారికి అంతవరకు మాత్రమే తెలుసు. అతడొక హ్యాంగ్‌మన్ అన్న సంగతి అతి రహస్యం. తనొక చెడిపోయిన మనిషినని బాగా దగ్గరి వారికి చెప్పుకుంటుంటాడు అబ్దుల్లా. వృత్తిధర్మంగా నైనా సరే మనుషుల్ని చంపడం పాపం అని అతడు అనుకుంటాడు. అబ్దుల్లా తండ్రి తలారి. చిన్నప్పుడు తండ్రితో పాటు తెల్లవారు జామునే లేచి ఉరికంబాలకు వెళుతుండేవాడు అబ్దుల్లా. ముఖానికి ముసుగు కప్పడం, గొంతుకు ఉరి బిగించడం తండ్రి చేసే పనులైతే, కాళ్ల బొటన వేళ్లను కలిపి తాడుతో కట్టేయడం అబ్దుల్లా పని. తండ్రి చనిపోయాక 1965లో 16 ఏళ్ల వయసులో అబ్దుల్లా తొలిసారి ఒంటరిగా ఉరి బిగించి, లివర్ లాగాడు. ఎప్పుడు ఉరికి తీయడానికి వెళ్లినా, ముందురోజు రాత్రి జైల్లోనే ఉండిపోయి నడిరేయికి, తెల్లవారుజాముకు మధ్య ఏ సమయంలోనో వచ్చే ఆదేశాలపై దిగ్గున లేచి, తంతును ముగించేవాడు అబ్దుల్లా. నిజానికి అది అతడికి ఇష్టం లేని పని. ఎప్పటికప్పుడు అయిష్టంగానే తన జీవితకాలంలో 38 కి పైగా ఉరిశిక్షలను అమలు చేశాడు అబ్దుల్లా. ఇప్పుడీ అరవై ఏడేళ్ల వయసులో ఆయన ఇంట్లోంచి బయటికే రాకుండా గడుపుతున్నారు. ఏ పాప చింతనో ఆయనను ఈ 67 ఏళ్ల వయసులో ప్రక్షాళన చేస్తూ ఉండి ఉండాలి. ఉరి తీయబోయే ముందు హ్యాంగ్‌మన్ మానసిక స్థితి ఎలా ఉంటుంది? స్వాతీ సాథే దృష్టిలో ఇదొక అర్థరహితమైన ప్రశ్న. సాథే గతంలో ఆర్థర్ రోడ్ ప్రిజన్లో జైలరుగా పని చేశాడు. కట్టుదిట్టమైన భద్రత మధ్య కసబ్‌ను ఉంచిన జైలు అది. సినిమాల్లో చూపించే విధంగా ఉరితీసే వ్యక్తి విషణ్ణవదనంతో ఏమీ ఉండడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ చిన్న కానిస్టేబుల్ అయినా చాలా మామూలుగా ఉరి తీసేయగలడు. ముసుగేసి, తాడు బిగించి, బటన్ నొక్కేయడం. అంతే. ఫినిష్’’ అని సాథే చెబుతుప్పుడు.. ఇంత ఈజీనా ఒక ప్రాణాన్ని తీసేయడం అనిపిస్తుంది. ‘కసబ్‌ను ఉరి తీసే ఛాన్సే వస్తే నేను దాన్ని వదులుకోను’ అని కూడా సాథే అన్నాడు కానీ, అతడికి ఆ అవకాశం రాలేదు. మహారాష్ట్రలో చివరి రెండు ఉరి శిక్షలు మెమెన్ (2015), కసబ్ (2012) లవి. దాదాపు 17 ఏళ్ల విరామం తర్వాత ఆ రాష్ట్రంలో అమలైన శిక్షలు ఇవి. ఆర్మీ చీఫ్ జనరల్ అరుణ్ కుమార్ వైద్య హంతకులు సుఖ్‌దేవ్ సింగ్, హరీందర్ సింగ్ జిందాలను 1992లో ఉరి తీశారు. తర్వాత 1995లో అలీబాగ్ నివాసి సుధాకర్ జోషిని (తన యజమానిని, అతడి ఇద్దరు పిల్లల్ని చంపినందుకు) ఉరి తీశారు. రెండుశిక్షల్లో ఉరి తీసిన మరాఠీ హ్యాంగ్‌మన్ అర్జున్ భికా జాదవ్ 1996లో రిటైర్ అయ్యారు. ఆయన తన 33 ఏళ్ల కెరియర్లో 101 మందికి ఉరికర్మలు నిర్వహించారు. కసబ్‌ని కూడా తనే ఉరితీస్తానని అన్నాడు కానీ, అవకాశం రాలేదు. ఉచితంగా ఉరి తీస్తానని కూడా జాదవ్ భారత ప్రభుత్వానికి ఆఫర్ ఇచ్చాడు! లేటెస్టుగా ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఉరి శిక్ష పడిన తాహిర్ మర్చంట్, ఫిరోజ్ ఖాన్‌లను ఎప్పుడు ఉరితీస్తారో తెలియదు. వాళ్లను ఏ తలారుల వారసులు ఉరితీస్తారో తెలియదు. కానీ ఉరికి తలవంచడం, ఉరి వేసి తల తుంచడం.. స్విచ్ వేస్తే ఆటోమేటిగ్గా జరిగిపోయేవి కావు. ఉరికంబం.. దోషికి, తలారికీ.. ఇద్దరికీ సమానంగా నిద్రలేకుండా చేస్తుంది. ఇద్దరి కళ్లకింద అంతర్మథన వలయాలకు కారణం అవుతుంది. ఇద్దరూ నలిగిపోతారు. ఇద్దరూ ఒక నిశ్శబ్ద బలవన్మరణం కోసం వేకువజామునే నిద్ర లేస్తారు. సూర్యోదయం అవుతుండగా ఒక పిట్ట తన ప్రాణాల్ని టపటప కొట్టుకుంటుంది. ఒక పిట్ట ‘దేవుడా ఈ తప్పు నాదు కాదు..’ అని చెంపదెబ్బలు వేసుకుంటుంది. తీసిందెవరో తెలియదు! కసబ్‌ని ఉరితీసిన వ్యక్తే, యాకుబ్ మెమన్‌నీ ఉరి తీశాడని అంటారు. అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం బయటికి వెల్లడి కాలేదు. నాగపూర్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయ్ చేత వాళ్లిద్దరినీ ఉరి తీయించారని కూడా అంటారు. ఇక అఫ్జల్ గురుని మాత్రం ప్రొఫెషనల్ తలారే ఉరి తీశాడని అంటారు. అతడే పవన్ కుమార్. అయితే అతడే అఫ్జల్ గురుని ఉరితీశాడని నిర్థారణగా వెల్లడి కాలేదు. యాకుబ్ మెమన్‌ని ఉరి తీసే అవకాశం రానందుకు మాత్రం పవన్ ఎంతో అసంతృప్తి చెందాడు. యాకుబ్ ఉరికి ముందు పవన్ ఉత్తరప్రదేశ్ డి.జి.పి.కి ఒక ఉత్తరం కూడా రాశాడు. ‘‘మా నాన్నగారు మమ్ము సింగ్ 12 మందిని ఉరితీశారు. మా తాతగారు కల్లు జల్లాద్ ఇందిరాగాంధీ హంతకులను ఉరితీశారు. కాబట్టి వాళ్లందరి వారసుడిగా యాకుబ్‌ని ఉరితీసే అవకాశం నాకు ఇవ్వండి’’ అని అభ్యర్థించాడు. అయితే అప్పటికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా డి.జి.పి. అతడి అభ్యర్థనను మన్నించలేకపోయారు. చివరి ఉరి: ఇండియాలో చివరిసారిగా.. యాకూబ్ మెమన్ను 1993 ముంబై పేలుళ్ల కేసులో 2015 జూలై 30న నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉదయం 6 గం. 30 ని. ఉరి తీశారు. అఫ్జల్ గురును 2001 పార్లమెంటుపై దాడి కేసులో 2013 ఫిబ్రవరి 9న ఢిల్లీ తీహార్ జైల్లో ఉదయం 8 గం.లకు ఉరితీశారు. అజ్మల్ కసబ్‌ను 2008 ముంబై దాడుల కేసులో 2012 నవంబర్ 21న పుణె ఎరవాడ జైల్లో ఉదయం 7.30 నిముషాలకు ఉరి తీశారు. ధనంజయ్ ఛటర్జీని 1990 మార్చి 5న పద్నాలుగేళ్ల స్కూలు బాలికను రేప్ చేసి, చంపేసిన కేసులో 2004 ఆగస్టు 14న కోల్‌కతాలోని ఆలీపూర్ సెంట్రల్ కరెక్షనల్ హోమ్‌లో తెల్లవారు జామున ఉరి తీశారు. (1995 తర్వాత చివరిసారి మనదేశంలో అమలైన ఉరిశిక్ష ధనంజయ్ చటర్జీదే.) -
సైకో కిల్లర్‌కు ఉరిశిక్ష
► నెల్లూరు అదనపు సెషన్స్ కోర్టు తీర్పు నెల్లూరు (లీగల్): అతి కిరాతకంగా నలుగురిని హత్య చేసి.. మరో నలుగురిని హతమార్చేందుకు ప్రయత్నించిన ఉన్మాది కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్‌కు ఓ కేసులో ఉరి శిక్ష విధిస్తూ నెల్లూరు 4వ అదనపు సెషన్స్ కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు ప్రస్తుతం జంట హత్యల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తుండగా.. మహిళను హత్య చేసిన మరో కేసులో అతడికి ప్రాణం పోయేవరకు ఉరి తీయాలంటూ సెషన్స్ కోర్టు జిల్లా జడ్జి బి.శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు. టీచర్‌గా పనిచేస్తూ నెల్లూరు శ్రీసాయి నగర్లో నివాసముండే రావిప్రోలు ప్రభావతిని గత ఏడాది జూలై 9న వెంకటేష్ దారుణంగా హతమార్చాడు. ఆమె ఇంట్లో ఉండగా.. వెంకటేష్ ఇంట్లో జొరబడి ప్రభావతి తలపై సుత్తితో విచక్షణా రహితంగా కొట్టాడు. అడ్డుకునేందుకు వెళ్లిన ఆమె సోదరి కుమారుడు అనంతకృష్ణ, సోదరి కుమార్తె మాధురిపైనా దాడి చేసి వారి తలలు పగులగొట్టాడు. వారి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లను అపహరించుకుపోతుండగా.. ప్రభావతి భర్త నాగేశ్వరరావు అటకాయించారు. స్థానికులు వచ్చి వెంకటేష్‌ను పట్టుకుని బాలాజీ నగర్ పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన ప్రభావతి మృతి చెందారు. అనంతకృష్ణ, మాధురి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వెంకటేష్ చేసిన నేరం రుజువు కావడంతో అతనికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నిందితుడు వెంకటేష్ పెద్దచెరుకూరు శివాలయం పూజారి దంపతులు నూతలపాటి చంద్రమౌళీశ్వరరావు, పుష్పవేణిలను హత్య చేసిన కేసులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. కావలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హత్య కేసులోనూ అతను నిందితుడు. వెంకటేష్ మొత్తం నాలుగు హత్యలు, నాలుగు హత్యాయత్నాలకు పాల్పడ్డాడు. ఇతడిపై పలు దోపిడీ కేసులు ఉన్నాయి. ఉరిశిక్ష పడ్డ ఉన్మాది.. చంద్రబాబుకు వీరాభిమాని సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నాలుగు హత్యలు.. నాలుగు హత్యాయత్నాలు.. అనేక దోపిడీ, చోరీ కేసుల్లో దోషి అయిన కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ సైకో సుత్తి అలియాస్ వెంకటేష్ సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. అతడు టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉండేవాడు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన పాదయాత్రలో ఆయనతో కలసి నడిచాడు. ఇందుకు గుర్తుగా చంద్రబాబుతో కలసి తీసుకున్న ఫొటోలను ఫేస్‌బుక్‌లోనూ ఆప్‌లోడ్ చేశాడు. హిందూపురంలోని బంధువుల ఇంట్లో ఉన్న వెంకటేష్ అక్కడ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. తన మోటార్‌సైకిల్‌పై చంద్రబాబు, బాలకృష్ణ ఫొటోలు ఉంచుకుని తిరిగేవాడు. -
సైకో కిల్లర్‌కు ఉరిశిక్ష
నెల్లూరు అదనపు సెషన్స్ కోర్టు తీర్పు నెల్లూరు (లీగల్): అతి కిరాతకంగా నలుగురిని హత్య చేసి.. మరో నలుగురిని హతమార్చేందుకు ప్రయత్నించిన ఉన్మాది కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటే‹ష్కు ఓ కేసులో ఉరి శిక్ష విధిస్తూ నెల్లూరు 4వ అదనపు సెషన్స్ కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు ప్రస్తుతం జంట హత్యల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తుండగా.. మహిళను హత్య చేసిన మరో కేసులో అతడికి ప్రాణం పోయేవరకు ఉరి తీయాలంటూ సెషన్స్ కోర్టు జిల్లా జడ్జి బి.శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు. టీచర్‌గా పనిచేస్తూ నెల్లూరు శ్రీసాయి నగర్లో నివాసముండే రావిప్రోలు ప్రభావతిని గత ఏడాది జూలై 9న వెంకటేష్ దారుణంగా హతమార్చాడు. ఆమె ఇంట్లో ఉండగా.. వెంకటేష్ ఇంట్లో జొరబడి ప్రభావతి తలపై సుత్తితో విచక్షణా రహితంగా కొట్టాడు. అడ్డుకునేందుకు వెళ్లిన ఆమె సోదరి కుమారుడు అనంతకృష్ణ, సోదరి కుమార్తె మాధురిపైనా దాడి చేసి వారి తలలు పగులగొట్టాడు. వారి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లను అపహరించుకుపోతుండగా.. ప్రభావతి భర్త నాగేశ్వరరావు అటకాయించారు. స్థానికులు వచ్చి వెంకటేష్‌ను పట్టుకుని బాలాజీ నగర్ పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన ప్రభావతి మృతి చెందారు. అనంతకృష్ణ, మాధురి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వెంకటేష్ చేసిన నేరం రుజువు కావడంతో అతనికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నిందితుడు వెంకటేష్ పెద్దచెరుకూరు శివాలయం పూజారి దంపతులు నూతలపాటి చంద్రమౌళీశ్వరరావు, పుష్పవేణిలను హత్య చేసిన కేసులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. కావలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హత్య కేసులోనూ అతను నిందితుడు. వెంకటేష్ మొత్తం నాలుగు హత్యలు, నాలుగు హత్యాయత్నాలకు పాల్పడ్డాడు. ఇతడిపై పలు దోపిడీ కేసులు ఉన్నాయి. -
‘అనూహ్య’ తీర్పు
సర్వత్రా హర్షం దోషి చంద్రభాన్కు ఉరిశిక్ష ఖరారు చేసిన కోర్టు ప్రజల మనోభావాలకు అద్దం పట్టిన తీర్పు తాము అనుకున్న తీర్పే ప్రకటించారన్న అనూహ్య తల్లిదండ్రులు గారాబంగా పెంచుకున్న కూతురు కసాయి చేతిలో చిక్కుకుని దారుణ హత్యకు గురైతే ఆ కుటుంబ సభ్యుల క్షోభ వర్ణనాతీతం. చేయి పట్టుకు నడిచిన కూతురు ఊరు కాని ఊరులో హత్యకు గురికావడం.. ఫిర్యాదు చేస్తే పోలీసుల నుంచే ఈసడింపులు ఎదురవటంతో ఆ తండ్రి పడిన బాధ వర్ణనాతీతం. ఎట్టకేలకు కోర్టు తీర్పుతో ఆ.. వేదనకు, ఆవేదనకు కాస్తంత ఊరట. ఎస్తేరు అనూహ్య కేసులో దోషిగా నిర్ధారించిన చంద్రభాన్కు కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పునివ్వటం సమాజంలో ఇలాంటి మానవ మృగాలకు హెచ్చరికలా ఉందని సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మచిలీపట్నం : దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఎస్తేరు అనూహ్య హత్య కేసులో నిందితుడికి ముంబై సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం కోర్టు వెలువరించిన తీర్పు ప్రజల మనోభావాలకు అద్దం పట్టినట్లుగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు. తాము పైకి చెప్పకున్నా తామనుకున్న తీర్పును కోర్టు ప్రకటించిందని అనూహ్య తల్లిదండ్రులు జోనాథన్ ప్రసాద్, జ్యోత్స్న తెలిపారు. అయినా తమ కుమార్తె జ్ఞాపకాలు తమను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఆ కన్నీళ్లకు వెలకట్టేదెవరు? తమతో కలిసి క్రిస్మస్ పండుగ చేసుకుని ఉద్యోగం నిమిత్తం ముంబై వెళ్లేటప్పుడు.. నాన్నా పెళ్లి సంబంధాలు చూడండని, తాను వేసుకునే పెళ్లి గౌను ఇలా ఉండాలని చెప్పి వెళ్లిన ఒకటి, రెండు రోజుల తరువాత ఆమె విగత జీవిగా మారితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. పోలీసులు సహకరించకున్నా బంధువుల సాయంతో సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కుమార్తె ఆచూకీని కనుగొన్న ఆ తండ్రి కన్నీళ్లకు వెలకట్టలేం. ఆ కుటుంబానికి జరిగిన లోటు పూడ్చలేనిది. మచిలీపట్నానికి చెందిన శింగవరపు ఎస్తేరు అనూహ్య (25) ముంబైలో దారుణ హత్యకు గురి కావడం, పోలీసులు నిందితుడి ఆచూకీని కనుగొనడం, సాక్ష్యాలు సేకరించటం, 2500 మందిని విచారించడం, తాజాగా దోషిగా నిర్ధారించిన చంద్రభాన్కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించడం తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి. -
ఉరిశిక్షే సరియైనది ..
-
కోలీకి ఉరిశిక్ష నిలిపివేత
నిఠారీ హత్యల కేసులో దోషికి వారం పాటు ఊరట న్యూఢిల్లీ: నిఠారీ వరుస హత్యల దోషి సురేందర్ కోలీ ఉరిశిక్ష అమలును సుప్రీంకోర్టు వారం పాటు నిలిపేసింది. ఈ మేరకు జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఏఆర్ దవేతో కూడిన ధర్మాసనం సోమవారం తెల్లవారుజామున ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించిన పిటిషన్‌ను అర్ధరాత్రి పరిశీలించిన ధర్మాసనం ఆ వెంటనే .. స్టే విధించినట్లు కోర్టు అధికారులు తెలిపారు. మీరట్ జైలులో కట్టుదిట్టమైన భద్రత గల బ్యారక్‌లో ఉన్న 42 ఏళ్ల కోలీని సోమవారం ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాల్సి ఉంది. అయితే అందుకు కొద్ది గంటల ముందే కోర్టు ఆదేశాలు అందడంతో జైలు వర్గాలు శిక్ష అమలును నిలిపేశాయి. సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ నేతృత్వంలోని లాయర్ల బృందం కోలీ తరఫున తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శిక్ష అమలుపై స్టే కోరుతూ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను జూలైలో కోర్టు కొట్టేయడం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోలీ లాయర్లు రివ్యూ పిటిషన్ వేశారు. ఖైదీల రివ్యూ పిటిషన్‌పై బహిరంగ విచారణ జరపాలని ఈ నెల 2న సుప్రీం ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. అప్పటివరకు ఉరి అమలును నిలిపేయాలన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. శిక్ష అమలుపై స్టే విధించింది. సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు ఫ్యాక్స్ ద్వారా కోర్టు ఆదేశాలను మీరట్ జైలుకు పంపారు. దీన్ని అందుకున్నట్లు ఉదయం 4.30 గంటలకు జైలు వర్గాలు ధ్రువీకరించాయి. దీంతో శిక్ష అమలును అధికారులు నిలిపేసినట్లు పేర్కొన్నాయి.