దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ దోషులకు ఉరిశిక్షపై విచారణ వాయిదా పడింది. కేసు తదుపరి విచారణను ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా నిర్భయ అత్యాచారం, హత్యకేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్ తనకు విధించిన మరణ శిక్షపై వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ ఉదయం కొట్టివేసిన విషయం తెలిసిందే.