nirbhya case
-
పాపం పండేదెప్పుడు?
-
నిర్భయమే సాహసం
రామ్‌సింగ్ బస్ డ్రైవర్. ముఖేశ్‌సింగ్.. రామ్‌సింగ్ తమ్ముడు. వినయ్ శర్మ జిమ్ ఇన్స్ట్రక్టర్. పవన్ గుప్తా పండ్ల వ్యాపారి. ఇవన్నీ 2012 డిసెంబర్ 15 ముందు వరకు. ఆ ఏడాది డిసెంబర్ 16వ తేదీ నుంచి వీళ్లందరి గుర్తింపు ఒక్కటే.. నిర్భయ అత్యాచార నిందితులు. ఆనాటి నిర్భయ ఘటనతో ఉలిక్కి పడింది భారతదేశంలో ఉన్న వాళ్లు మాత్రమే కాదు. అదే రోజు అమెరికాలో ‘డెల్టా ఉమెన్’ అవార్డు అందుకున్న కీర్తి జయకుమార్ కూడా. కీర్తి ఉలికిపాటు అక్కడితో ఆగిపోలేదు. ‘రెడ్ ఎలిఫెంట్ ఫౌండేషన్’ ఆవిర్భావానికి దారి తీసింది. నిర్భయ ఘటన తన జీవితం మరింత బాధ్యతాయుతమైన మలుపు తీసుకోవడానికి కారణమైందని చెప్తారు కీర్తి జయకుమార్. ‘‘యు.ఎస్.లో అవార్డు అందుకున్న ఆ రోజు రాత్రి నాకు నిద్రపట్టలేదు. ఇండియాలో నా వయసే ఉన్న ఒక యువతి అత్యంత పాశవికంగా లైంగిక దాడికి గురైంది! యునైటెడ్ నేషన్స్ సహకారంతో నేను ప్రపంచదేశాల మహిళల హక్కుల కోసం గళం విప్పాను. అంతర్జాతీయంగా మహిళ ఎదుర్కొంటున్న వివక్ష మీద పోరాడడానికి కార్పొరేట్ లాయర్‌గా ఉద్యోగాన్ని వదిలి గొప్పపని చేశానని కూడా అనుకుంటూ ఉన్నాను! నా పాదాల కింద పెరుగుతున్న కలుపు మొక్కలను ఏరిపారేయకుండా, లైంగిక వివక్షకు గురవుతున్న ఆడపిల్లలకు అండగా నిలబడకుండా ఎక్కడో పని చేయడం ఏమిటి అని ఆలోచించాను. అందుకే తను నివసిస్తున్న చెన్నై నగరంలోని స్కూళ్ల నుంచి, జెండర్ సెన్సిటివిటీ, సేఫ్ టచ్– అన్ సేఫ్ టచ్ అనే అంశాలతోపాటు పిల్లలు మంచి పౌరులుగా ఎదగడానికి నా వంతు ప్రయత్నం చేయాలని నిశ్చయించుకున్నాను’’ అన్నారు కీర్తి. నిర్భయ పోరాటం గడాఫీ హయాంలో లిబియా అత్యాచారానికి గురైన మహిళలు, సిరియాలో రసాయనిక దాడులకు గురైన వాళ్లు, ఐసిస్ నుంచి బయటపడిన యాజ్ది తెగ మహిళలు, పారిపోయి వచ్చిన కాశ్మీరీ పండిట్లు, ఆఫ్ఘన్ శరణార్థులు తిరిగి తమ జీవితాలను నిలబెట్టుకోవడానికి పడిన శ్రమను, వారి జీవన పోరాటాన్ని కథలుగా సమాజంలో వివిధ వర్గాల వారికి, మన మహిళల్లో సమస్యలతో పోరాడే ధైర్యాన్ని నింపుతున్నారు కీర్తి. నిర్భయ ఘటన అనంతరం ఆరు నెలల పాటు సాగిన మధనం తర్వాత రెడ్ ఎలిఫెంట్ ఫౌండేషన్ ప్రారంభించారు కీర్తి. తమ జీవితాన్ని తమకు నచ్చినట్లు జీవించే హక్కు మగవాళ్లకు ఎంతగా ఉందో ఆడవాళ్లకు కూడా అంతే హక్కు ఉందని తెలియచేస్తూ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఉద్యోగ ప్రదేశాలు, నివాస ప్రదేశాల్లో సదస్సులు నిర్వహిస్తున్నాను. ఇప్పటికి 120 వర్క్‌షాప్‌ల ద్వారా 3,500 మంది మహిళలు, బాలల్ని చైతన్యవంతం చేశారు కీర్తి. ‘సాహస్’ నెట్ వర్క్ 2016, మే నెల 15వ తేదీ. కీర్తి ఉదయం నిద్రలేచేటప్పటికి మొబైల్ ఫోన్లో 16 మిస్డ్ కాల్స్, 31 వాట్సాప్ మెసేజ్‌లు. అవన్నీ ఒకే నంబర్ నుంచి వచ్చినవే! ఐరోపాలోని ఒక స్నేహితురాలి నుంచి సహాయం కోరుతూ వచ్చిన ఫోన్ కాల్స్, మెసేజ్‌లూ అవన్నీ. ఆమెను ఆమె భర్త రోజూ హింసిస్తున్నాడు. ఉదయం తాను బయటకు వెళ్లేటప్పుడు గదిలో పెట్టి తలుపు వేసి వెళ్లేవాడు. ఓ రోజు అర్జెంటు పని మీద హడావుడిగా వెళ్తూ ఎప్పటిలాగ ఆమె గదికి తాళం వేయడం మర్చిపోయాడు. ఆ రోజు ఆమె భర్త తిరిగి వచ్చే లోపు సహాయం కోసం తెలిసిన వాళ్లందరికీ ఇంట్లో ఉన్న స్పేర్ ఫోన్ నుంచి కాల్స్ చేసింది, మెసేజ్‌లు పెట్టింది. ఆ తర్వాత ఆ సిమ్ కార్డ్‌ని ముక్కలు చేసి పారేసింది. పెళ్లికి ముందు ఆమె ఎప్పుడూ ఇండియా దాటి బయటి దేశానికి వెళ్లనే లేదు. అప్పుడు తానున్న దేశంలో చట్టాల గురించి ఆమెను ఏ మాత్రం అవగాహన లేదు. ఆ స్థితిలో ఆమెకు తన సమీపంలో ఉన్న ఫ్రెండ్ ఆదుకుని, బంధువుల ఇంటికి చేర్చింది. ‘‘తర్వాత మా రెడ్ ఎలిఫెంట్ ఫౌండేషన్ పెద్ద ఎక్సర్‌సైజ్‌నే చేసింది. మహిళల కోసం పని చేసే ఐదు వేల సంస్థలను ‘సాహస్’ అనే వెబ్ యాప్‌తో అనుసంధానం చేశాం. ఆ సంస్థలు 197 దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు నలభైవేల సంస్థలు మా ‘సాహస్’ యాప్ నెట్వర్క్ పరిధిలోకి వచ్చాయి. మొత్తం ఎనిమిది భాషల్లో సమాచారం చేరవేయడం జరుగుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది వేల మంది జీవితాలు ఒడ్డుకు చేరాయి. వైద్యసేవలు, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ సహకారం, తలదాచుకోవడానికి హోమ్‌లు, విద్య– ఉపాధి అవకాశాల కల్పన వంటి సేవలు అందిస్తున్నాం. చేసింది, చేస్తున్నది చెప్పుకుంటే పూర్తయ్యే ఉద్యమం కాదిది. కొన్ని తరాల పాటు అవిశ్రాంతంగా సాగించాల్సిన మహోద్యమం’’ అని ముగించారు కీర్తి. – మంజీర శక్తినిచ్చిన డైరీ ‘ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్’ పుస్తకం కీర్తి జయకుమార్‌లో నిశ్శబ్దంగా శక్తిని నింపింది. చెన్నైలోని ‘స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ లా’లో న్యాయశాస్త్రం చదివారు కీర్తి. కోస్టారికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ పీస్’ నుంచి శాంతి, సంఘర్షణ, జెండర్ స్టడీస్ చదివారు. విద్యార్థి దశలో ఆమె హ్యూమనేటేరియన్ ‘లా’, మానవ హక్కుల చట్టం, పాలసీల ఉల్లంఘన వంటి అంశాల మీద పేపర్లు సమర్పించారు. అమెరికాకు చెందిన ‘డెల్టా ఉమెన్’ ఎన్జీవోతో పనిచేశారు కీర్తి. ఆ అవార్డు అందుకున్న రోజే నిర్భయ ఘటన జరిగింది. కీర్తి యూఎస్ ప్రెసిడెంట్ సర్వీస్ మెడల్, యూఎన్ ఆన్లైన్ వాలంటీర్ ఆఫ్ ది అవార్డులు కూడా అందుకున్నారు. -
దేవుడే అడిగినా
‘‘పాపం ఆ పిల్లలకు మీరైనా క్షమాభిక్ష ప్రసాదించవచ్చు కదా’’ అని నిర్భయ తల్లి ఆశాదేవిని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అడిగినప్పుడు.. ‘‘దేవుడే వచ్చి అడిగినా నేను క్షమించను’’ అని ఆశాదేవి అన్నారంటే.. దేవుడిక్కూడా వాళ్లను క్షమించమని సిఫారసు చేసే హక్కు లేదని ఆమె గట్టిగా చెప్పడమే. మాధవ్ శింగరాజు ఉరిశిక్ష పడిన ‘నిర్భయ’ దోషులు చరిత్రలో కలిసిపోడానికి మెడ దగ్గరి ఎముక ‘టప్’మన్నంత క్షణకాల సమయం చాలు. ఆ క్షణం తర్వాత ఎవరైనా మాట్లాడేందుకేమీ ఉండదు. ఎవరికీ గుర్తొచ్చేందుకూ ఏమీ ఉండదు. ‘ముఖేశ్ సింగ్ అండ్ కో’ ఏమీ భగత్‌సింగ్ అండ్ టీమ్ కాదు.. మార్చి 23న బ్రిటిష్ ప్రభుత్వం వారిని ఉరితీసిందని ఏటా చెప్పుకుని ఘనమైన నివాళి ఘటించడానికి. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ‘నిర్భయ’ దోషులకు ఉరి అంటున్నారు కాబట్టి.. ఆ రోజు మనం నిద్రలేచి ఏ ఏడుగంటలకో పేపర్లోనో, టీవీలోనో వార్తను చూసి.. ‘ఉరి తీసేశారా..’ అనుకుంటాం తప్ప, షాక్ కొట్టినట్లుగా ‘అయ్యో ఉరి తీసేశారా!’ అని పెద్దగా అరుస్తూ చేతిలోని టీ కప్పును మీద ఒలకబోసుకోం. వాళ్లేమీ స్వాతంత్య్ర సంగ్రామ యువ కిశోరాలు కాదు. వాళ్లను ఉరితీశారన్న వార్తను చూసి మనం కోమాలోకి వెళ్లిపోడానికి. మన సంగతి అలా ఉంచండి. నిర్భయ తల్లి ఆశాదేవి మాత్రం ఈసారి కోమాలోకి వెళ్లిపోయేట్లే ఉన్నారు. వాళ్ల ఉరి తేదీ ఫిబ్రవరి 1 నుంచి మళ్లీ కనుక వాయిదా పడితే! శుక్రవారం ఆమెది దాదాపుగా అదే పరిస్థితి. ఢిల్లీ కోర్టు ఉరిని వాయిదా వేసిందని తెలియగానే నిస్పృహ ఆమె కళ్లలోంచి ఉబికి ఉబికి వచ్చింది. ‘హమే బస్ తారీఖ్ పే తారీఖ్ మిల్ రహీ హై’ (తేదీ తర్వాత తేదీ మాత్రమే మాకు లభిస్తోంది) అని ఆక్రోశించారు. ‘‘నా కూతుర్ని పాడు చేసినట్లే, ఆ నలుగురూ న్యాయదేవతనూ పాడు చేస్తున్నారు’’ అని వేదన పడ్డారు. ప్రతిసారీ ఆమెకు ఇలాగే అవుతోంది. కోర్టు శిక్షను విధించినప్పుడు తన కూతురికి న్యాయం జరిగిందని కళ్లు తుడుచుకోవడం, శిక్ష అమలు వాయిదా పడగానే తన కూతురికి అసలు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందా అని కన్నీళ్లు పెట్టుకోవడం! నవ్విస్తే అంతలోనే నవ్వి, ఏడిపిస్తే అంతలోనే ఏడ్చే పిల్లలా తయారైంది ఆమె మానసిక స్థితి. జనవరి 22 ఉదయం 7 గంటలకు ఉరిని ఖరారు చేస్తూ ఈ నెల 7న కోర్టు డెత్ వారంట్ జారీ చెయ్యగానే తన ఏడేళ్ల పోరాటం ఫలించిందనే నిర్భయ తల్లి అనుకున్నారు. ఆ లోపలే ఉరి ఫిబ్రవరి అనే మాట! ఉరికి తీహార్‌లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తలారి కూడా తాళ్లు పేనుకుని కూర్చున్నాడు. దోషుల బరువుకన్నా యాభై కిలోలు ఎక్కువ బరువున్న ఇసుక బస్తాలను ‘ఉరి తీసి’ పరీక్షించుకున్నారు. కుటుంబ సభ్యులొచ్చి చివరి చూపు చూసి వెళ్తున్నారు. ఇక అంతా అయిపోయినట్లే.. మిగిలింది అంతిమశ్వాసే అనుకుంటుండగా.. మరోసారి ఉరి వాయిదా. ఇంత సాగతీత ఏమిటని నిర్భయ తల్లి హృదయం క్షోభించడం న్యాయమే. అయితే చట్టం తీసుకుంటున్న సమయం కూడా ఆ తల్లికి న్యాయం చేయడానికే. మూడేళ్ల క్రితమే 2017 మే 5 న సుప్రీంకోర్టు.. ‘ఉరే సరి’ అని కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అదే సమయంలో ఉరిని తప్పించుకునేందుకు దోషులకు చట్టంలో ఉన్న మూడు దారులను కూడా చూపించింది. మొదటిది రివ్యూ పిటిషన్. అది ఫలించకపోతే క్యురేటివ్ పిటిషన్. అదీ నిష్ఫలం అయితే క్షమాభిక్ష పిటిషన్. మొదటి రెండు పిటిషన్లు సుప్రీంకోర్టులో వేసేవి. క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతికి సమర్పించుకునేది. దోషులు నలుగురూ ఒకేసారి ఒక దాని తర్వాత ఒకటిగా ఈ మూడు దారుల్లోనూ వెళ్లిపోయి, అక్కడ కూడా వాళ్లకేమీ దక్కకపోయుంటే ఈ సరికి బహుశా ఉరి అమలు జరిగి ఉండేది. కానీ అలా జరగలేదు. మొదట ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా ఏమాత్రం జాప్యం లేకుండా రివ్యూ పిటిషన్లు వేశారు. వేసిన ఏడాది తర్వాత 2018 జూలై 9న సుప్రీంకోర్టు వాటిని తిరస్కరించింది. అక్షయ్ ఠాకూర్ ఒక్కడూ 2019 డిసెంబర్ 10న రివ్యూ పిటిషన్ వేశాడు! నిజానికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నెలలోపే రివ్యూ పిటిషన్ వెయ్యాలి. అయితే బలమైన కారణాలేవో చూపించి అక్షయ్ తరఫు న్యాయవాదులు ఆలస్యంగా రివ్యూ పిటిషన్ వేశారు. వేసిన ఎనిమిది రోజుల్లోనే అది తిరస్కరణకు గురైంది. ఇక ఈ నలుగురికీ మిగిలిన రెండో దారి క్యురేటివ్ పిటిషన్. గత ఏడాది జనవరి 9న ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ క్యురేటివ్ పిటిషన్‌ను పెట్టుకున్నారు. కోర్టు వాటిని ఐదు రోజులకే (జనవరి 14న) తిరస్కరించింది. అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా అసలు క్యురేటివ్ పిటిషనే పెట్టుకోలేదు. రివ్యూ పిటిషన్లా నెలలోపు కాకుండా, ఉరి తేదీ లోపు ఎప్పుడైనా క్యురేటివ్ పిటిషన్ వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరి 1న ఉరి అన్నారు కాబట్టి ఆ లోపు అక్షయ్, పవన్ క్యురేటివ్ పిటిషన్ పెట్టుకునే వీలు ఉంటుంది. ఆ తర్వాత ఇక ఈ నలుగురికీ మిగిలి ఉండే ఏకైక మార్గం రాష్ట్రపతి క్షమాభిక్ష. ముఖేశ్ సింగ్ ఒక్కడే ఈ జనవరి 14న క్షమాభిక్ష కోరాడు. రాష్ట్రపతి దానిని జనవరి 17నే తిరస్కరించారు. క్షమాభిక్షను తిరస్కరించిన తర్వాత ఉరి తీయడానికి కనీసం వ్యవధి 14 రోజులు ఉండాలి కనుక రెండో డెత్ వారెంట్ ఫిబ్రవరి 1 అయింది. తక్కిన ముగ్గురూ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకోలేదు.వీళ్లలో ఒకరో ఇద్దరో లేక ముగ్గురూనో క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుని, ఆ పిటిషన్ ఢిల్లీ ప్రభుత్వానికి, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రభుత్వానికి వెళ్లి, అక్కడి నుంచి రాష్ట్రపతికి చేరి, ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే. ఆ తీసుకున్న తేదీ నుంచి ఉరి మళ్లీ పద్నాలుగు రోజులు వాయిదా పడుతుంది.ఒకే నేరంలో దోషులుగా నిర్థారణ అయినవారిని విడివిడిగా ఉరి తీసిన సందర్భాలు గతంలో లేవు కాబట్టి.. చివరి మూడు దారులనూ ఉపయోగించుకున్న ముఖేశ్ సింగ్ కూడా.. క్యురేటివ్ పిటిషన్, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ వెయ్యని అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా; క్యురేటివ్ పిటిషన్ వేసినా, క్షమాభిక్ష పిటిషన్ వెయ్యని వినయ్ శర్మల మార్గాలన్నీ మూసుకుపోయే వరకు క్షణాలను లెక్కపెడుతూ ఉండవలసిందే. ఈ నలుగురితో పాటు క్షణాలను లెక్కిస్తూ ఉన్న ఐదో వ్యక్తి నిర్భయ తల్లి ఆశాదేవి. అక్షయ్, ముఖేశ్, వినయ్, పవన్.. ఈ ఏడాది జనవరి ఏడున డెత్ వారంట్ వచ్చినప్పటి నుంచి మాత్రమే క్షణాలను లెక్కిస్తూ ఉంటే.. ఆశాదేవి, ఏడేళ్లుగా దోషుల చివరి క్షణాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ►ఇందిరా జైసింగ్ విజ్ఞప్తిని పెద్ద మనసుతో అర్థం చేసుకుంటే కనుక.. ఈ దేశంలో రోజుకు 90 మంది తల్లులు తమ కూతుళ్లపై అత్యాచారం చేసిన దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడానికి క్యూలో నిలబడవలసి వస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. దేశంలో రోజూ సగటున తొంభై రేప్‌లు జరుగుతున్నాయి మరి! -
నిర్భయ దోషుల ఉరిశిక్ష విచారణ వాయిదా
-
నిర్భయ దోషుల ఉరిశిక్ష విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ దోషులకు ఉరిశిక్షపై విచారణ వాయిదా పడింది. కేసు తదుపరి విచారణను ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా నిర్భయ అత్యాచారం, హత్యకేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్ తనకు విధించిన మరణ శిక్షపై వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ ఉదయం కొట్టివేసిన విషయం తెలిసిందే. నిర్భయ దోషులకు ఉరిశిక్ష సరైందేనని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దోషికి సమీక్ష కోరే హక్కు లేదని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్‌కు దోషుల తరఫు న్యాయవాది మూడు వారాల గడువు కోరినా... క్షమాభిక్షకు వారం రోజులు చాలని తెలిపింది. మరోవైపు 14 రోజుల్లోగా దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని నిర్భయ తల్లిదండ్రులు కోరారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పై నిర్భయ తల్లి ఆశాదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణ వాయిదా వేసిన తర్వాత స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. పరిష్కారం కోసం దోషులకు సమయం కేటాయించి కోర్టు ఒకవైపు నుంచి మాత్రమే చూస్తుందని ఆమె మీడియాకు తెలిపారు. తదుపరి విచారణ తర్వాత కూడా తీర్పు వస్తుందని మాకు నమ్మకం లేదంటూ స్పందించారు. (చదవండి : నిర్భయ దోషి రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు) -
జైల్లో డమ్మీ ఉరి ట్రయల్స్
-
నిర్భయ దోషులందరూ తీహార్ జైల్లో
న్యూఢిల్లీ: ఢిల్లీలో నిర్భయపై మూకుమ్మడి అత్యాచారం, హత్య కేసులో దోషులకి ఉరి శిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బిహార్ బక్సర్ జైలు నుంచి ఉరితాళ్లను తీసుకువస్తున్నారు. ఉరికంబంపై శిక్ష అమలు ఎలా జరపాలో నలుగురు దోషుల బరువు, ఎత్తున్న దిష్టిబొమ్మలకి ఉరి తీసి డమ్మీ ట్రయల్స్ వేసి చూశారని జైలు వర్గాలు తెలిపాయి. దోషులందరినీ ప్రస్తుతం తీహార్ జైలు నంబర్ మూడులో వేర్వేరు గదుల్లో ఉంచి సీసీటీవీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జైలు నంబర్ 3లోనే దోషులకి ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఇటీవల మండోలి జైలులో ఉన్న పవన్ కుమార్ గుప్తాను తీహార్ జైలుకి తరలించినట్టు డైరెక్టర్ జనరల్ (జైళ్లు) సందీప్ గోయెల్ వెల్లడించారు. ముఖేష్ సింగ్, అక్షయ్ సింగ్, వినయ్ శర్మను ఉంచిన జైలు నెంబర్3లో పవన్ కుమార్ గుప్తాను ఉంచారు. నిర్భయను 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి బస్సులో ఆరుగురు రాక్షసులు మూకుమ్మడిగా అత్యాచారం చేయడమే కాకుండా, దారుణంగా హింసించడంతో ఆమె కొన్నాళ్లు మృత్యువుతో పోరాడి సింగపూర్ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆరుగురు దోషుల్లో ఒకరైన రామ్‌సింగ్ జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్ కావడంతో మూడేళ్ల పాటు జువైనల్ హోంకి పంపారు. మిగిలిన నలుగురిని ఏ రోజైతే అత్యంత పాశవికంగా నిర్భయపై అత్యాచారానికి పాల్పడ్డారో అదే రోజు డిసెంబర్ 16న ఉరితీస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దోషులందరూ ఒకే జైలుకి చేరడంతో వారికి ఉరిశిక్ష అమలు జరపడం ఖాయమన్న వార్తలకు ఊతమిచ్చినట్టయింది. ఢిల్లీ కాలుష్యం చంపేస్తోంది.మళ్లీ ఉరి ఎందుకు ? సుప్రీంలో అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు దోషుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ మరణ దండనని సమీక్షించాల్సిందిగా సుప్రీం కోర్టుకెక్కినట్టు అతని తరఫు లాయర్ ఏపీ సింగ్ వెల్లడించారు. తన రివ్యూ పిటిషన్లో అక్షయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీలో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ఎలాగూ తమని చంపేస్తోందని, తమ ఆయుష్షుని తగ్గిస్తోందని మళ్లీ ఉరి శిక్ష ఎందుకంటూ ప్రశ్నించాడు. 2018, జూలై 9న అత్యున్నత న్యాయస్థానం మిగిలిన ముగ్గురు దోషులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ని కొట్టి వేసింది. అప్పుడు రివ్యూ పిటిషన్ వేయని అక్షయ్ ఉరి శిక్ష అమలుకు సన్నాహాలు జరుగుతున్న వేళ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు కొట్టివేసే అవకాశాలే ఎక్కువున్నాయి. -
అత్యాచారం రుజువైతే తలనరికి చంపుతారు
‘దిశ’అత్యాచార నిందితుల ఎన్కౌంటర్ ద్వారా వారి తల్లిదండ్రులకు కాస్త ఉపశమనం వచ్చిందేమో కానీ పూర్తి స్థాయి న్యాయం జరిగిందా? సాహో తెలంగాణ పోలీసు అని జనం జేజేలు పలుకుతున్నారు సరే, భవిష్యత్‌లో అత్యాచారాలకు అడ్డుకట్ట పడుతుందన్న భరోసా ఉందా? అత్యంత క్రూరమైన అత్యాచార కేసులు కూడా ఏళ్లకి ఏళ్లు కోర్టుల్లో నానుతూ ఉంటే బాధితులకు న్యాయం జరిగేదెప్పుడు?. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఒక్కటే. రేపిస్టులను బహిరంగంగా ఉరి తీయండి.. సత్వర న్యాయం జరిగేలా చూడండి. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను సిద్ధాంతం మన దగ్గర సాధ్యమేనా? ఇదే ఇవాళ్టి సండే స్పెషల్... న్యాయం ఆలస్యమైతే అన్యాయమే... దేశం నలుమూలలా ప్రతిరోజూ మహిళల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. సగటున దేశవ్యాప్తంగా రోజుకు 92 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్ని విచారించడానికి కోర్టుల్లో తగిన సిబ్బంది లేకపోవడంతో పెండింగ్ కేసుల సంఖ్య తడిసి మోపెడవుతోంది. ఇక అత్యాచార కేసుల్లో దోషులుగా తేలేవారి సంఖ్య కూడా అత్యంత స్వల్పంగా ఉంది. చాలా ఏళ్లపాటు 25% నుంచి 30% కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. కానీ 2014లో మాత్రం శిక్షల రేటు 27 నుంచి 38 శాతానికి పెరిగింది. మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో సత్వర న్యాయానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రకటనలు చేస్తోంది. 2019 నాటికి దేశంలో 664 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉంటే, ప్రభుత్వం వాటిని 1,023కి పెంచుతామని చెబుతోంది. కానీ అవి కూడా సరిగా పనిచేస్తున్న దాఖలాలు లేవు. ఉరి శిక్ష పడాలంటే మన దేశంలో సగటున అయిదేళ్లు పడుతోంది. ఎందుకంటే ప్రత్యేక కోర్టులో శిక్ష పడితే, పై కోర్టుకి వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు... అక్కడ శిక్ష ఖరారు చేసినా అమలవుతుందన్న గ్యారంటీ లేదు. మరణ శిక్ష పడిన దోషులకి రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే హక్కు ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి కొన్ని కేసుల్లో ఉరిశిక్ష అమలుకే 20 ఏళ్లు దోషులు జైల్లో ఉన్న సందర్భాలున్నాయి. అందుకే సత్వర న్యాయం అన్నది మన దగ్గర సాధ్యపడటం లేదు. 1991 నుంచి 2017, డిసెంబర్ చివరి నాటికి 371 మందికి ఉరిశిక్ష పడింది. కానీ గత 15 ఏళ్లలో నలుగురికి మాత్రమే ఉరిశిక్ష అమలు జరిగిందంటే న్యాయం జరగడంలో ఎంత అన్యాయం జరుగుతుందో అర్థమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేరము..శిక్ష.. మన దేశంలో అత్యాచార కేసులు అంటే నిర్భయ ఘటనకి ముందు.. తర్వాత.. అని మాట్లాడుకోవాలి. దేశం నలుమూలలా గంటకో రేప్ జరుగుతున్నప్పటికీ 2012 ఢిల్లీలో అర్ధరాత్రి నిర్భయని అమానుషంగా హింసించి మరీ గ్యాంగ్ రేప్ చేయడంతో దేశం యావత్ కదిలి వచ్చింది. యువత అంతా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి రేపిస్టులని ఉరితీయాలంటూ ఎలుగెత్తి నినదించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చింది. అప్పటివరకు రేపిస్టులకు ఏడేళ్లు ఉన్న శిక్షని 20 ఏళ్లకి పెంచారు. గ్యాంగ్ రేప్‌లు, పదే పదే అత్యాచారాలు చేసిన వారికి ఉరి శిక్ష అమలు చేయాలంటూ చట్టం తెచ్చారు. అయినా అత్యాచార కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. కామాంధులు చిన్నారుల్ని కూడా చిదిమేస్తుండటం, మైనర్లు కూడా అత్యాచారాలకు తెగబడుతూ ఉండటంతో 2015లో జువెనైల్ జస్టిస్ చట్టానికి సవరణలు తెచ్చారు. అత్యాచారం, హత్య కేసుల్లో 16 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న వారిని మేజర్లుగా పరిగణించారు. ఇక 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల్ని అత్యాచారం చేస్తే ఉరే సరి అని ఆ చట్టం చెబుతోంది. ఈ చట్టం తీసుకువచ్చిన తర్వాత అత్యాచార కేసులు తగ్గకపోగా మరింత పెరిగిపోతున్నాయి. జాతీయ నేర గణాంక నమోదు సంస్థ తాజా గణాంకాల ప్రకారం... 2012లో(నిర్భయ ఘటనకు ముందు).. 25 వేల కంటే తక్కువ 2013లో.. 33,707 2016లో.. 38,947 2017లో.. 30,000 ఈ చట్టం వల్ల అత్యాచార కేసులు తగ్గకపోయినా, మహిళలు నిర్భయంగా పోలీసు స్టేషన్ల గడపెక్కి కేసు నమోదు చేసే వాతావరణమైతే వచ్చింది. ఇది కాస్త ఊరట కలిగించే అంశం. 15 ఏళ్లలో నలుగురికి ఉరి.. 2004 ఆగస్టు 14: టీనేజీ అమ్మాయిని అత్యాచారం, హత్య కేసులో దోషి అయిన ధనుంజయ్ ఛటర్జీని పశ్చిమ బెంగాల్లో అలీపూర్ సెంట్రల్ జైలులో ఉరితీశారు. అతని 42వ పుట్టిన రోజునాడే ఉరిశిక్ష అమలు చేశారు. 2012 నవంబర్ 21: ముంబై నగరంలో 2008లో జరిగిన దాడుల్లో పట్టుబడిన మహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్‌కి ఉరిశిక్ష అమలు చేశారు. పుణేలో యరవాడ జైల్లో అతనికి ఉరిశిక్ష అమలు చేశారు. 2013 ఫిబ్రవరి 9: పార్లమెంట్‌పై 2001లో దాడి కేసులో దోషి మహమ్మద్ అఫ్జల్ గురుకి పన్నెండేళ్ల తర్వాత ఉరిశిక్ష విధించారు. తీహార్ జైల్లో అతనికి ఉరిశిక్ష అమలు జరిగింది. 2015 జూలై 30: 1993 ముంబై వరుస పేలుళ్లలో దోషి యాకూబ్ మెమన్‌కి ఉరిశిక్ష అమలైంది. మహారాష్ట్రలో నాగపూర్ జైల్లో అతన్ని ఉరి తీశారు. ఇతర దేశాల్లో శిక్షలు ఇలా.. చైనా: అత్యాచార నిందితుల్ని నేరుగా ఉరికంబం ఎక్కిస్తారు. కొన్ని కేసుల్లో దోషుల పురుషాంగాన్ని తొలగించి నపుంసకులుగా కూడా మారుస్తారు. ఇదంతా నేరం జరిగిన రోజుల వ్యవధిలో జరిగిపోతుంది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోయినా ఉరిశిక్ష విధించడం విమర్శలకు దారి తీసిన సందర్భాలూ ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఉరి తీశాక వారు నిర్దోషులని తేలడం గమనార్హం. ఇరాన్: అత్యాచార దోషుల్ని బహిరంగంగా కాల్చి చంపుతారు. లేదంటే ఉరితీస్తారు. కొన్ని సందర్భాల్లో బాధితురాలు క్షమించడానికి అంగీకరిస్తే, ఉరి శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అఫ్గానిస్తాన్: రేపిస్టులకు శిక్ష పడిన నాలుగు రోజుల్లోనే ఉరి తియ్యడమో, లేదంటే కాల్చి చంపడమో చేస్తారు. యూఏఈ: రేప్ చేసిన ఏడు రోజుల్లో ఉరికంబం ఎక్కిస్తారు. సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో అత్యాచారం నేరం రుజువైతే బహిరంగంగా తలనరికి చంపుతారు. నెదర్లాండ్స్: మహిళలపై జరిగే లైంగిక వేధింపులన్నింటినీ అత్యాచారం కిందే పరిగణిస్తారు. అమ్మాయి అనుమతి లేకుండా ముద్దు పెట్టుకున్నా అక్కడ నేరుగా జైలుకి పంపిస్తారు. నేర తీవ్రత ఆధారంగా 4 నుంచి 5 సంవత్సరాలు శిక్ష ఉంటుంది. ఫ్రాన్స్: అత్యాచార చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. అత్యాచార కేసుల్లో 15 ఏళ్లు కారాగార శిక్ష విధిస్తారు. జైల్లో ఉన్నన్ని రోజులు వారిని చిత్రహింసలకు గురి చేస్తారు. నేర తీవ్రతని బట్టి దానిని 30 ఏళ్లకు పెంచుతారు. అమెరికా: అమెరికాలో రెండు రకాల చట్టాలున్నాయి. ఒకటి కేంద్ర చట్టమైతే, రెండోది రాష్ట్రాలకు సంబంధించింది. ఫెడరల్ లా కింద అత్యాచార నేరం నిరూపణ అయితే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. ఇక రాష్ట్ర పరిధిలో తీసుకుంటే రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య శిక్షల్లో తేడాలుంటాయి. -
మ్యాంగో జ్యూస్ కొనిస్తానని.. ఆ మృగాడు!
ఢిల్లీ: తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి.. ఓ కామాంధుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి ఇదే అదనుగా భావించిన మహ్మద్ నన్హే (24) , ఆరేళ్ల చిన్నారికి మ్యాంగో జ్యూస్ కొనిస్తానని మాయమాటలు చెప్పి ఏకాంతంగా ఉన్న చోటుకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఏడుస్తూ, రక్తపు మడుగులో ఉన్న ఆ చిన్నారిని గుర్తించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చేర్పించాడు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరా తీయగా.. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ప్రభుత్వం బాధితురాలికి కుటుంబానికి 10 లక్షల నష్ట పరిహారం ప్రకటించింది. ఈ దుర్ఘటనపై డిల్లీ మహిళా కమీషన్ స్పందించి.. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. -
ఈసారి ఓటేయక పోవచ్చన్న నిర్భయ తల్లిదండ్రులు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈసారి ఎన్నికల్లో తాము ఓటువేయక పోవచ్చని ‘నిర్భయ’ తల్లిదండ్రులు ఆషాదేవి, బద్రీనాథ్ సింగ్‌లు గురువారం చెప్పారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఏమీ చేయని రాజకీయ పార్టీలతో తాము అలసిపోయామని అన్నారు. తమ కుమార్తెపై దారుణ కృత్యానికి పాల్పడిన నేరస్తులు ఇంకా బతికే ఉండటాన్ని బట్టి.. పార్టీలు వ్యక్తం చేసిన సానుభూతి, వారిచ్చిన హామీలు అన్నీ కేవలం ఓ ‘రాజకీయ గిమ్మిక్కు’గా తేలిపోయిందని చెప్పారు. అమానుష కాండ బాధితులుగానే మిగులుతున్న మహిళలు, పిల్లలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టడం లేదని వారు విమర్శించారు. -
క్రైమ్ గేట్
ఇండియా గేట్.. అమర వీరుల స్ఫూర్తి జ్వాలను కాపాడే గూడు! ఇండియా గేట్ మీద అమర వీరుల పేర్లు చెక్కి ఉంటాయి.దాని దగ్గర్లోనే మరో చిన్న కట్టడంలో దేశం కోసం ప్రాణాలొడ్డిన అనామక వీరుల కోసం ఓ జ్యోతి వెలుగుతూంటుంది!అక్కడే 2012లో ఇంకో అనామక నిర్భయ కోసం ఒక పోరాటం జరిగింది.. ఆ పోరాటం దేశాన్ని కుదిపేయడమే కాదు.. మహిళలను కాపాడుకోవడానికి ఒక అద్భుతమైన చట్టాన్నీ తీసుకొచ్చింది..అంత గొప్ప చట్టం వెనుక ఉన్న నిర్భయ కేస్ ఏమిటి? దాన్నెలా ఛేదించారో చిత్రీకరించిన వెబ్ సిరీసే ‘డెల్హీ క్రైమ్!’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది ‘‘మేడమ్ ... రోడ్డు మీద ఓ జంట బట్టల్లేకుండా పడి ఉంటే ఇప్పుడే సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు తీసుకొచ్చాం.. అమ్మాయి పరిస్థితి బాలేదు’’ ‘‘ఊ...’’ మధ్యరాత్రి నిద్రలో వచ్చిన ఫోన్ కాల్కి ప్రిపేరవుతున్నట్టుగా.. కళ్లు నులుముకుంటూ ‘‘ఓకే... నేనొస్తున్నా...’’ అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది సౌత్ ఢిల్లీ డీసీపీ వర్తికా చతుర్వేది. ‘‘ఏమైంది?’’ పక్కనే ఉన్న భర్త అడుగుతుంటే ‘‘సీరియస్.. వెళ్లాలి’’ హాల్లోకి వచ్చింది గబగబా షూ వేసుకుంటూనే. ఇది ‘‘డెల్హీ క్రైమ్’’లోని సన్నివేశం. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన నగరంగా ఢిల్లీని ఖరారు పరిచిన దుర్ఘటన.. ‘‘కంట్రీ ఆఫ్ రేప్స్’’గా అపకీర్తిని మోసుకొచ్చిన విషాదం... 2012, డిసెంబర్ 16.. నిర్భయ గ్యాంగ్ రేప్. మహిళలకు భద్రత లేదని, స్త్రీల ఆత్మగౌరవం అనే పదానికి అర్థమే తెలియని సమాజంగా నిరూపించిన ఘటన. అందుకే అప్పటిదాకా అణిచి పెట్టుకున్న దుఃఖం పార్లమెంట్ మీదకు దండెత్తే సాహసంగా మారింది. ఒళ్లు గగుర్పొడిచే ఆ నేరానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెసే ‘‘డెల్హీ క్రైమ్’’. చాలా నిజాలకు కొన్ని కల్పితాలను జోడించి తీసిన సిరీస్. ముందు చెప్పుకున్న సన్నివేశం తర్వాత... డీసీపీ వర్తికా చతుర్వేది(షెఫాలి షా) హడావిడిగా సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి వెళ్తూనే దారిలో తన అసిస్టెంట్ స్టాఫ్ అందరినీ అలర్ట్ చేస్తుంది. సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు రమ్మని ఆదేశాలిచ్చి తనూ చేరుకుంటుంది. అప్పటికే ఒంటినిండా గాయాలతో రక్తమోడుతూన్న అమ్మాయి.. దీపికను సర్జరీ కోసం థియేటర్‌కు తీసుకెళ్తూంటారు డాక్టర్స్. పేషంట్ కండీషన్ గురించి అడుగుతుంది డీసీపీ. ‘‘బాడీ బయట పార్ట్సే కాదు లోపలి పార్ట్సూ చాలా దెబ్బతిన్నాయి. గ్యాంగ్‌రేప్. ఐరన్‌రాడ్ కూడా ఇన్సర్ట్ చేశారు. లోపల పేగులు బయటకు లాగారు. క్రిటికల్ కండిషన్.. ఈ రాత్రి గడవొచ్చు’’ అని చెప్తూ థియేటర్లోకి వెళ్తుంది డాక్టర్. దీపికతోపాటు హాస్పిటల్లో అడ్మిట్ అయిన అబ్బాయి ఆకాశ్‌ను కలుస్తుంది డీసీపీ. ‘‘సినిమా చూసి తొమ్మిదిగంటలప్పుడు ద్వారకా (ఢిల్లీలోని ఓ ప్రాంతం) వెళ్లడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. దొరకలేదు. రాత్రి అవుతోంది అలా వెయిట్ చేయడమెందుకని అక్కడి నుంచి ఓ ఆటో పట్టుకుని మునీర్కా వచ్చి అక్కడినుంచి ఓ బస్ ఎక్కాం. బస్‌లో ఆరుగురు ఉన్నారు. ఎక్కిన కొన్ని నిమిషాలకే దాదాగిరీ చేయడం మొదలుపెట్టారు. ఐరన్‌రాడ్‌తో నన్ను కొట్టి నా పర్స్, మొబైల్ ఫోన్, ఏటీఎం కార్డ్స్ లాక్కున్నారు.. అడ్డుపడ్డ దీపికనూ కొడ్తూ ఒకతను వెనక్కి తీసుకెళ్లాడు. తర్వాత మిగిలిన వాళ్లూ వెళ్లారు. కాసేపటికి కదులుతూన్న బస్‌లోంచి మమ్మల్ని రోడ్డు మీదకు విసిరేశారు.. నేకెడ్గా!’’ చెప్పాడు ఆకాశ్. భారంగా వార్డ్ బయటకు వస్తుంది డీసీపీ. అక్కడే దీపిక తల్లిదండ్రులుంటారు. వాళ్లకూ ధైర్యం చెప్పి ఆలోపే ఆసుపత్రికి చేరుకున్న తన స్టాఫ్‌తో కారిడార్‌లో సమావేశమవుతుంది. అందరిలో ఒకటే అభిప్రాయం.. వాళ్ల సర్వీస్‌లో ఇంతటి హేయమైన నేరాన్ని చూడలేదని. ఆమెలో తెలియని బాధ, గుబులు మొదలవుతుంది. ఆ రోజు సాయంకాలమే.. తన కూతురు చాంద్ని.. కాలేజ్ చదువుకోసం కెనడాకు పంపిన అప్లికేషన్ ఓకే అయినట్టు చెప్తుంది. ఢిల్లీని మించిన సిటీ లేదని.. సరిగ్గా ఎక్స్ప్లోర్ చేసుకొమ్మని.. కెనడా గినడా.. ఆలోచనలు కట్టిపెట్టమనీ గట్టిగా మందలిస్తుంది కూతురిని. ‘‘రాత్రి ఎనిమిదైతే చాలు కాలు బయటపెట్టడానికి భయపడి చచ్చే ఢిల్లీ నీకు సేఫ్‌గా కనిపిస్తుందా? మెట్రోలో ఎక్కడమే పాపం.. ఎక్కడెక్కడో చేతులు వేసి తడమాలనుకునే పోకిరీ వెధవలున్న ఈ సిటీని సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయాలా?’’ అంటూ అసంతృప్తి, ఆగ్రహం వెళ్లగక్కుతుంది కూతురు. ‘‘ఒక్కనెల టైమ్ ఇవ్వు.. నీచేత ఢిల్లీని నేను ఎక్స్ప్లోర్ చేయిస్తా.. ఇంత సేఫ్ ప్లేస్ వరల్డ్‌లో లేదనిపిస్తా’’ చాలెంజ్ చేస్తుంది డీసీపీ. నవ్వి ‘‘సరే.. అట్లాంటి ఢిల్లీని చూపిస్తే కెనడా ఆలోచన మానేస్తాలే’’ అంటూ తన కూతురు ప్రామిస్ చేసిన ఆ సంభాషణ గుర్తొస్తుంది డీసీపీకి. ఆ భావాలేవీ బయట పడనివ్వకుండా స్టాఫ్‌తో అక్కడికక్కడే ఆ కేస్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఫామ్ చేసేస్తుంది. ఆ క్షణం నుంచే డ్యూటీస్నీ ఆర్డర్ చేస్తుంది. ఆ రోజు ఉదయమే .. ట్రైనీ ఐపీఎస్ నీతీ సింగ్(రసికా దుగ్గల్) .. చెక్‌పోస్ట్‌లో డ్యూటీ తీసుకోగానే ఏనుగు దంతాలను స్మగ్లర్‌ను పట్టుకుంటుంది. ఆ విషయం తెలియగానే సంతోషపడ్తుంది డీసీపీ ‘‘అందుకే అన్ని డిపార్ట్మెంట్స్లో వీలైనంత ఎక్కువ మంది ఆడవాళ్లను అప్పాయింట్ చేసుకోవాలి’’ అని. అలా ఆ అమ్మాయినీ తన టీమ్‌లో చేర్చుకుంటుంది. హాస్పిటల్లో దీపికకు, ఆమె తల్లిదండ్రులకు కేర్‌టేకర్‌గా.. మీడియాను హాస్పిటల్లోకి రానివ్వకుండా చూసుకునే డ్యూటీని అప్పజెప్తుంది ఆమెకు. ఆరుగురు నేరస్థులు.. దీపిక స్నేహితుడు ఆకాశ్ చెప్పిన ఆనవాళ్ల ప్రకారం.. వాళ్లు బస్ ఎక్కిన ప్రాంతం నుంచి వాళ్లను విసిరేసిన ప్రాంతం దాకా సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి కొన్ని క్లూస్ సంపాదిస్తుంది టీమ్. అలాగే బస్‌లో ఆరుగురి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఆధారంగా ముగ్గురి పేర్లను చెప్తాడు ఆకాశ్. వాళ్లో జై సింగ్ ప్రధాన నేరస్థుడని తెలుస్తుంది డీసీపీ అండ్ టీమ్‌కి. ఇన్సిడెంట్ గురించి తెల్లవారే టీవీల్లో హోరెత్తి పోతుంటే భయపడ్డ ఆరుగురూ పారిపోతారు. జైసింగ్ ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌లో పనిచేస్తుంటాడు. అది స్కూల్ బస్. మరో ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయ్స్కీ కమ్యూట్గానూ పనిచేస్తూంటుంది. ఈ చర్య తర్వాత జైసింగ్ బస్‌ను శుభ్రం చేసేసి పార్కింగ్ ప్లేస్‌కి తీసుకొస్తుంటే అతణ్ణి పట్టుకుంటారు పోలీసులు. ముందు తనకేం తెలియదని బుకాయిస్తాడు జై సింగ్. గట్టిగా అడిగితే ఒప్పుకుంటాడు. అప్పుడే అతని మానసిక వికారమూ బయటపడ్తుంది. జై సింగ్ నుంచి మిగిలిన వాళ్ల వివరాలనూ సేకరిస్తారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఏరియాస్‌ను డిటెక్ట్ చేసుకుంటూ ఒకొక్కరి జాడా తీస్తూ రాజస్థాన్, బీహార్‌కూ జర్నీ చేసి నేరస్థుల బలహీనతలను వాడుకుంటూ... ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ మొత్తానికి అయిదు రోజుల్లోపే ఆరుగురినీ పట్టుకుంటారు. ఈ ప్రయాణంలో ఆ ఆరుగురి మానసిక స్థితి, వాళ్ల కుటుంబ నేపథ్యాలు, పెరిగిన వాతావరణం, ఆర్థిక స్థితీ అర్థమవుతుంది. మొత్తానికి అయిదు రోజుల్లో ఆరుగురినీ పట్టుకుంటారు. రెండో కోణంలో... ఇన్వెస్టిగేషన్ విషయంలో వచ్చే రాజకీయంగా ఒత్తిళ్లను తట్టుకోవడం ఒకెత్తయితే.. మీడియా చూపే అత్యుత్సాహాన్ని నిరోధించడం అంతకుమించిన తలనొప్పి అవుతుంది డీసీపీ అండ్ టీమ్‌కి. ప్రజా సంఘాలు, యూత్, ఫెమినిస్ట్స్ ఆర్గనైజేషన్స్ చేసే ధర్నాలు, ర్యాలీలలో ఏ అపశ్రుతి దొర్లకుండా చూసే బాధ్యతా అదనపు భారమవుతుంది. డీసీపీతో సహా టీమ్ అంతా ఆ అయిదు రోజులూ స్టేషన్లోనే ఉంటారు ఇల్లు, కుటుంబాన్ని మరిచిపోయి. దీపిక విషయానికి వస్తే సర్జరీ అయినా ఆమె ఆరోగ్యం అంతగా మెరుగు పడదు. ఇంకా చేయాల్సిన సర్జరీలూ ఉంటాయి. ఆఖరి నేరస్థుడిని పట్టుకున్న రోజే దీపిక స్పృహలోకి వస్తుంది. మెజిస్ట్రేట్ ముందు జరిగినదంతా చెప్తూ స్టేట్మెంట్ ఇస్తుంది. ఆ నేరస్థులు కనిపిస్తే చాలు కొట్టి చంపేయాలన్నంత ఆవేశంతో ఉంటారు ఢిల్లీ ప్రజలు. పోలీస్ స్టేషన్, కోర్ట్, ఇండియా గేట్ ముందు వందల సంఖ్యలో జనాలు గుంపులు గుంపులుగా. వాళ్ల బారిన పడకుండా నేరస్థులను సురక్షితంగా కోర్ట్‌లో హాజరుపరిచి శిక్షార్హులను చేయాలన్నదే డీసీపీ అండ్ టీమ్ తపన. ఇంకే కూతురికి ఇలాంటి పరిస్థితి రాకుండా.. మరే తల్లీ, తండ్రీ ఈ క్షోభకు గురికాకుండా చూడాలన్నదే వాళ్ల దృఢనిశ్చయం. ఈ క్రమంలో తమ పట్ల ప్రజల్లో నమ్మకం పోకుండా చూసుకోవడం మరో క్రూషియల్ టాస్క్. ఆఖరకు ఆ పోరాటంలో గెలుస్తారు అనుకున్నట్టుగానే మూడో కంట పడకుండా ఆ నేరస్థులను కోర్టుకు అప్పగించి. ఆ విజయాన్ని ఇండియా గేట్ ముందు సెలబ్రేట్ చేసుకుంటూంటే.. ట్రైనీ ఐపీఎస్ నీతి సింగ్.. ‘‘దీపిక మెడికల్ రిపోర్ట్ చదివారా? ఇంటర్నల్ ఆర్గాన్స్ రిపేర్ చేయలేనంత డామేజ్ అయ్యాయి. ఆమె బతకదు.. ఈ సెలబ్రేషన్స్ ఎందుకు?’’ అన్న మాటలతో ‘‘డెల్హీ క్రైమ్’’ ఎండ్ అవుతుంది. నిర్భయ కేస్‌ను ఇన్వెస్టిగేట్ చేసిన లేడీ ఆఫీసర్ ఛాయా శర్మ స్ఫూర్తితో ఈ సిరీస్‌ను తీశారు ఇండో కెనడియన్ డైరెక్ట్ రిచీ మెహతా. – సరస్వతి రమ -
మృగాళ్ల కావరం
ఐదేళ్ల క్రితం నిర్భయ దృష్టాంతం ఇంకా జనం మనోఫలకం నుంచి తొలగిపోలేదు. రెండు రోజుల క్రితం ఎనిమిదేళ్ల చిన్నారిపై గ్యాంగ్‌రేప్ సంఘటన ఇంకా దేశాన్ని కుదిపేస్తోంది. ఇంతలోనే మరో ఘటన. అదెక్కడో కాదు. మన జిల్లాలోనే. సరిగ్గా నడవలేని దివ్యాంగురాలని కూడా చూడకుండా... ఇద్దరు ప్రబుద్ధులు మద్యం మత్తులో కూరుకుపోయి... కామంతో కళ్లు మూసుకుపోయి... దారుణంగా లైంగికదాడి చేసిన సంఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలోని ఓ దివ్యాంగురాలిపై ఇద్దరు కామాంధులు దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. నిజానికి జిల్లాలో ఇలాంటి సంఘటనలు కొత్త కాదు. ఏటా ఎన్నో జరుగుతున్నా... వెలుగులోకి రానివెన్నో. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అమాయక మహిళలపై అఘాయిత్యాలుసర్వసాధారణమైనప్పటికీ ఏ ఒక్కటీ పోలీస్ స్టేషన్ వరకూ రాదు. స్థానిక పెద్దలే పంచాయతీ చేసి, ఆమె శీలానికి వెలకట్టేస్తుంటారు. పోలీస్ రికార్డుల ప్రకారం జిల్లాలో గతేడాది మూడు, 2016లో ఐదు లైంగిక దాడి ఘటనలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దారుణాలు 2016లో 33 నమోదైతే గతేడాది 46, ఈ ఏడాది ఇప్పటి వరకూ 6 కేసులు రికార్డయ్యాయి. ఈ పరిస్థితులపై ప్రజా, మహిళా సంఘాలు, వైద్యులు, న్యాయ నిపుణులు మండి పడుతున్నారు. సభ్య సమాజం సిగ్గుపడే సంఘటనలు రోజూ ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నా... చట్టాల్లో మార్పులు, ప్రజల్లో చైతన్యం రావాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చాయని మేధావులు నినదిస్తున్నారు. నిర్భయ చట్టాన్ని అమలు చేయాలి మానవత్వం మరణించిన వేళ చిన్నపిల్లలను, దివ్యాంగులను కూడా విడవని దుర్మార్గులు ఉన్న ఈ ప్రపంచంలో ఏడు సంవత్సరాల బాలికలకైనా... 70ఏళ్ల అవ్వకైనా రక్షణ లేదు. స్వచ్చభారత్ అన్న మోదీగారు ఆడవాళ్ల ఆత్మగౌరవం కోసం ఏం చేస్తున్నారు. ఆడవాళ్లకోసం ఇచ్చిన చట్టాలు ఏమయ్యా యి. తప్పుడు భావంతో అమ్మాయిని చూడాలంటే మృగాళ్లు భయపడేలాంటి చట్టం మాకు కావాలి. నిర్భయ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి. – తుమ్మి లక్ష్మీరాజ్, మహిళా సమాఖ్య జిల్లా సహాయకార్యదర్శి, విజయనగరం. పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యమే కారణం పోలీస్ వ్యవస్థ బాగుంటే అంతా బాగుం టుంది. ముఖ్యంగా శాఖాపరమైన నిర్లక్ష్యం వల్లే అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వాలు మహిళా చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయి. అభం, శుభం తెలియని అమాయకుల జీవితాలను నాశనం చేసే కామాం ధుల్ని ఉరితీయాలి. రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గడం వల్ల నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. – పాలూరి రమణమ్మ, ఐద్వా జిల్లా సహాయకార్యదర్శి, విజయనగరం ఎన్నో కారణాలు... మరెన్నో బాధలు తల్లిలేదా తండ్రి లేని వారు, ఉన్నప్పటికీ వారి ప్రేమ, భయం, పర్యవేక్షణ లేనివారు ఎక్కువగా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. సెల్ఫోన్లలో ఆశ్లీల దృశ్యాలను ఎక్కువగా చూసేవారు తాము అలా చేయాలని కోరుకుంటారు. స్నేహితుల ప్రభావం కూడా ఉంటుంది. ఇక గ్యాంగ్‌రేప్‌కు గురైన యువతులు భయభ్రాంతులకు లోనవుతారు. ఒక్కోసారి తల్లిదండ్రులను కూడ దగ్గరకు రానివ్వరు. అలాంటి వారికి వెంటనే వైద్యం అందించాలి. రెండు రోజుల పాటు వారి దగ్గరకు ఎవరూ వెళ్లకూడదు. సహాయకులుగా ఒక్కరే ఉండాలి. అదీ మహిళలై ఉండాలి. రెండు మూడు రోజులు తర్వాత సైకాలజిస్టు తో కౌన్సెలింగ్ ఇప్పించాలి. –ఎస్.వి.రమణ, సైకాలజిస్టు, విజయనగరం చట్టాల పటిష్టంగా అమలైతే చాలు మహిళల రక్షణ దిశగా రూపొందించిన చట్టాలు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించాలి. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. నిర్థిష్ట సమయంలో విచారణ చేపడితేనే ఇలాంటి దారుణాలు తగ్గుతాయి. మహిళల రక్షణ కోసం గృహ హింస నిరోధకచట్టం, దీనినే నిర్భయ చట్టంగా పిలుస్తున్న ఫోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ట్రన్ ఫ్రం సెక్సవల్ అఫైన్‌సెస్) చట్టం రూపొందించారు. విచారణకు ప్రత్యేక కోర్టులు లేకపోవడం వల్ల కేసుల్లో జాప్యం జరుగుతోంది. -కె.ఆర్.దాశరధి, సీనియర్ న్యాయవాది, విజయనగరం. -
'అతడిని విడుదల చేస్తే మృగాన్ని వదిలినట్టే'
హైదరాబాద్: 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ... రుణాల పేరుతో మహిళలను లైంగికంగా వేధించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులపై నిర్భయ కేసులు పెట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. నిర్భయ కేసులో బాలనేరస్థుడిని జైలు నుంచి విడుదల చేయొద్దని ఆమె డిమాండ్ చేశారు. అతడిని విడుదల చేస్తే సమాజంలోకి మృగాన్ని వదిలినట్టేనని వ్యాఖ్యానించారు. కాగా, బాలనేరస్థుడిని విడుదల చేయొద్దని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.