
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈసారి ఎన్నికల్లో తాము ఓటువేయక పోవచ్చని ‘నిర్భయ’ తల్లిదండ్రులు ఆషాదేవి, బద్రీనాథ్ సింగ్‌లు గురువారం చెప్పారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఏమీ చేయని రాజకీయ పార్టీలతో తాము అలసిపోయామని అన్నారు. తమ కుమార్తెపై దారుణ కృత్యానికి పాల్పడిన నేరస్తులు ఇంకా బతికే ఉండటాన్ని బట్టి.. పార్టీలు వ్యక్తం చేసిన సానుభూతి, వారిచ్చిన హామీలు అన్నీ కేవలం ఓ ‘రాజకీయ గిమ్మిక్కు’గా తేలిపోయిందని చెప్పారు. అమానుష కాండ బాధితులుగానే మిగులుతున్న మహిళలు, పిల్లలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టడం లేదని వారు విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment