మ్యాంగో జ్యూస్‌ కొనిస్తానని.. ఆ మృగాడు! | Another Nirbhaya Incident Took Place In Delhi Premises | Sakshi
Sakshi News home page

మ్యాంగో జ్యూస్‌ కొనిస్తానని.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం

Published Sat, Jul 6 2019 4:34 PM | Last Updated on Sat, Jul 6 2019 8:02 PM

Another Nirbhaya Incident Took Place In Delhi Premises - Sakshi

ఢిల్లీ: తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి.. ఓ కామాంధుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి ఇదే అదనుగా భావించిన మహ్మద్‌ నన్హే (24) , ఆరేళ్ల చిన్నారికి మ్యాంగో జ్యూస్‌ కొనిస్తానని మాయమాటలు చెప్పి ఏకాంతంగా ఉన్న చోటుకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

అనంతరం ఆ బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఏడుస్తూ, రక్తపు మడుగులో ఉన్న ఆ చిన్నారిని గుర్తించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చేర్పించాడు. సీసీటీవీ పుటేజ్‌ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరా తీయగా.. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ప్రభుత్వం బాధితురాలికి కుటుంబానికి 10 లక్షల నష్ట పరిహారం ప్రకటించింది. ఈ దుర్ఘటనపై డిల్లీ మహిళా కమీషన్‌ స్పందించి.. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement