case postponed
-
నిర్భయ దోషుల ఉరిశిక్ష విచారణ వాయిదా
-
నిర్భయ దోషుల ఉరిశిక్ష విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ దోషులకు ఉరిశిక్షపై విచారణ వాయిదా పడింది. కేసు తదుపరి విచారణను ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా నిర్భయ అత్యాచారం, హత్యకేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్ తనకు విధించిన మరణ శిక్షపై వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ ఉదయం కొట్టివేసిన విషయం తెలిసిందే. నిర్భయ దోషులకు ఉరిశిక్ష సరైందేనని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దోషికి సమీక్ష కోరే హక్కు లేదని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్‌కు దోషుల తరఫు న్యాయవాది మూడు వారాల గడువు కోరినా... క్షమాభిక్షకు వారం రోజులు చాలని తెలిపింది. మరోవైపు 14 రోజుల్లోగా దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని నిర్భయ తల్లిదండ్రులు కోరారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పై నిర్భయ తల్లి ఆశాదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణ వాయిదా వేసిన తర్వాత స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. పరిష్కారం కోసం దోషులకు సమయం కేటాయించి కోర్టు ఒకవైపు నుంచి మాత్రమే చూస్తుందని ఆమె మీడియాకు తెలిపారు. తదుపరి విచారణ తర్వాత కూడా తీర్పు వస్తుందని మాకు నమ్మకం లేదంటూ స్పందించారు. (చదవండి : నిర్భయ దోషి రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు) -
రజనీకాంత్‌పై కేసు విచారణ వాయిదా
తమిళసినిమా: చెన్నై హైకోర్టులో నటుడు రజనీకాంత్‌పై జరుగుతున్న కేసు విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేశారు. వివరాలు.. చెన్నై షావుకార్ పేటకు చెందిన సినీ ఫైనాన్షియర్ బోద్రాకు నటుడు ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరిరాజా ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యింది. దీనిపై బోద్రా నటుడు రజనీకాంత్‌పై చెన్నై జార్జ్‌టౌన్ నేర విభాగ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను రజనీకాంత్ పూచీకత్తు మీదే కస్తూరిరాజాకు రుణం ఇచ్చానని, అయితే కస్తూరిరాజా తనకు ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో పూచికత్తుగా నిలిచిన రజనీకాంత్‌పై జార్జ్‌టౌన్ నేర విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. దీంతో తన పేరుకు కళంకం ఆపాదించడానికే బోద్రా కోర్టుకు వెళ్లారని రజనీకాంత్ ఆరోపించారు. జార్జ్‌టౌన్ కోర్టులో ఈ కేసు విచారణకు బోద్రా హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. దీంతో బోద్రా చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి ఎంవీ.మురళీధరన్ నటుడు రజనీకాంత్‌కు బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. రజనీ న్యాయవాది తన వాదనను వినిపిస్తూ పిటిషన్‌దారుడు కావాలనే రజనీకాంత్‌పై పిటిషన్ దాఖలు చేశారని, పత్రికలకెక్కి ఆయన పేరుకు కళంకం తీసుకొస్తున్నారన్నారు. బోద్రా తరఫు న్యాయవాది దీన్ని వ్యతిరేకిస్తూ తన వాదనలను వినిపించారు. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఫిబ్రవరి ఐదవ తేదీకి వాయిదా వేస్తూ ఆ రోజున రజనీకాంత్ తరఫున బదులు పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. -
విమలక్క కేసు వాయిదా
హైదరాబాద్: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క కేసు వాయిదా పడింది. తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కార్యాలయాన్ని ఎలాంటి వారెంట్ ఇవ్వకుండా పోలీసులు సీజ్ చేయడాన్ని, తనపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తుందంటూ హైకోర్టులో విమలక్క పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. -
విజయ్ ‘కత్తి’ కేసు వాయిదా
టీనగర్: నటుడు విజయ్ నటించిన ‘కత్తి’ చిత్రకథ చోరీకి గురైనట్లు దాఖలైన కేసులో విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేస్తూ తంజావూరు జిల్లా సెషన్సు కోర్టు ఉత్తర్వులిచ్చింది. చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటుడు విజయ్ నటించిన కత్తి చిత్రం గత ఏడాది విడుదలైంది. ఈ చిత్రం కథ తాను దర్శకత్వం వహించిన భూమి అనే డాక్యుమెంటరీ కథాంశం అని, తన కథను దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చోరీ చేసినట్లు, ఇందుకు నష్ట పరిహారం చెల్లించాలని, వేరే భాషల్లో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసేందుకు స్టే విధిం చాలని తిరుకాట్టుపల్లి సమీపంలోగల ఇలంగాడు గ్రామం దిగువ వీధికి చెందిన అన్బువ రాజశేఖర్ (32) తంజావూరు జిల్లా సెషన్సు కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నటు డు విజయ్, నిర్మాతలు కరుణాకరన్, సుభాష్కరన్, చాయాగ్రాహకుడు జార్జి విలియమ్ అనే ఐదుగురిపై నేరం ఆరోపించారు. ఈ కేసు విచారణ తంజావూరు జిల్లా సెషన్సు న్యాయమూర్తి మహ్మద్ ఆలీ ఎదుట సోమవారం విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణను ఏప్రిల్ 15 వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి మహ్మద్ ఆలీ ఉత్తర్వులిచ్చారు.