న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం, కాల్పుల్ని ఆపేంత వరకూ పాకిస్తాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరగక పోవచ్చని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. విదేశాంగ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంట్ సంప్రదింపుల కమిటీకి ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. సరి హద్దుల్లో ఉగ్ర వాదం, కాల్పులు ఆపనంత వరకూ మ్యాచ్‌లకు అవకాశం ఉండదని, ఉగ్రవాదం, క్రికెట్‌లు కలిసికట్టుగా సాగలేవని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఖైదీలుగా ఉన్న 70 ఏళ్లు దాటిన వారు, మహిళలు, మానసిక స్థితి సరిగా లేని వారిని మానవతా దృక్పథంలో ఇరు దేశాలు విడుదల చేయాలని భారత్‌లోని పాకిస్తాన్ రాయబారికి ప్రతిపాదించినట్లు ఆమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment