
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాల్సినంత భారీగా పెట్రో ఉత్పత్తుల ధరలేమీ లేవనీ, కాబట్టి ఇప్పుడు ఎక్సైజ్ సుంకం తగ్గింపు అంశాన్ని ప్రభుత్వం పరిశీలించడమే లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దాదాపు వారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను సవరించలేదు.
పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గార్గ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్పీజీ మినహా మిగిలిన అన్ని ఇంధనాలకూ ప్రభుత్వం రాయితీని ఎత్తివేసిందనీ, పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగితే ఎక్సైజ్ సుంకం తగ్గింపు రూపంలో వాటిపై పరోక్ష రాయితీని ఇచ్చే అవకాశం ఉండొచ్చని చెప్పారు. లీటర్ పెట్రోల్/డీజిల్‌పై ఒక రూపాయి ఎక్సైజ్ సుంకం తగ్గించినా ప్రభుత్వానికి రూ. 13 వేల కోట్ల ఆదాయం తగ్గుతుందని గార్గ్ వెల్లడించారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై రూ. 19.48, లీటర్ డీజిల్‌పై రూ. 15.33ల ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం విధిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment