సాక్షి, బెంగళూరు : ‘లాక్‌డౌన్ చేస్తారనే భయం వద్దు. మరోసారి లాక్‌డౌన్ అనేది అసత్యం. ఎవరూ సొంతూళ్లకు వెళ్లొద్దు. బెంగళూరులోనే క్షేమంగా ఉండండి’ అని కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మై ప్రజలను కోరారు. బెంగళూరులో మరోసారి లాక్‌డౌన్ ఉంటుందని వస్తున్న కథనాలపై ఆయన స్పందించారు. ఆదివారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ విధించబోదని స్పష్టం చేశారు. ఇదే మాటను ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా చెప్పారన్నారు. ‘బెంగళూరులో కరోనా అధికమైందని, లాక్‌డౌన్ చేస్తారని ప్రజలు బెంగళూరు విడచి ఇతర గ్రామాలకు వెళుతున్నారు. దీనిద్వారా మిగిలిన జిల్లాలు, గ్రామాల్లో వైరస్ బెడద అధికమైంది. ప్రజలు దయచేసి బెంగళూరులోనే క్షేమంగా ఉండాలి. ప్రభుత్వం లాక్‌డౌన్ చేయడం లేదు’ అని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఆదివారం కర్ఫ్యూ మాత్రం ఉంటుందన్నారు. (చదవండి : భారత్: కోటి దాటిన కరోనా పరీక్షలు)
రోజూ ఐదారు పోలీస్ స్టేషన్ల సీల్‌డౌన్
బెంగళూరులో కరోనా రోగులకు బెడ్‌ల కొరత లేదని హోంమంత్రి తెలిపారు. పాజిటివ్‌గా తేలి ఆరోగ్యంగా ఉన్నవారిని కోవిడ్ కేర్ సెంటర్లో చేర్పిస్తామని చెప్పారు. బాధితుల తరలింపునకు బెంగళూరులో మరో 500 అంబులెన్స్‌ల అవసరం ఉందని అన్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో ప్రతి రోజు ఐదారు పోలీస్ స్టేషన్‌లు సీల్‌డౌన్ అవుతున్నాయని వాపోయారు. పోలీసులకు విస్తృతంగా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి : కరోనా: ఆస్పత్రికి రాని వైద్యులు)
Comments
Please login to add a commentAdd a comment