ఏటీఎంల్లో ఎలాంటి సర్ఛార్జీలు ఉండవు... | No Surcharge on ATM use amid rush for new notes | Sakshi
Sakshi News home page

ఏటీఎం కస్టమర్లకు గుడ్ న్యూస్

Published Thu, Nov 10 2016 7:07 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

ఏటీఎంల్లో ఎలాంటి సర్ఛార్జీలు ఉండవు...

ఏటీఎంల్లో ఎలాంటి సర్ఛార్జీలు ఉండవు...

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలను వినియోగిస్తే ఎలాంటి సర్ఛార్టీలు ఉండవని వెల్లడించింది.  కాగా ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాయల్ ఉచిత లావాదేవీలను బ్యాంకులు అయిదింటికి పరిమితం చేసిన సంగతి తెలిసిందే. అయితే రూ.500, 1000 నోట్ల రద్దుతో  ఏటీఎంల నుంచి రోజుకు రూ.2వేలు, ఆతర్వాత రూ.4వేలు మాత్రమే డ్రా చేసుకునే పరిమితి విధించడంతో ఈ వెసులుబాటు కల్పించింది. కేంద్ర తాజా నిర్ణయం సామాన్యులకు కాస్త ఊరట కలిగించే విషయమే.
 
మరోవైపు పెద్ద నోట్ల రద్దుతో దేశంలో పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ముంబయి, ఢిల్లీతో పాటు పలు నగరాల్లో ఐటీ దాడులు జరిగాయి. ప్రముఖ వ్యాపారుల నివాసాలతో పాటు కార్యాలయాల్లోనూ ఐటీ దాడులు జరిగినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement