'గ్యాస్ సబ్సిడీపై పన్ను లేదు'
న్యూఢిల్లీ: వంటగ్యాస్‌పై ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా బ్యాంకు ఖాతాలలో జమ అవుతున్న సొమ్ముపై సాధారణ వ్యక్తులకు పన్ను మినహాయింపు కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
2015 ఆర్థిక బిల్లు సవరణపై పన్ను నిపుణులు వ్యక్తం చేసిన సందేహాలపై స్పష్టతనిచ్చింది. ఎల్పీజీ సహా సంక్షేమ సబ్సిడీలు సాధారణ వ్యక్తులకు పన్నుల పరిధిలోకి రావని ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. వ్యాపారాలు, ఇతర వృత్తుల ద్వారా ఆదాయాలు పొందే కంపెనీలకు ఎల్పీజీ సబ్సిడీ పన్ను పరిధిలోకి వస్తుందని తెలిపింది.