న్యూఢిల్లీ: త్వరలో కోల్‌కతా, చెన్నై, సికింద్రాబాద్ లోకల్ రైల్వే వ్యవస్థలో ఏసీ కోచ్‌లు, ఆటోమెటిక్ డోర్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కొద్ది రోజుల్లో ముంబై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌లో 12 కోచ్‌లతో కూడిన ఏసీ రైలును నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘లోకల్ రైళ్లలో అనేక మార్పులు తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నాం. 2019–20 మధ్యలో అన్ని కొత్త ఈఎంయూ రైళ్లలో ఏసీ, ఆటోమెటిక్ డోర్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఆ రైళ్లను చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, సికింద్రాబాద్ నగరాల్లోను ప్రవేశపెట్టే ఆలోచనతో ఉన్నాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment