
న్యూఢిల్లీ : పీఓకేలోని నీలం వ్యాలీతో పాటు మరో మూడు ప్రాంతాల్లో ఈ నెల 19, 20 తేదీల్లో భారత సైన్యం చేపట్టిన దాడుల్లో 18 మంది ఉగ్రవాదులు మరణించినట్టు సైనిక అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్యను అధికారికంగా వెల్లడించకపోయినా ఈ ఆపరేషన్‌లో పలువురు పాక్ సైనిక సిబ్బంది సహా 18 మంది వరకూ మరణించారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. భారత సైన్యం దాడుల్లో జైషే మహ్మద్ సహా ఇతర జిహాదీలకు చెందిన టెర్రర్ లాంఛ్ ప్యాడ్లను ఆర్టిలరీ ఫైరింగ్‌తో ధ్వంసం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడటం, కవ్వింపు చర్యలకు పాల్పడటానికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఈ భారీ ఆపరేషన్‌ను చేపట్టింది. పాక్ ఆర్మీకి చెందిన ఆయుధ సామాగ్రి, రేషన్ డిపోలను కూడా సైన్యం ధ్వంసం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment