హోం శాఖ కమిటీ చైర్మన్గా చిదంబరం
న్యూఢిల్లీ: హోం శాఖ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా హోం శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం నియమితులయ్యారు. అలాగే వ్యక్తిగత సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, న్యాయ శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్కు ఆనంద్ శర్మ... రవాణా, పర్యాటకం, సాంస్కృతిక శాఖ కమిటీకి ముకుల్ రాయ్, రైల్వేలకు సుదీప్ బంద్యోపాధ్యాయను చైర్మన్గా నియమించినట్లు లోక్సభ బులెటిన్లో పేర్కొన్నారు.
వీరేంద్ర కుమార్(జేడీయూ), కిరిట్ సోమయ్య(బీజేపీ)లు తమ కమిటీల్ని పరస్పరం మార్చుకున్నారు. ఇక ఇంధన శాఖకు వీరేంద్ర కుమార్, కార్మిక శాఖ కమిటీకి సోమయ్య నేతృత్వం వహిస్తారు. ఇక మిగతా కమిటీల చైర్మన్ల స్థానంలో ఎలాంటి మార్పులు చేయలేదు.