న్యూఢిల్లీ : పాకిస్థాన్ మళ్లీ బరి తెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలోని షాపూర్ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. సరిహద్దు వెంట ఉన్న గ్రామాలపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించింది. అయితే కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలుస్తోంది.
దాంతో భారత బలగాలు వెంటనే స్పందించి... ఎదురు కాల్పులకు దిగాయి. భారత సైన్యం దీటుగా స్పందిచడంతో భారీగా కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. కాగా పాక్ కాల్పుల ఘటనలో పలువురు స్థానికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధ్రువీకరించారు.