BSF posts
-
సరిహద్దులో పేట్రేగిన పాక్
జమ్మూ / ఆర్నియా / శ్రీనగర్: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ మరోసారి తూట్లు పొడిచింది.అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట జమ్మూకశ్మీర్‌లోని గ్రామాలు, బీఎస్ఎఫ్ ఔట్‌పోస్టులు లక్ష్యంగా పాక్ రేంజర్లు బుధవారం మోర్టార్లు, భారీ ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్ఎస్ పురా, ఆర్నియా, బిష్నాహ్, రామ్‌గఢ్, సాంబా సెక్టార్లలో కొన్నిచోట్ల మంగళవారం అర్థరాత్రి నుంచే పాక్ బలగాలు కాల్పులు ప్రారంభించాయని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ కాల్పులు క్రమంగా మిగతా సెక్టార్లకూ విస్తరించాయన్నారు. పాక్ కాల్పుల నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవడంతో ఆర్నియా పట్టణం నిర్మానుష్యంగా మారిపోయిందన్నారు. ఆర్నియా పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 76,000 మందికి పైగా ప్రజలు ప్రాణ భయంతో సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారన్నారు. మరోవైపు పాక్ కాల్పుల మోతపై బిషన్‌సింగ్(78) అనే స్థానికుడు స్పందిస్తూ.. ‘1971 తర్వాత ఇంత భారీస్థాయిలో షెల్లింగ్‌ను నేనెప్పుడూ చూడలేదు. వెంటనే పాకిస్తాన్‌తో యుద్ధం చేసి ఈ సమస్యలన్నింటిని ఒకేసారి పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీని మేం డిమాండ్ చేస్తున్నాం’ అని చెప్పారు. మరోవైపు అనంతనాగ్ జిల్లాలో గస్తీలో ఉన్న బలగాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్‌ను విసిరి పరారయ్యారు. ఈ ఘటనలో 10 మంది పౌరులు గాయపడ్డారు. -
మళ్లీ రెచ్చిపోయిన పాకిస్తాన్
-
మళ్లీ రెచ్చిపోయిన పాకిస్తాన్
న్యూఢిల్లీ : పాకిస్థాన్ మళ్లీ బరి తెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలోని షాపూర్ సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. సరిహద్దు వెంట ఉన్న గ్రామాలపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించింది. అయితే కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలుస్తోంది. దాంతో భారత బలగాలు వెంటనే స్పందించి... ఎదురు కాల్పులకు దిగాయి. భారత సైన్యం దీటుగా స్పందిచడంతో భారీగా కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. కాగా పాక్ కాల్పుల ఘటనలో పలువురు స్థానికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధ్రువీకరించారు. -
మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
జమ్మూ కాశ్మీర్ : పాకిస్థాన్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన తెంపరితనాన్ని చాటుకుంది. జమ్మూ ప్రాంతం సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తొమ్మిది బీఎస్ఎఫ్ జవాన్ల ఔట్ పోస్ట్‌లపై గతరాత్రి నుంచి కాల్పులకు తెగబడిందని ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. కాల్పులు ఈ రోజు ఉదయం కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే శుక్రవారం ఇదే ప్రాంతంలోని మంగు వద్ద బీఎస్ఎఫ్ ఔట్ పోస్ట్ వద్ద పాక్ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఓ పౌరుడు మరణించగా...మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.