జమ్మూ కాశ్మీర్ : పాకిస్థాన్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన తెంపరితనాన్ని చాటుకుంది. జమ్మూ ప్రాంతం సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తొమ్మిది బీఎస్ఎఫ్ జవాన్ల ఔట్ పోస్ట్లపై గతరాత్రి నుంచి కాల్పులకు తెగబడిందని ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు.
కాల్పులు ఈ రోజు ఉదయం కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే శుక్రవారం ఇదే ప్రాంతంలోని మంగు వద్ద బీఎస్ఎఫ్ ఔట్ పోస్ట్ వద్ద పాక్ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఓ పౌరుడు మరణించగా...మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.