ఇస్లామాబాద్ : ఇండో-పాక్ సరిహద్దులో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత మెరుపుదాడులపై తీవ్ర అసహనంతో ఊగిపోతున్న పాక్ ప్రతిదాడులకు సిద్ధమని పేర్కొనడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. పాక్ నేతల గాంభీర్య ప్రకటనలకు తోడు అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ సేనలు, ట్యాంక్‌లు మోహరించడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు పూంచ్ సెక్టార్‌లో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటంతో పదిమంది జవాన్లు గాయపడ్డారు. పలు నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. భారత సేనలు ప్రతిఘటించడంతో పాక్ వైపు కూడా నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. మంజికోట్,పూంచ్, నౌషెరా, రాజోరి, అఖ్నూర్, సియోల్‌కోట్ సెక్టార్లలో కాల్పులు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. పాక్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైనా దీటుగా ప్రతిస్పందించేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment