బీజేపీ విజయం.. పాక్‌లో వణుకు!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) విజయం పాకిస్తాన్ వెన్నులో వణుకుపుడుతోందటా. ఉడీ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో అనుసరించే పాలసీ విషయాల్లో మార్పులను ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత చేయాలని భాజాపా ప్రభుత్వం ఎదురుచూస్తోందని గతంలో పలు వార్తలు ప్రచురితమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో అఖండ మెజారీటీ సాధించిన బీజేపీ దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మారింది. దీంతో పాకిస్తాన్‌తో అనుసరించాల్సిన పాలసీల్లో పెద్ద ఎత్తున మార్పులు రానున్నాయనే గుసగుసలు కేంద్ర ప్రభుత్వంలో వినిపిస్తున్నట్లు ఓ జాతీయ పత్రిక పేర్కొంది.
ఉడీ దాడి తర్వాత పాక్ ఆగడాలను ఇక సహించబోమంటూ సిగ్నల్స్ ఇచ్చింది భారత్. సర్జికల్ స్ట్రైక్స్, సింధు నదీ జలాల ఒప్పందంపై పునఃసమీక్ష వంటి నిర్ణయాలను తీసుకుంది. దీంతో షాక్‌కు గురైన పాకిస్తాన్.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత ఎప్పుడు ఏమవుతుందోననే ఆందోళనలో ఉంది. ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ ప్రజలు మోదీ పాక్‌పై తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు సమర్ధించారు. దీంతో మోదీ అలాంటి చర్యలనే భవిష్యత్తులో కొనసాగించే అవకాశం ఉంది.
మోదీ గెలుపు తర్వాత తొలిసారి దేశంలో పర్యటించనున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌తో భద్రతా సంబంధాలను మరింత బలపర్చుకునే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌తో అత్యధిక భాగం బోర్డర్‌ను కలిగివున్న బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు ఎదురవుతున్న సమస్యలను తగ్గించేలా చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా రాజకీయంగా అస్ధిరత నెలకొన్న నేపాల్‌తో కూడా సంబంధాలు బలపర్చుకోవడం మరింత సులువు అవుతుంది.