నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ ఆర్మీ మరోసారి కాల్పులకు తెగబడింది.
శ్రీనగర్: నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ ఆర్మీ మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్‌లో పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. సోమవారం ఉదయం నుంచి పాక్ సైన్యం కాల్పులు జరపుతుండటంతో.. అప్రమత్తమైన మన భద్రతా సిబ్బంది వారికి ధీటుగా బదులిస్తున్నారు. పాక్ బలగాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి తుపాకులు, మోటర్ల ద్వారా కాల్పులకు తెగబడ్డారు. దీనికి మన ఆర్మీ ధీటైన జవాబిస్తోందని.. రక్షణ శాఖఅధికారి మనీష్ మెహతా తెలిపారు. కాల్పులు కొనసాగుతున్నాయి.