రాష్ట్రపతి ఎన్నికపై పన్నీర్‌ సెల్వం నిర్ణయమిదే | Pannerselvam faction extends support to NDA nominee Ram Nath Kovind | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి ఎన్నికపై పన్నీర్‌ సెల్వం నిర్ణయమిదే

Published Thu, Jun 22 2017 11:59 AM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM

రాష్ట్రపతి ఎన్నికపై పన్నీర్‌ సెల్వం నిర్ణయమిదే

రాష్ట్రపతి ఎన్నికపై పన్నీర్‌ సెల్వం నిర్ణయమిదే

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే రెబల్‌ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కూడా ప్రధాని నరేంద్రమోదీకే జై అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీయే ప్రకటించిన దళిత వర్గం నేత రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆయన మద్దతిచ్చారు. తాము ఎన్డీయే అభ్యర్థికి మద్దతిస్తున్నామంటూ గురువారం మీడియాకు తెలిపారు. జూలై 17న రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిగా ఎన్డీయే ప్రభుత్వం రామ్‌నాథ్‌ను ప్రకటించింది. ఇప్పటికే బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తోపాటు పలువురు ఆయనకు మద్దతివ్వగా తాజాగా పన్నీర్‌ కూడా జై అన్నారు. తనతో ఉన్న సీనియర్‌ పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామి కూడా కోవింద్‌కే తన మద్దుతును ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement