Presidential poll
-
విజయవాడకు ద్రౌపది ముర్ము
సాక్షి, అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న గిరిజన మహిళ ద్రౌపది ముర్ము మంగళవారం విజయవాడకు రానున్నారు. ద్రౌపది ముర్ము వెంట కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సీకే కన్వెన్షన్ హాల్‌కు చేరుకోనున్న ద్రౌపది ముర్ముకు సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలకనున్నారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించే సమావేశంలో ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతూ వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ప్రసంగిస్తారు. సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీగా రాష్ట్రపతి అభ్యర్థిగా తొలి సారి గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వడాన్ని స్వాగతించిన వైఎస్సార్సీపీ ఇప్పటికే ఆమెకు మద్దతు తెలిపింది. ఇదే అంశాన్ని వెల్లడిస్తూ ద్రౌపది ముర్ముకు మద్దతు తెలుపుతూ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడి.. మద్దతు కోరనున్నారు. గిరిజన నృత్యాలతో ముర్ముకు బీజేపీ స్వాగతం బీజేపీ, దాని మిత్రపక్షాల (ఎన్డీయే) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటారని పార్టీ నేతలు వెల్లడించారు. విమానాశ్రయం ప్రాంగణంలో సంప్రదాయ గిరిజన నృత్యాలతో ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేసింది. కాగా, రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి వస్తున్నారని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు చెప్పారు. తెలంగాణ పర్యటన రద్దు! సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏ పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్ర పర్యటన రద్దయింది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. పశ్చిమబెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో ముర్ము ప్రచారం ఇంకా పూర్తికాని నేపథ్యంలో సమయాభావం వల్ల ఆమె తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్టు బీజేపీ వర్గాల సమాచారం. ఈ నెల 16న ఢిల్లీలో ద్రౌపది ముర్ము పాల్గొననున్న బీజేపీ ఎంపీల సమావేశానికి రాష్ట్రానికి చెందిన ఐదుగురు ఎంపీలకు ఆహ్వానం అందింది. కాగా, ద్రౌపది ముర్ము బెంగళూరు పర్యటనకు వచ్చినపుడు రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలను కలిపించే ప్రయత్నం చేస్తున్నా అది ఏ మేరకు సాధ్యమనే దానిపైనా చర్చ సాగుతోంది. అదీగాక రాష్ట్రం నుంచి బీజేపీకి ఐదుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడం కూడా ఈ పర్యటన రద్దుకు ఒక కారణమని తెలుస్తోంది. ఒకవేళ రాష్ట్రంలోని టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి ఎవరైనా ఎన్డీయే అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ చేస్తే అది బోనస్‌గా భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు. -
ప్రెసిడెంట్ ఎన్నిక రద్దు.. రీ పోలింగ్
-
ప్రెసిడెంట్ ఎన్నిక రద్దు.. రీ పోలింగ్
- కెన్యా సుప్రీంకోర్టు సంచలన తీర్పు నైరోబీ: దేశాధ్యక్షుడి ఎన్నికను రద్దుచేస్తూ కెన్యా సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది. రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో తీవ్ర అవకతవకలు జరిగాయని అభిప్రాయపడిన కోర్టు.. 8 రోజులలోగా తిరిగి ఎన్నికలు(రీపోలింగ్) నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆగస్టు 12న వెల్లడైన అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఉహురు కెనట్టా(జూబ్లీ పార్టీ) రెండో సారి విజయం సాధించారు. ఆయనకు 54.27 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి రైలా ఓడింగాకు 44.74 శాతం ఓట్లు వచ్చాయి. అయితే అధికారపక్షం ఈవీఎంలను ట్యాపరింగ్ చేయడంతోపాటు విచ్చలవిడి అవినీతికి పాల్పడిందని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. అక్రమంగా జరిగిన ఎన్నికలను తక్షణమే రద్దుచేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన నలుగురు జడ్జిల బెంచ్ నేడు తీర్పు వెల్లడించింది. కోర్టు తీర్పుతో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకోగా, అధికార పార్టీ కార్యకర్తలు గుర్రుమంటున్నారు. -
ఇది కులపోరాటం కాదు.. భావజాల పోరాటం!
న్యూఢిల్లీ: తాజా రాష్ట్రపతి ఎన్నిక కులపోరాటం కాదని, ఇది భావజాల సంగ్రామమని ప్రతిపక్ష అభ్యర్థి మీరా కుమార్ అన్నారు. విపక్ష పార్టీల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన అనంతరం తొలిసారి ఆమె మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ప్రఖ్యాత దళిత నాయకుడు జగ్జీవన్‌రామ్ కూతురైన ఆమె రాష్ట్రపతి ఎన్నికను 'దళిత్ వర్సెస్ దళిత్'గా అభివర్ణించడాన్ని తప్పుబట్టారు. ఇప్పటికైనా కుల వ్యవస్థను భూలోలోతుల్లో పాతిపెట్టాలని అన్నారు. ఎన్డీయే తరఫున బిహార్ మాజీ గవర్నర్ నాయకుడు రామ్‌నాథ్ కోవింద్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆయనకు పోటీగా దిగిన మీరాకుమార్‌కు 17 విపక్ష పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'ఫలానా కులానికి చెందిన వ్యక్తుల మధ్య పోరుగా ఈ ఎన్నికను అభివర్ణిస్తే.. అది రాష్ట్రపతి పదవిని కించపరచడమే అవుతుంది' అని అన్నారు. రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతుగా బలమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఓటమిని అంగీకరించడానికి మీరాకుమార్ నిరాకరించారు. 'నేను ఓడిపోయే అభ్యర్థిని, ఇది ఓడిపోయే పోరాటమని ఎందుకు అంటున్నారు? నేను పోరాడుతున్నాను. నేను గట్టి పోటీ ఇవ్వగలనని అనుకుంటున్నా' అని ఆమె చెప్పారు. -
రాష్ట్రపతి ఎన్నికపై పన్నీర్ సెల్వం నిర్ణయమిదే
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే రెబల్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కూడా ప్రధాని నరేంద్రమోదీకే జై అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీయే ప్రకటించిన దళిత వర్గం నేత రామ్‌నాథ్ కోవింద్‌కు ఆయన మద్దతిచ్చారు. తాము ఎన్డీయే అభ్యర్థికి మద్దతిస్తున్నామంటూ గురువారం మీడియాకు తెలిపారు. జూలై 17న రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిగా ఎన్డీయే ప్రభుత్వం రామ్‌నాథ్‌ను ప్రకటించింది. ఇప్పటికే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తోపాటు పలువురు ఆయనకు మద్దతివ్వగా తాజాగా పన్నీర్ కూడా జై అన్నారు. తనతో ఉన్న సీనియర్ పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామి కూడా కోవింద్‌కే తన మద్దుతును ప్రకటించారు. -
తదుపరి రాష్ట్రపతి.. ఇప్పటికీ సస్పెన్సే!
న్యూఢిల్లీ: తదుపరి రాష్ట్రపతి ఎవరనే దానిపై బీజేపీ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ తెలిపింది. అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలన్న మిత్రపక్షం శివసేన ప్రతిపాదనను కూడా బీజేపీ తోసిపుచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ విషయమై అజ్తక్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బదులిచ్చారు. అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనేదానిపై తాను మనస్సులో ఏమనుకుంటున్నప్పటికీ.. ఈ విషయంపై మొదట పార్టీలో చర్చ జరగాలని, ఆ తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. ఆరెస్సెస్ చీఫ్ భగవత్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలనే ప్రతిపాదనను ఇప్పటికే బీజేపీ తిరస్కరించిన విషయాన్ని షా మరోసారి గుర్తుచేశారు. -
సోనియాతో ఏచూరి కీలక చర్చలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ప్రతిపక్షాలు ఒక్కతాటిపై వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జేడీయూ, సీపీఎం ముందడుగు వేశాయి. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాల తరపున సంయుక్త విపక్ష అభ్యర్థిని పోటీ పెట్టడంపై సోనియాతో ఏచూరి చర్చించినట్టు సమాచారం. ఉమ్మడి అభ్యర్థిని నిలబడితే మద్దతు ఇవ్వాలని సీపీఎం పొలిట్ బ్యూరో ఇంతకుముందే నిర్ణయించింది. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ కూడా గురువారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలన్నింటీనీ ఏకం చేసే అంశంపై వీరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాల తరపున సంయుక్త విపక్ష అభ్యర్థిని బరిలో దించటం విషయంలో ముందుండి నడపాలని కూడా సోనియాను నితీశ్ కోరినట్లు సమాచారం.