
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం నాటి సమావేశాల్లో లోక్సభలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2015, మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లు 2015, బొగ్గుగనుల ప్రత్యేక చట్టాల బిల్లు 2015, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సవరణ బిల్లు 2015, పౌరసత్వ సవరణ బిల్లు 2015, గనులు, ఖనిజాల అభివృద్ధి రెగ్యులేషన్ సవరణ బిల్లుపై చర్చ జరపనున్నారు. అలాగే రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రవేశపెట్టే ధన్యవాద తీర్మానంపై చర్చించనున్నారు.