session start
-
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
న్యూఢిల్లీ : పార్లమెంటు ఉభయ సభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో లోక్సభలో భారతదేశంలో వ్యవసాయరంగం పరిస్థితిపై చర్చకు కొద్దిసేపు సమయాన్ని కేటాయిస్తారు. దీంతో పాటూ బొగ్గుగనుల ప్రత్యేక చట్టాల బిల్లు 2015, బీమారంగ చట్ట సవరణబిల్లు 2015, భూసేకరణలోని న్యాయమైన, పారదర్శక పరిహారం హక్కు , రిహాబిలిటేషన్ అండ్ రి సెటిల్ మెంట్ సవరణ బిల్లులపై చర్చ జరగనుంది. అలాగే రాజ్యసభలో ఢిల్లీ హైకోర్టు సవరణ బిల్లు చర్చకు రానుంది -
లోక్ సభ వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే లోకసభ వాయిదా పడింది. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముప్తీ వ్యాఖ్యల వివాదంపై ప్రధానమంత్రి వివరణ యివ్వాల్సిందిగా పట్టుబట్టడంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిద వేశారు. ఇది ఇలా రాజ్యసభలో ఇటీవల వర్షాల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో నష్టపోయిన రైతుల సమస్యపై చర్చించడానికి కొద్ది సమయం కేటాయిస్తారు. అలాగే గ్రామీణ బ్యాంకుల సవరణ బిల్లును ఆమోదానికి పెడతారు. -
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం నాటి సమావేశాల్లో లోక్సభలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2015, మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లు 2015, బొగ్గుగనుల ప్రత్యేక చట్టాల బిల్లు 2015, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సవరణ బిల్లు 2015, పౌరసత్వ సవరణ బిల్లు 2015, గనులు, ఖనిజాల అభివృద్ధి రెగ్యులేషన్ సవరణ బిల్లుపై చర్చ జరపనున్నారు. అలాగే రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రవేశపెట్టే ధన్యవాద తీర్మానంపై చర్చించనున్నారు.