budget 2015
-
విద్యుత్ సంస్థలకు మొండిచేయి!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థలకు సర్కారు మొండిచేయి చూపించింది. రూ.7,716 కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్టు పంపిణీ సంస్థలు తెలిపాయి. ఇందులో రూ.1,261 కోట్లను టారిఫ్ రూపంలో పూడ్చుకోవాలని ప్రతిపాదించాయి. మిగిలిన రూ.6,455 కోట్లను ప్రభుత్వం ఉచిత విద్యుత్, గృహ విద్యుత్‌కు సబ్సిడీ రూపంలో ఇస్తుందని ఆశించాయి. కానీ రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు వాటి ఆశలపై నీళ్లు చల్లాయి. బడ్జెట్లో కేవలం రూ.4,360 కోట్లు కేటాయించారు. వ్యవసాయానికిచ్చే ఉచిత విద్యుత్‌కు రూ.3 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. మిగిలిన రూ.1,360 కోట్లను పలు పథకాలకోసం ఖర్చుచేయాలని ప్రతిపాదించారు. వాస్తవానికి ఉచిత విద్యుత్‌కే రూ.4 వేల కోట్లు వెచ్చిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. తాజాగా రూ.మూడు వేల కోట్లను కేటాయించడం ద్వారా ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం పరోక్షంగా చెప్పినట్లయింది. ఈ క్రమంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల స్థానంలో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ.. ఇందుకోసం ఈ ఏడాది పదివేల సోలార్ పంపుసెట్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు రెవెన్యూ లోటు భర్తీకి అంతర్గత చర్యలు చేపట్టాలని విద్యుత్ సంస్థలకు సూచించింది. ప్రభుత్వం తాజాగా సబ్సిడీలో కోత విధించడంతో లోటును ఎలా పూడ్చుకోవాలనే దానిపై విద్యుత్ సంస్థలు కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొనుగోలు విద్యుత్ భారం తడిసి మోపెడవుతున్న నేపథ్యంలో దీన్ని తగ్గించే వీలుందని, కొన్ని రాయితీ వర్గాలపై భారం తప్పకపోవచ్చని అధికారులు అంటున్నారు. -
మరిన్ని కష్టాలతో ప్రవేశపెట్టాం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ కష్టాలుంటూనే ఉంటాయని, ఈసారి మరిన్ని కష్టాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టానని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. తనది వాస్తవిక బడ్జెట్ అని పేర్కొన్నారు. తమ దగ్గర ఆదాయం తక్కువగా ఉందని, దాని ఆధారంగా కేటాయింపులు చేశామని చెప్పారు. అప్పులు తెచ్చుకోకపోతే రాష్ట్రంలో పథకాలను కొనసాగించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. గురువారం శాసనసభలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదించిన అనంతరం యనమల అసెంబ్లీ కమిటీ హాలులో విలేకరులతో మాట్లాడారు. ఇందులో ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, విప్‌లు మేడా మల్లికార్జునరెడ్డి, కూన రవికుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులు అజయ్‌కల్లాం, ఎల్.ప్రేమచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశగా ఉంటే వెంటనే వెళ్లి భోజనం చేయండి అని ఒక విలే కరి ప్రశ్నకు సమాధానంగా యనమల వ్యాఖ్యానించారు. రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని కేంద్రానికి వివరించేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిందని, వారు పొందుపరిచిన లెక్కల ఆధారంగా రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రానికి వివరిస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల ఆదాయాల మధ్య తేడా ఉందన్నారు. ‘‘రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువగా కష్టాలు వివరించాం. పక్క రాష్ట్రాలకు, మనకు ఉన్న తేడా కూడా చెప్పాం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన పరిస్థితి ఎలా ఉందో పోల్చిచూశాం. మన కష్టాల ఆధారంగా కేంద్రానికి విన్నపాలు చేసి వాటిని పరిష్కరించాల్సిందిగా కోరతాం’’ అని తెలిపారు. రెండు రాష్ట్రాల బడ్జెట్లను పరిశీలిస్తే ఎవరి పరిస్థితి ఎలా ఉందో కేంద్రం గుర్తించేందుకు తేలికవుతుందన్నారు. రాష్ర్ట ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలో కేంద్రానికి లేఖ రాస్తారని ఆయన చెప్పారు. ఏపీలో జనాభా, సమస్యలు, ఆర్థికలోటు ఎక్కువగా ఉందని, అందువల్లే సాయం చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. రాష్ర్టం అన్నిరకాలుగా ఇబ్బంది పడుతున్నపుడు సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కేజీ బేసిన్ రాష్ట్రంలో ఉంది కాబట్టి.. దీనిపై రాయల్టీని కోరుతున్నామని, లేదంటే గ్యాస్ బావులను రాష్ట్రానికి ఇవ్వాలని కోరుతున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. యనమల ఇంకా ఏమన్నారంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికేతర వ్యయాన్ని సాధ్యమైనంతగా తగ్గించాం. తాజాగా 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన చేయూత తర్వాత కూడా రాష్ర్టం 2019-20 సంవత్సరంలోనూ ఆర్థికలోటుతో ఉంటుంది. పన్నులద్వారా ఆదాయాన్ని పెంచలేం. అందువల్ల పన్నేతర ఆదాయం.. అంటే ఎర్రచందనం అమ్మకం, ఖనిజాల వెలికితీత ద్వారా ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నాం. అటవీశాఖపై ప్రభుత్వం వెచ్చిస్తున్న ఖర్చులో సగం మాత్రమే ఆదాయం వస్తోంది. అందువల్లే ఈసారి ఆ శాఖ ఆదాయం పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. ఆదాయ వనరులు పెంచుకునేందుకు ఒక విధానాన్ని కనుగొనే పనిలో ఉన్నాం. రాజధాని నిర్మాణానికి రూ.వెయ్యికోట్లు ప్రతిపాదించాలని పట్టణాభివృద్ధిశాఖకు సూచిస్తే వారు రూ.300 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. పట్టణాభివృద్ధికి కేటాయించిన మొత్తంలో రాజధానికి కేటాయింపులు కూడా ఉన్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో రైతులకు చెల్లించేందుకు రూ.60 కోట్లు మంజూరు చేశాం. పోలవరం ప్రాజెక్టుకు రూ.వెయ్యికోట్లు కేటాయించాం. దాన్ని ఖర్చుచేస్తే కేంద్రం తిరిగిస్తుంది. కేంద్రం ఇచ్చిన నిధుల్ని ఇతర ప్రాజెక్టులకు ఖర్చుచేస్తాం. నీటిపారుదల శాఖకు కేటాయించిన బడ్జెట్‌ను ప్రాధాన్యతాక్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేసేందుకు ఖర్చు చేస్తాం. పౌరసరఫరాలశాఖ జారీచేసే కార్డులకు ఆధార్‌ను అనుసంధానించడం వల్ల 15 శాతం అనర్హులను తగ్గించగలిగాం. రాష్ట్రవ్యాప్తంగా ఇదే ప్రక్రియను అమలు చేస్తే ప్రభుత్వానికి కొంత ఆదాయం మిగులుతుంది. వ్యవసాయంతోపాటు ఇతర రంగాలకు ప్రాధాన్యతనిస్తాం. -
లోక్ సభ వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే లోకసభ వాయిదా పడింది. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముప్తీ వ్యాఖ్యల వివాదంపై ప్రధానమంత్రి వివరణ యివ్వాల్సిందిగా పట్టుబట్టడంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిద వేశారు. ఇది ఇలా రాజ్యసభలో ఇటీవల వర్షాల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో నష్టపోయిన రైతుల సమస్యపై చర్చించడానికి కొద్ది సమయం కేటాయిస్తారు. అలాగే గ్రామీణ బ్యాంకుల సవరణ బిల్లును ఆమోదానికి పెడతారు. -
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం నాటి సమావేశాల్లో లోక్‌సభలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2015, మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లు 2015, బొగ్గుగనుల ప్రత్యేక చట్టాల బిల్లు 2015, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సవరణ బిల్లు 2015, పౌరసత్వ సవరణ బిల్లు 2015, గనులు, ఖనిజాల అభివృద్ధి రెగ్యులేషన్ సవరణ బిల్లుపై చర్చ జరపనున్నారు. అలాగే రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రవేశపెట్టే ధన్యవాద తీర్మానంపై చర్చించనున్నారు. -
బిజెపి-టిడిపిల మధ్య భగ్గుమన్న విభేధాలు
-
బడ్జెట్‌పై పారిశ్రామిక వర్గాల్లో మిశ్రమస్పందన!
-
భారీ ఒడిదుడుకుల్లో మార్కెట్లు
ముంబై: బడ్జెట్ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మొదట లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు లోక్ సభలో మంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగుతూ ఉండగా ఊగిసలాట్లకు లోనయ్యాయి. మధ్యలో స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. పన్నుల ప్రస్తావన వచ్చేసరికి ముఖ్యంగా కార్పొరేట్ పన్ను 25 శాతానికి తగ్గింపు ప్రస్తావన రాగానే మార్కెట్ మళ్లీ పాజిటివ్ లోకి మారి సెన్సెక్స్ దాదాపు మూడు వందల పాయింట్ల లాభంతో ట్రేడ్ అయింది. కానీ బడ్జెట్ ప్రసంగం ముగిసేపరికి మార్కెట్లు ఒక్కసారిగా పతనమై భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతలోనే మళ్లీ కోలుకొని స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. -
బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్ద పీఠం?
-
మోదీ సర్కారు తొలి బడ్జెట్‌పై భారీ అంచనాలు
-
బడ్జెట్ పై ఐటి సెక్టార్ భారీ ఆశలు
-
ఆర్థిక రంగంపై ప్రధాని, ఆర్థిక మంత్రి సమీక్ష
-
తలనొప్పిగా మారిన బడ్జెట్ పత్రాల లీక్!