బడ్జెట్ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.
ముంబై: బడ్జెట్ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మొదట లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు లోక్ సభలో మంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగుతూ ఉండగా ఊగిసలాట్లకు లోనయ్యాయి. మధ్యలో స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. పన్నుల ప్రస్తావన వచ్చేసరికి ముఖ్యంగా కార్పొరేట్ పన్ను 25 శాతానికి తగ్గింపు ప్రస్తావన రాగానే మార్కెట్ మళ్లీ పాజిటివ్ లోకి మారి సెన్సెక్స్ దాదాపు మూడు వందల పాయింట్ల లాభంతో ట్రేడ్ అయింది. కానీ బడ్జెట్ ప్రసంగం ముగిసేపరికి మార్కెట్లు ఒక్కసారిగా పతనమై భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతలోనే మళ్లీ కోలుకొని స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి.