ఐపీఎస్ అధికారికి ఫేస్ బుక్ బెడద! | Patna’s Dabangg cop goes ‘viral’ | Sakshi
Sakshi News home page

ఐపీఎస్ అధికారికి ఫేస్ బుక్ బెడద!

Published Mon, Jan 5 2015 10:53 AM | Last Updated on Fri, Jul 27 2018 12:33 PM

ఐపీఎస్ అధికారికి ఫేస్ బుక్ బెడద! - Sakshi

ఐపీఎస్ అధికారికి ఫేస్ బుక్ బెడద!

పాట్నా: శివదీప్ వామాన్నారో లాండే.. అతను బీహార్ లో ఒక పాపులర్ ఐపీఎస్ అధికారి. అతనికి ఏ విధమైన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో సభ్యత్వం లేదు. కాగా, అతని పేరు మీద ఒక నకిలీ అకౌంట్ సృష్టించిన వ్యక్తి ఓ  యువతి వద్ద నుంచి రూ.51వేలు కాజేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. శివదీప్ పేరు మీద ఓ ఫేస్ బుక్ అకౌంట్ సృష్టించడమే కాకుండా ఓ వ్యక్తి ఘరానా మోసానికి తెరలేపాడు. ఫేస్ బుక్ లో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తాను ఒక స్వచ్ఛంధ సంస్థ కోసం నిధులు సమీకరిస్తున్నానని నమ్మబలికాడు. దీంతో ఆ మాయగాడి మాటలు నమ్మిన ఆ బాలిక అతనికి  యాభై వేల రూపాయలను అతనిచ్చిన అకౌంట్ లో జమ చేసింది.

 

ఆ వ్యక్తి అటు తరువాత ఫేస్ బుక్ ఛాటింగ్ ఆపేయడంతో ఆ యువతికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బ్యాంకు అకౌంట్ నంబర్ తదితర వివరాలు సేకరించారు. అతను బీహార్ లోని దాద్ నగర్ జిల్లాకు చెందిన గోపాల్ కృష్ణగా గుర్తించారు.  ప్రస్తుతం ఆ నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లను నిషేధించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసే పనిలో పడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement