ఒక్కో వాయిదాకు 10వేలు జరిమానా | Pay 10,000 for Each Adjournment, SC Tells 89-year-old Woman’s Opponents in Land Dispute | Sakshi
Sakshi News home page

ఒక్కో వాయిదాకు 10వేలు జరిమానా

Published Sat, Jun 16 2018 5:02 AM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM

Pay 10,000 for Each Adjournment, SC Tells 89-year-old Woman’s Opponents in Land Dispute - Sakshi

న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో ఉన్న వృద్ధ మహిళ(89)ను వాయిదాల పేరుతో పదేపదే కోర్టుకు తిప్పుతుండటంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇకపై ప్రతివాదులు కోరే ఒక్కో వాయిదాకు రూ.10వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని షరతు విధించింది. ఈ కేసును త్వరగా తేల్చాలని దిగువ కోర్టును ఆదేశించింది. జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌ నేతృత్వంలోని బెంచ్‌ శుక్రవారం ఈ కేసును విచారించింది. దేశ విభజనకు ముందు పశ్చిమ పాకిస్తాన్‌లో ఉన్న భూములకు గాను విభజన తర్వాత పంజాబ్‌లోని పటియాలా, అమృత్‌సర్‌ జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో కేటాయించిన పెద్ద మొత్తంలో భూములపై హక్కుదారులెవరనేదే దానిపై సురీందర్‌కౌర్, తన్వీర్‌ సింగ్‌ తదితరులకు మధ్య ఈ కేసు నడుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement