
మేకపాటి రాజమోహన రెడ్డి
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారని, అందుకే పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చారని వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన రెడ్డి తెలిపారు. నల్లధనం అంశంపై ఈరోజు లోక్సభలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలని, నల్లధనాన్ని ఈ ప్రభుత్వం వెనక్కు తీసుకురావాలని ఆయన అన్నారు.
ప్రభుత్వం తన అధికారాలన్నిటినీ ఉపయోగించి నల్లధనాన్ని వెనక్కు తీసుకురావాలని కోరారు. ఆ ధనంతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను పూర్తి చేయవచ్చునని మేకపాటి చెప్పారు.
**