
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు ఈ మేరకు పిటిషన్ వేశారు. ప్రాజెక్టు అంచనాలు పెంచారని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో అవకతవకలు జరిగాయని అందులో పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు .. దీనిని ఫిర్యాదుగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కేంద్ర జలవనరులశాఖకు ఆదేశాలు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment