pentapati pullarao
-
భారత్ ముంగిట ‘పెనుప్రమాదం’
ప్రపంచం ఇంతవరకు అణుబాంబులు, అణ్వాయుధాలు, సైన్యాలు, పర్యావరణ మార్పు వంటి ప్రమాదాలను ఎదుర్కొంది. కానీ మానవాళి అతి పెద్ద శత్రువు కంటికి కనిపించని వైరస్సే. మేధో బలం మెండుగా ఉన్న భారత్ ఆరోగ్య సమస్యలపై తక్షణం దృష్టి సారించేలా చేయాలి. భారత్ ఇప్పటికీ కరోనా వైరస్ 2వ దశలోనే ఉంది. కాబట్టే మనం నిమ్మళంగా ఉన్నాం. కానీ మన ప్రభుత్వాలు మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇప్పుడు కొనసాగిస్తున్న వైద్య సేవలకు అదనంగా ఆరోగ్య రంగానికి ప్రభుత్వం భారీ ఎత్తున డబ్బు వెచ్చించాలి. కర్ఫ్యూల ద్వారా సామాజిక దూరం పాటించేలా చేయాలి. ప్రభుత్వాల మాటలు చాలా బాగున్నాయి కానీ చేతలు మాత్రం ఇప్పటికీ తగిన విధంగా లేవు. తక్కిన ప్రపంచ దేశాలకు మల్లే భారతదేశం కూడా అత్యంత ప్రమాదకరమైన మహమ్మారి కరోనా గుప్పిట్లో ఇరుక్కుపోయి ఉంది. మహమ్మారులనేవి ఎప్పుడు కూడా పిలిచి రావు లేక వస్తున్నామంటూ తమ రాకను ముందుగా చెప్పవు. మహమ్మారి అనేది ఉన్నట్లుండి సూచన కూడా లేకుండా వచ్చి మీద పడుతుంది. నివారించడానికి అసాధ్యమయ్యేలా విరుచుకుపడుతుంది. ఇలా ప్రపంచంమీదికి వచ్చి పడే ప్రతి వైరస్ కూడా పూర్తిగా కొత్త రూపంలో ఉంటుంది కాబట్టే దాన్ని తక్షణం నివారించడానికి వ్యాక్సిన్ కానీ మందులు కానీ ఎన్నడూ అందుబాటులో ఉండవు. అత్యంత సంపన్నదేశాలకు, సుప్రసిద్ధులైన వైద్యులకు కూడా మహమ్మారి వ్యాధి వచ్చిపడినప్పుడు ఏం చేయాలో తెలీదు. కరోనా వైరస్ భూమ్మీద నుంచి అదృశ్యమయ్యే సమయానికి లక్షలాది మంది మరణిస్తారని నిపుణులు చెబుతున్నారు. 7 కోట్లమంది జనాభా ఉన్న ఇటలీలో ఇప్పటికే దీని బారినపడి 6 వేలమంది చనిపోయారు. భారత జనాభా పరిమాణంతో పోలిస్తే ఇప్పటికే లక్షా 20 వేలమంది ఇటలీలో చనిపోయినట్లు భావించాలి. పైగా ఇప్పుడు జరుగుతున్నది ప్రారంభం మాత్రమే. ఒకవారంరోజుల్లోపే లక్షమందికి పైగా చావాల్సి వస్తే భారతీయులు ఏం చేస్తారో ఊహించగలమా? ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులు నిండా మునిగిపోతారు. చైనాలో 2003లో జంతువులనుంచి మనుషులకు సంక్రమించిన సార్స్ సాంక్రమిక వ్యాధిని పోలిన కరోనా వైరస్ గురించి చైనా ప్రపంచానికి చాలా ఆలస్యంగా తెలియజెప్పింది. 2019 నవంబరులోనే చైనా వైద్యులు దీన్ని కనిపెట్టినప్పటికీ దాన్ని బహిరంగ పర్చడంలో చైనా తాత్సారం చేసింది. చైనా స్థానిక అధికారులు దీనికి సంబంధించిన వార్తలను తొక్కిపెట్టడంతో అది ఇప్పుడు విశ్వ మహమ్మారిగా మారిపోయింది. ఆధునిక ప్రపంచంలో సాంక్రమిక వ్యాధిని ముందుగానే కనుగొంటే, రోగుల్ని మొదట్లోనే వేరు చేసి ఆ వ్యాధి వ్యాప్తి కాకుండా నిరోధించవచ్చు. మందుల ద్వారా సాంక్రమిక వ్యాధిని తక్షణం నివారించలేం. కానీ తొలిచర్య ఏమిటంటే వ్యాధిని నియంత్రించడమే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ .. కరోనా వైరస్ కరోనా వైరస్‌ని నియంత్రించే ఉత్తమమార్గం విస్తృతంగా పరీక్షలు జరపడమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిచెప్పింది. ఎవరికి వ్యాధి సోకిందీ తెలీనప్పుడు విస్తృతంగా పరీక్షలు జరపడమే మార్గం. ఈవిధంగానే దక్షిణ కొరియా, జర్మనీలు కరోనాను నిరోధించడంలో విజయాన్ని సాధించాయి. ప్రత్యేకించి దక్షిణ కొరియా తరహా ఏకాంతవాసాన్ని, దానికిమించి వైద్యపరీక్షల విధానాన్ని అమెరికా ఇప్పుడు అవలంబిస్తోంది. భారత్‌లో 135 కోట్ల జనాభా ఉంది. యూరోపియన్ దేశాల్లోగా కాకుండా, భారతీయులు కిక్కిరిసివున్న ఆవాసాల్లో పరస్పరం అతి సన్నిహితంగా ఉండే పరిసరాల్లో జీవిస్తుంటారు. పైగా దేశంలో పారిశుధ్యం, ఆరోగ్య రక్షణ పేలవంగా ఉంటోంది. సామాజిక దూరం పాటిం చటం ద్వారా భారతీయులు తమకు తాము ఏకాంతం పాటించినా అదే ఇంట్లో ఉన్న వారికి దూరంగా ఉండటం సాధ్యం కాదు. కరోనా వైరస్ గురించి మీరేమీ పట్టించుకోకుండా దాని మానాన దాన్ని వదిలేస్తే ఒక్క అమెరికాలోనే 10 లక్షలమంది మరణిస్తారని అంచనా. కానీ కరోనా వైరస్‌ను నివారించే చర్యలు చేపడితే మరణాల సంఖ్య తగ్గుతుంది. అమెరికా ఇప్పుడు భారీస్థాయిలో వైద్య పరీక్షలు ప్రారంభించి వ్యాధి చికిత్స పథకాలు మొదలెట్టారు. ఎవరికి వ్యాధి సోకింది అని తేల్చే ఏకైక విధానం పరీక్షించడమే. పరీక్షించడం ద్వారా మొదట్లోనే వ్యాధిగ్రస్తులను కనుక్కోగలం తర్వాత వారికి చికిత్స చేయడం, ఏకాంతంలో ఉంచడం సాధ్యపడుతుంది కాబట్టి వ్యాధిని వారు వ్యాప్తి చేయలేరు. భారత్ ఏం చేయగలదు? భారతదేశంలో కరోనా వైరస్ గురించి 2020 జనవరిలో మొదటగా తెలియవచ్చింది. ఈ వ్యాధిపై తగిన చర్యలు చేపట్టడంలో జరిగిన జాప్యం భారత్‌కు ప్రాణాంతకంగా మారింది. మార్చి 22న మాత్రమే భారతప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. కానీ కర్ఫ్యూలు మాత్రమే కరోనా వైరస్‌ను పూర్తిగా నిరోధించలేవు. ఈ నేపథ్యంలో భారత్ చేయగలిగిందేమిటి? వ్యాధినిర్ధారణ పరీక్షలను విస్తృ తంగా చేపట్టడమొకటే కరోనా వైరస్‌ని అడ్డుకోగలదు. దక్షిణ కొరియా, జర్మనీ ప్రభుత్వాల కార్యాచరణ దీన్నే నిరూపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ కరోనా వైరస్ నివారణ గురించి మూడే మూడు ముక్కల్లో చెప్పారు. టెస్టింగ్, టెస్టింగ్, టెస్టింగ్. దీనికి అనుగుణంగానే భారత్‌లో భవిష్యత్తులో పెరగనున్న రోగులకు చికిత్స అందించడానికి దేశంలోని అన్ని ఆసుపత్రులను సిద్ధం చేయాలి. ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని పెంచడం రోజుల వ్యవధిలో సాధ్యమయ్యే పని కాదు. ఆసుపత్రుల్లో పడకల పెంపుదలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కొత్త భవంతుల నిర్మాణం కంటే ఉన్న ఆసుపత్రుల సామర్థ్యం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. అన్నిటికంటే మించి వెంటిలేటర్లను భారీస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలి. కరోనా వైరస్ ఊపిరితిత్తులను ప్రభావితం చేసే వ్యాధి. ఈ వ్యాధి సోకిన తర్వాత శ్వాస ఆడటం కష్టం. ఊపిరితిత్తులకు గాలి అందాలంటే, రోగి బతకాలంటే వెంటిలేటర్ల సహాయం తప్పనిసరి. అందుకే వెంటిలేటర్లు గరిష్టంగా అందుబాటులో ఉంచుకోవాలి. మరి వివిధ రాష్ట్రాల్లో అన్ని వెంటిలేటర్లు లభ్యమవుతున్నాయా? రోజువారీ అవసరాల కోసం తగినన్ని వెంటిలేటర్లు అందుబాటులో లేవనే సమాధానం. అన్ని జిల్లా కేంద్రాల్లోని వైద్యకళాశాలల వనరులను కరోనా రోగుల సేవకు కేటాయించాలి. వాటిలోని వైద్యులకు, విద్యార్థులకు టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తక్షణం అందచేసి వైరస్ నివారణకు దిగాలని నిర్దేశించాలి. ప్రపంచ దేశాలు చాలావరకు వ్యాధి భవిష్యత్తు స్థితి ఎలా ఉంటుందని కేస్ స్టడీలు చేసి పెట్టుకున్నాయి కానీ భారత్‌లో కలికానికి కూడా అది జరగలేదు. అమెరికాలో 2 వారాల క్రితం చేసిన అలాంటి కేస్ స్టడీలో దాదాపు 10 లక్షల మంది అమెరికన్లు భవిష్యత్తులో కరోనాకు బలవుతారని తెలిసింది. కానీ వైరస్ వ్యాప్తి నిరోధక కార్యాచరణ మొదలెట్టిన వారం తర్వాత అమెరికాలో భవిష్యత్తు మృతుల సంఖ్య గురించిన అంచనా తగ్గుముఖం పట్టింది. మౌలిక సదుపాయాల పెంపు అవశ్యం భారత్‌లో ప్రస్తుతానికి వెంటిలేటర్ల కొరత, విదేశాలనుంచి వాటిని కొనడంపై కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేటికీ దృష్టి పెట్టడం లేదు. వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగినప్పుడు ఇది తీవ్రమైన సామాజిక, వైద్య సమస్యలకు దారితీస్తుంది. చాలినన్ని ఐసీయూ బెడ్లు లేవు. భారీ స్థాయిలో పరీక్షించే సాధన సంపత్తి లేదు. పైగా ఆర్థిక వ్యవస్థను 35 నుంచి 40 శాతానికి కరోనా వైరస్ కుప్పగూల్చనుంది. ఇతర దేశాల లాగే భారత్ కూడా ఉద్దీపన ప్యాకేజీను తక్షణం ప్రకటించాలి. మన ముందున్న దారి స్పష్టం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టం. ఇలాంటి వైరస్లు సాధారణంగా సరైన ఆహారం లేకపోవడం, పారిశుధ్యం లేకపోవడం, సరైన ఆరోగ్య విధానాలను పాటించకపోవడం నుంచే ఇలాంటి వైరస్లు సంక్రమిస్తుంటాయి. ఇలాంటి అనారోగ్య విధానాల వల్లే వెయ్యేళ్లుగా మానవాళిపై వైరస్లు దాడి చేస్తున్నాయి. 1390లో మొదలైన మహా బ్యుబోనిక్ ప్లేగ్ ఎలుకల ద్వారా సంక్రమించిందని మర్చిపోవద్దు. ఆధునిక చైనా కూడా తన పాత చెత్త ఆరోగ్య విధానాల వల్లే కరోనా బారినపడింది. అడవి జంతువులను విచ్చలవిడిగా తినడం వల్లే ఇలా జరిగిందని చైనాను ప్రపంచం దుమ్మెత్తి పోస్తోంది. కేన్సర్, కిడ్నీ వ్యాధులు, గుండెపోటు, మధుమేహం వంటి వ్యాధులకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రపంచం వైరస్‌ద్వారా వ్యాపించే వ్యాధులను పట్టించుకోవడం లేదు.ప్రపంచం ఇంతవరకు అణుబాంబులు, అణ్వాయుధాలు, సైన్యాలు, పర్యావరణ మార్పు వంటి ప్రమాదాలను ఎదుర్కొంది. కానీ మానవాళి అతి పెద్ద శత్రువు కంటికి కనిపించని వైరస్సే. మేధో బలం మెండుగా ఉన్న భారత్ ఆరోగ్య సమస్యలపై తక్షణం దృష్టి సారించేలా చేయాలి. భారత్ ఇప్పటికీ కరోనా వైరస్ 2వ దశలోనే ఉంది. కాబట్టే మనం నిమ్మళంగా ఉన్నాం. కానీ మన ప్రభుత్వాలు మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇప్పుడు కొనసాగిస్తున్న వైద్య సేవలకు అదనంగా ఆరోగ్య రంగానికి ప్రభుత్వం భారీ ఎత్తున డబ్బు వెచ్చించాలి. కర్ఫ్యూల ద్వారా సామాజిక దూరం పాటించేలా చేయాలి. ప్రభుత్వాల మాటలు చాలాబాగున్నాయి కానీ చేతలు మాత్రం ఇప్పటికీ తగినవిధంగా లేవు. వ్యాసకర్త : పెంటపాటి పుల్లారావు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు -
భారత్ పర్యటనలో భారీ ప్రయోజనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన గ్రాండ్ సక్సెస్ అనే చెప్పాలి. మొతెరా స్టేడియం నుంచి లక్షా పాతిక వేలమంది సమక్షంలో ప్రసంగించిన ట్రంప్ ఆద్యంతం అమెరికా–భారత్ స్నేహ సంబంధాల విశిష్టతను ప్రస్తావించారు. రాడికల్ ఇస్లాం ఉగ్రవాదాన్ని సహించబోమని, ఉగ్రవాద నిర్మూలనలో భారత్‌కు పూర్తి మద్దతునిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటన ప్రత్యక్షంగా పాకిస్తాన్‌కు, పరోక్షంగా చైనాకు తీవ్ర హెచ్చరిక. అయితే ఇతర దేశాలు మనల్ని గౌరవించాలంటే భారత్ తన ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ఈ విషయంపై మోదీ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. భారత్ బలానికి ఆర్థిక పటిష్టతే అసలైన పునాది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక భారత్ పర్యటన ముగిసింది. ఆయన రెండు రోజుల పర్యటన భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో పెద్ద మార్పులను తీసుకొచ్చింది. ఏ అమెరికన్ అధ్యక్షుడూ చేయని విధంగా ట్రంప్ వ్యవహారాలను నడుపుతారు. ఇంతవరకు ట్రంప్ తన జీవితకాలంలో ఒక్క ఎన్నికలో మాత్రమే పోటీ చేశారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన ట్రంప్ అమెరికన్ రాజకీయ దిగ్గజం హిల్లరీ క్లింటన్‌పై అందరి అంచనాలకు మించి విజయం సాధించారు. 2017 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడూ చేయలేని విధంగా పాలన సాగించారు. అన్ని చట్టాలనూ ఆయన తోసిపడేశారు. నేడు ఆయన అతిశక్తిమంతుడు, సమయస్ఫూర్తి కలిగిన వారు కూడా. తన కేబినెట్ మంత్రులను కానీ, సాధారణ మీడియాను కానీ ట్రంప్ అస్సలు ఉపయోగించుకోరు. అనేక టీవీ చానళ్లు చూసి సమయానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. అవును.. ఈరోజు అమెరికా ఆర్థికవ్యవస్థ గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వికాసంతో పరవళ్లు తొక్కుతోందనటం నిజం. అమెరికా అధ్యక్షుడు కావడానికి ముందు ట్రంప్ చాలా అరుదుగా మాత్రమే విదేశాల్లో ప్రయాణించారు. భారత్ గురించి, దాని గతం గురించి ట్రంప్‌కి పెద్దగా తెలీదు. కానీ ప్రపంచంలో సాంకేతికరంగంలో పలువురు భారతీ యులు ఆధిపత్యం చలాయిస్తున్నారని తెలుసుకున్న ట్రంప్ భారతీ యుల ప్రతిభా సామర్థ్యాలపట్ల గొప్ప గౌరవం ప్రదర్శిస్తారు. అయితే భారత్ గురించి ట్రంప్‌కు వ్యక్తిగతంగా ఏమీ తెలీదు. పైగా భారతీయ ప్రముఖులను తాను ఎన్నడూ కలవలేదు. అందుకే తనతో కలిసి మోదీ నడుస్తారా అనే ఆందోళన ట్రంప్‌ను పీడిస్తోంది. భారత్‌కు అమెరికా తోడు ఎందుకు? మనదేశానికి ఇరుగు పొరుగు సమస్య చాలా పెద్దది. పాకిస్తాన్, చైనా దేశాలతో మనకు 10 వేల కిలోమీటర్ల సరిహద్దులున్నాయి. ఈ రెండు దేశాలతో భారత్‌కు తీవ్ర శతృత్వం ఉంది. పైగా భారత్‌కు వీటితో యుద్ధం చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే భారత్ నిరంతరం అంతర్జాతీయ ముఖచిత్రంలో కనబడుతూ, ఈ రెండు దేశాలూ ఇతర దేశాలతో కలిసి తనకు వ్యతిరేకంగా పనిచేయకుండా ప్రయత్నిస్తూ ఉండాలి. అటు కశ్మీర్ విషయంలో పాక్‌తో ఘర్షణ పడుతూ, ఇటు చైనాతో సరిహద్దు సమస్యతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు తప్పకుండా అమెరికా మనసు గెల్చుకోవలసిన అవసరం ఉంది. మన శత్రుదేశాలు మనల్ని వేధించకుండా ఉండాలంటే అమెరికా మద్దతు పొందాలి. ఈ నేపథ్యంలోనే భారత్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్నేహం అత్యవసరం. ఒక విదేశీ అధ్యక్షుడు భారత్‌లో అతి పెద్ద జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం చాలా అరుదు. కానీ రెండురోజుల ట్రంప్ పర్యటన భారీ విజయం పొందినట్లే మరి. ట్రంప్ పర్యటనలో మొదటి రోజు మరీ ప్రాధాన్యత కలిగింది. ఎందుకంటే ట్రంప్, ఆయన కుటుంబం బహిరంగ సమావేశాల్లో పాల్గొంటున్న దృశ్యాలను చూడడానికి భారతీయులు మొత్తంగా టీవీ సెట్లకు అతుక్కుపోయారు. తొలిరోజు సాధించిన విజయం ట్రంప్ పర్యటన పొడవునా ఆధిపత్యం చలాయించిందనే చెప్పాలి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో లక్షా పాతికవేలమంది జనం ముందు ట్రంప్ ప్రసంగాన్ని యావత్ ప్రపంచం దిగ్భ్రమతో చూసింది. ట్రంప్ భారత పర్యటన యావత్తులో ఇది ఒక సానుకూల మూడ్‌ని తీసుకొచ్చింది. మొతెరా స్టేడియంలో సభ, రోడ్ షోను ప్రధాని మోదీ అత్యద్భుతరీతిలో నిర్వహించారు. అంతకుమించి ట్రంప్ స్టేడియంలో గొప్పగా ప్రసంగించారు. ఈ ఘటన చూస్తే దేశాలకు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని 230 సంవత్సరాల క్రితం ప్రముఖ బ్రిటిష్ ప్రధాని లార్డ్ పాల్మర్‌స్టోన్ చెప్పింది గుర్తుకొస్తుంది. ఆ ప్రకటన అన్ని రకాల దౌత్యానికి పునాది. అధ్యక్షులు వస్తారు వెళతారు కానీ భారతీయ ప్రయోజనాలు కొనసాగుతాయి. ట్రంప్ భారత్ పర్యటన ఫలితాలు మొతెరా స్టేడియంలో అమెరికా అధ్యక్షుడి ప్రసంగం ఆయన పర్యటన మొత్తంలో కీలకమైంది. ఆ స్టేడియంలో అమెరికా విదేశీ విధానాన్ని, భారత్ పట్ల తన వైఖరిని ట్రంప్ ప్రసంగం విస్పష్టం చేసింది. పదాలను వెతుక్కోకపోవడం, అభిప్రాయ ప్రకటనలో తడబాటు లేకపోవడం ట్రంప్ ప్రసంగంలో ఆద్యంతం వ్యక్తమయ్యాయి. ట్రంప్ భారత పర్యటనలో మనకు ఒరిగే ప్రయోజనాలు చూద్దాం. ఇస్లాం ఉగ్రవాదాన్ని ఓడించే విషయంలో భారత్, అమెరికాకు ఉమ్మడి లక్ష్యం ఉందని రెండు దేశాలు ఇస్లామిక్ ఉగ్రవాదంతో పోరాడతాయని ట్రంప్ చెప్పారు. ఏ అమెరికన్ అధ్యక్షుడు, లేక యూరోపియన్ లీడర్ ఇంత స్పష్టంగా ఉగ్రవాద నిర్మూలనా పోరాటం గురించి చెప్పి ఉండలేదు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని దేశాలను ట్రంప్ నేరుగా మొతెరా స్టేడియం నుంచి హెచ్చరించారు. తన శక్తియుక్తులన్నింటినీ మేళవించి ఇస్లామిక్ ఉగ్రవాదంతో పోరాడతానని ట్రంప్ చేసిన హెచ్చరిక పాకిస్తాన్‌కు, అలాగే భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశానికైనా సరే తీవ్రమైన సందేశాన్నే ఇచ్చింది. అమెరికా సైన్య ఆధునీకరణకు 2.5 ట్రిలియన్ డాలర్లను వెచ్చించానని, ఈ శక్తివంతమైన సైన్యంతోనే ప్రపంచమంతటా ఉగ్రవాదుల పని పడుతున్నామని, ఐసిస్ అధినేత బాగ్దాదిని కూడా మట్టుపెట్టామని ట్రంప్ తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేక పోరాటంలో భారత్ వెనుక తాముం టామనే బలమైన సందేశాన్ని ట్రంప్ పంపించారు. ప్రతి దేశం కూడా తన సరిహద్దులను కాపాడుకుని తీరాల్సిందేనని, ఎవరు తమ భూభాగంలోనికి ప్రవేశించాలి, ఎవరు ప్రవేశించకూడదు అని నిర్ణయించుకునే హక్కు ఏ దేశానికైనా ఉంటుందని ట్రంప్ చెప్పారు. దీంతో భారత్‌లో ప్రస్తుతం సాగుతున్న సీఏఏ, ఎన్నార్సీ అంశాలను ట్రంప్ నేరుగా ప్రస్తావించినట్లయింది. అలాగే భారతీయ ఎన్నారైలను, కష్టించి పనిచేసే భారతీయులను ట్రంప్ ప్రశంసించారు. ఎన్నారైలకు, భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భవిష్యత్తులో ట్రంప్ మరింత ప్రోత్సాహం అందిస్తారని భావించవచ్చు. పైగా ఇతర దేశాల్లో పర్యటించినప్పుడు ట్రంప్ ఇంత ప్రశంసల వర్షం ఎన్నడూ కురిపించలేదు. గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్ భారతీయ సంస్కృతి, సామాజిక చరిత్రకు తానెంతో విలువ ఇస్తున్నట్లు సందేశం పంపారు. ఇతర దేశాలు ప్రత్యేకించి చైనా బలాన్ని ప్రదర్శిస్తూ, బెదిరి స్తున్న నేపథ్యంలో భారత్ ప్రజాస్వామిక మార్గంలో పయనిస్తోందని ట్రంప్ కితాబిచ్చారు. శాంతియుత, ప్రజాస్వామిక మార్గాల్లో భారత్ ఎదుగుతున్నందుకు అభినందించారు. ట్రంప్ పర్యటన నుంచి భారత్ పొందే ప్రయోజనాలు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో మంగళవారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా ట్రంప్ మరోసారి ఇస్లాం ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్‌కు మద్దతిస్తామని నొక్కి చెప్పారు. ఇది చాలా కీలకమైన ప్రకటన. ట్రంప్ సందేశం నేరుగా పాకిస్తాన్‌కు చేసిన తీవ్ర హెచ్చరిక. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద మూలాలు ఉన్నా తాను సహించబోమని ట్రంప్ స్పష్టంగా ప్రకటించారు. పైగా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్, పాకిస్తాన్ దేశాలు చైనాకు సన్నిహితం కావడానికి ప్రయత్నించడం తనకు ఏమాత్రం సంతోషం కాదని ట్రంప్ సందేశమిచ్చారు. పాకిస్తాన్, చైనాలు ట్రంప్ భారత పర్యటన ప్రభావాన్ని ఇకపై జాగ్రత్తగా మదింపు చేసుకోవలసి ఉంది. భారత అభిప్రాయాలను గౌరవించి తీరాలన్న సందేశం చైనాకు అందింది. పైగా భారత, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిందన్న విషయాన్ని చైనా గ్రహించి మెలగాల్సి ఉంది. నరేంద్రమోదీని వ్యతిరేకిస్తున్న అనేకమంది భారతీయులు ఈ ఏడాది ఆఖరిలో జరగబోయే ఎన్నికలు ఎదుర్కోబోతున్న ట్రంప్‌ని మోదీ ఇంత బాహాటంగా బలవర్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చాలా శక్తిమంతుడిగా ఉన్నారు. ట్రంప్ గెలిస్తే తాను భారత్‌కు మరింత మంచి స్నేహితుడు అవుతారు. ట్రంప్ ఓడిపోతే మనకు అదేం పెద్ద విషయం కాదు. భారత్ అతి పెద్ద దేశం కాబట్టి కాబోయే అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైనా సరే భారత్‌తో సర్దుబాటు కావలసి ఉంటుంది. కానీ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ తన ఆర్థికాన్ని చాలా జాగ్రత్తగా నిర్వహించుకోవలసి ఉంది. ఇతర దేశాలు మనల్ని గౌరవించాలంటే ఇదొకటే మార్గం. కాబట్టి మోదీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థపై మరింతగా దృష్టి పెట్టాలి. భారత్ బలానికి ఇదే అసలైన పునాది. వ్యాసకర్త: పెంటపాటి పుల్లారావు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు -
పోలవరం ప్రాజెక్టుపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు ఈ మేరకు పిటిషన్ వేశారు. ప్రాజెక్టు అంచనాలు పెంచారని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో అవకతవకలు జరిగాయని అందులో పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు .. దీనిని ఫిర్యాదుగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కేంద్ర జలవనరులశాఖకు ఆదేశాలు జారీచేసింది. -
‘కురుక్షేత్రం’లో విజేత ఎవరు?
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సునాయాస విజయం దక్కుతుందని 2017లో అందరూ భావించారు. కానీ, 2018 డిసెంబర్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం ప్రకంపనలు సృష్టించడమే కాకుండా ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలు అజేయులు కారని తేల్చిచెప్పింది. ఆలస్యంగా మేల్కొన్న మోదీ అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు, రైతులకు నగదు బదిలీ పథకాల ద్వారా విప్లవాత్మక చర్యలకు సిద్ధమయ్యారు కానీ ఆఖరిక్షణంలో తీసుకునే నిర్ణయాలు ఏ ఎన్నికల్లోనూ ఎవరికీ విజయాన్ని కట్టబెట్టలేదు. నాలుగు ఉత్తరాది రాష్ట్రాలు, గుజరాత్ ఫలితాలే 2019 ఎన్నికల్లో అంతిమవిజేతను తేల్చే కురుక్షేత్రంగా మారనున్నాయి. బీజేపీ, నరేంద్రమోదీ గురించి, 2019 సార్వత్రిక ఎన్నికల గురించి ఇప్పటికే చాలా రాసేశారు. తుది ఫలితాలు మాత్రమే ఇక లెక్కించవలసి ఉంటుంది. బీజేపీ ప్రజాదరణ క్షీణించిపోయిందని, దాని ఎంపీల సంఖ్య తగ్గనుందన్నదే సాధారణ అభిప్రాయం. అన్ని సర్వేల అభిప్రాయం ఇదే మరి. లోక్‌సభలో 543 మంది ఎంపీలున్నారు. 2014లో బీజేపీ 282 ఎంపీ స్థానాలు గెల్చుకుంది. మిత్రపక్షాలతో కలిపి దాని ఎంపీ స్థానాల సంఖ్య 300 మార్కును దాటింది. పరిపాలన విషయంలో మోదీ పాక్షికంగా విఫలమయ్యారనడంలో ఎవరికీ సందేహం లేదు. మేనిఫెస్టో, ఎన్నికల హామీలకు నేను ఎలాంటి ప్రాముఖ్యతనూ ఇవ్వను. అధికారంలోకి వచ్చాక ఏ ప్రభుత్వమైనా ఎలా పనిచేస్తుందనే ప్రజలు చూస్తారు. పెద్ద నోట్ల రద్దు, పేలవంగా మారిన జీఎస్టీ అమలు, అతి సాధారణమైన మంత్రివర్గం కారణంగా మోదీ ప్రభుత్వం తనకు తాను నష్టం కలగజేసుకుంది. ప్రతిచోటా అసమర్థ నియామకాలతో, అతి చిన్న అంశాల్లోనూ సామాజికపరమైన జగడాలను నివారించలేకపోవడంతో మోదీ ప్రభుత్వ అప్రతిష్టను మూటగట్టుకుంది. పైగా వివిధ రాష్ట్రాల్లో పార్టీకి చెందిన అసమర్థ ముఖ్యమంత్రులతో బీజేపీ సమస్యను ఎదుర్కొంటోంది. 2018 డిసెంబర్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం ప్రకంపనలు సృష్టించడమే కాకుండా ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలు అజేయులు కారని తేల్చిచెప్పింది. నిస్సందేహంగా మోదీ, షాలు గొప్ప రాజకీయనేతలే. కానీ ఈ మూడు రాష్ట్రాల్లో పార్టీ పరాజయం ఎన్నికల్లో వారి అజేయత్వాన్ని ఒక్కసారిగా తొలగించేసింది. ఆ పరాజయానికి ఎన్నో కారణాలు. నాలుగు సంవత్సరాల కాలం అందుబాటులో ఉన్నప్పటికీ ఈ మూడు రాష్ట్రాల్లో తన పాలనలో జరుగుతున్న తప్పిదాలను బీజేపీ సవరించుకోలేకపోయింది. అలాగని మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో కాంగ్రెస్ పెద్ద మెజారిటీని సాధించిందీ లేదు. ప్రత్యేకించి ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ పరాజయం వ్యక్తిగా అమిత్ షా, సంస్థాగతంగా బీజేపీ వైఫల్యం అనే చెప్పాలి. వీళ్లు అతి ఆత్మవిశ్వాసంతోనో లేక నిస్సహాయస్థితిలోనో ఉండిపోయారు. కాగా, బీజేపీ తెలంగాణలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పొందింది. తెలంగాణలో బీజేపీ గెలుపొందుతుందని ఎవరూ ఊహించడం లేదు. కాని అక్కడ అది కొన్ని ఎమ్మెల్యే సీట్లనయినా గెల్చుకోవలసి ఉంది. తెలంగాణలో పరాజయం కూడా బీజేపీ, అమిత్ షా, నరేంద్రమోదీ పైకి కనిపిస్తున్నంత చురుకుగా, ఆకర్షణీయంగా ఉన్నారా అనే ఆందోళనకు తావిస్తోంది. మోదీ, షాలు చాలా తెలివైనవారే అయినప్పటికీ, డజనుకు పైగా ప్రాంతాలు, అనేక కులాలు, భాషలు, సమస్యలతో 135 కోట్లమంది ప్రజలున్న దేశంలో ప్రభుత్వాన్ని నడిపేందుకు కావలసిన అనుభవం ఉన్న నాయకులు కారు. భారత్ చాలాకాలంగా శత్రుపూరితమైన పొరుగుదేశాలతో సరిహద్దులను కలిగి ఉంది. పైగా దేశం నిత్యం యుద్ధవాతావరణంలో ఉంటోంది. అందుకే మన దేశపాలకులు ఒక నెహ్రూ, ఒక లాల్ బహదూర్ శాస్త్రి, ఒక ఇందిరాగాంధీ, ఒక వాజ్‌పేయి, ఒక మన్మో హన్ సింగ్ వంటివారి మిశ్రమ లక్షణాలను సంతరించుకుని ఉండాలి. దాదాపుగా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్.. ఇలా ప్రధానమంత్రులందరూ పరాజయం పాలై అధికారం కోల్పోయారు. ప్రభుత్వాలు అధికారాన్ని కోల్పోయిన ఘటనల నుంచి మోదీ, అమిత్ షాలు గుణపాఠాలు తీసుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. 2010 తర్వాత కాంగ్రెస్ పార్టీలో పతన దశ ప్రారంభమైనప్పటినుంచీ ఆ పార్టీలో ఏ ఒక్క నేత కూడా సోనియాగాంధీని విమర్శించిన పాపాన పోలేదు. వారు మౌనం వహించారు. ఈలోగా అన్నా హజారే వంటి వారు కాంగ్రెస్ పరాజయం పొందడంలో సహకరించారు. కానీ విజేతలు అధికారంలో వచ్చాక చాలా జాగ్రత్తగా, జాగరూకతతో ఉండాలి. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సునాయాస విజయం దక్కుతుందని 2017లో అందరూ భావించారు. తీరా, ఇప్పుడు తన తప్పిదాల కారణంగానే బీజేపీ గెలుపు ఆసాధ్యమైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ప్రస్తుతం రెండు రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ప్రత్యర్థులుగా ఉంటున్నాయి. ఇక రెండో రకం రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ కూడా ఉనికిలో ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న రాష్ట్రాల్లోనే అసలైన పోటీ జరగనుంది. ఇలాంటి రాష్ట్రాల్లో ఇంతవరకు బీజేపీనే దాదాపు అన్ని ఎంపీ స్థానాలనూ గెల్చుకుంటూ వచ్చింది. రాబోయే ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఈ సంఖ్యను తగ్గించగలిగినప్పుడే బీజేపీ పరాజయం పొందుతుంది. కానీ ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా బీజేపీ తగినన్ని స్థానాలను గెల్చుకోగలిగితే కేంద్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పర్చగలుగుతుంది. బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండవచ్చు. ఒడిశా, బెంగాల్, కేరళ, ఈశాన్య భారత్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ చాలా బలంగా తయారైంది. మహారాష్ట్రలో, మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ కొన్ని ఎంపీ సీట్లను కోల్పోయినప్పటికీ ఒడిశా, బెంగాల్, ఈశాన్య భారత్ వంటి రాష్ట్రాలనుంచి ఆ నష్టాన్ని అది భర్తీ చేసుకోగలదు. కానీ ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్ వంటి కీలక రాష్ట్రాల్లో 171 ఎంపీ స్థానాలున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుందన్నది ముఖ్యం కాదు. కానీ ఈ 5 రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. గతంలో ఇక్కడ సాధించిన స్థానాలు పొందనవసరం లేదు కానీ ఈ 5 రాష్ట్రాల్లో మాత్రం అది కనీసం 120 స్థానాల్లో అయినా గెలుపు సాధించాల్సి ఉంది. ఈ అయిదు రాష్ట్రాల్లో చక్కటి విజయం కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నం చేస్తుంది. కొన్నాళ్ల క్రితం దాకా ఆర్డినెన్స్ ద్వారా అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తామని బీజేపీ చెబుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రధాని మోదీ సుప్రీంకోర్టు తీర్పుకోసం తాము వేచి ఉంటామని స్వరం మార్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ నూతన విధానాలను తీసుకురావచ్చు కూడా. 2018 జనవరి 9న నరేంద్రమోదీ ప్రభుత్వం అగ్రకులాల్లోని పేదల కోసం అన్ని ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణను ఆమోదింపజేసుకుంది. మొదట్లో ఈ అగ్రకులాలకు రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించినప్పుడు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ తర్వాత అగ్రకులాల ఆగ్రహాన్ని పసికట్టి పార్లమెంటులో సవరణ బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే దానికి ఆమోదం తెలిపింది. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత తమకు రాజ్యాంగం ఏమీ ప్రసాదించలేదని ఉత్తరభారత్ లోని అగ్రకులాలు భావిస్తున్నాయి. కాబట్టి ఈ బిల్లు వారిని నిజంగానే సంతోషపెడుతుంది. దీంతో ఇక్కడి జాట్లు, పటేళ్లు, రాజపుత్రులు, బ్రాహ్మణులు, వైశ్యులు తదితర అగ్రకులాల మద్దతును బీజేపీ కొంతవరకైనా పొందవచ్చు. తెలంగాణలో రైతు బంధు పథకం వంటి రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిజంగానే ఉత్తరభారత్‌లో అమలు చేయగలిగినట్లయితే, అది భారీస్థాయిలో బీజేపీ ప్రయోజనం చేకూర్చుతుంది. ఎందుకంటే భారత్‌లో సంక్షేమ ఆధారిత వ్యవస్థ పూర్తిగా కులప్రాతిపదికన ఉంటోంది. దీంతో రైతులకు ఇంతవరకు ఏమీ లభించలేదు. ఇప్పటికే రైతులందరికీ బ్యాంకు ఖాతాలు ఉన్నందున నగదు బదలీపై బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చాలు. పైగా గత అయిదేళ్లలో నేల–కార్డులు, మరింతగా సాగునీరు వంటి సాదాసీదా పథకాలు ప్రకటించడం తప్ప నరేంద్రమోదీ రైతులకు సహాయం చేయడంలో ఏమంత ఆసక్తి ప్రదర్శించలేదు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం లాగే మోదీ ప్రభుత్వం కూడా రైతులకు సహాయం చేసేవిషయంలో పరమ పిసినారితనాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. ఇప్పుడు రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీని కల్పించినట్లయితే ఉత్తరభారత్ లోని 5 కీలక రాష్ట్రాల్లో బీజేపీకి చక్కటి ఫలితాలను అందించవచ్చు. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడానికి ముందు వచ్చే 45 రోజులు కీలకమైనవి. ప్రభుత్వాలన్నీ కూడా ఎన్నికలకు ముందు మాత్రమే తాయిలాలు ప్రకటిస్తాయి. కానీ అవి పెద్దగా ప్రభావం కలిగించవు. కానీ అగ్రకులాలకు రిజర్వేషన్లు, రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ అనేవి విప్లవాత్మక విధానాలు. ఎందుకంటే స్వాతంత్య్రానంతరం గడిచిన 70 ఏళ్ల కాలంలో రైతులు ప్రభుత్వాలనుంచి ఏమీ పొందలేకపోయారు. చివరగా, నరేంద్రమోదీ పట్ల కాస్త అసంతృప్తి ఏర్పడినప్పటికీ, ఆయనపట్ల ప్రజాగ్రహం ఇప్పటికీ లేదు. నిజంగానే మోదీ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉండినట్లయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోయేది. పైగా ఉత్తరప్రదేశ్‌లో తన ఓటింగ్ శాతాన్ని బీజేపీ నిలబెట్టుకుంటోంది. మోదీ కుంభకర్ణుడిలాగా ఆలస్యంగా మేల్కొని జీఎస్టీ అధిక రేట్లను మార్చడం ప్రారంభించారు. అగ్రకులాలకు రిజర్వేషన్ల విషయంలోనూ ఆలస్యంగా మేల్కొన్నారు. కానీ భారత ఓటర్లకు ఈ ఆలస్యపు బహుమతులను ఆయన ఎలా అమలు చేస్తారన్నదే కీలకమైంది. నాలుగు ఉత్తరాది రాష్ట్రాలు, గుజరాత్ ఫలితాలపైనే బీజేపీ యుద్ధం ఆధారపడి ఉంది. అంతిమ, కీలకమైన యుద్ధంపైనే చరిత్రలో అన్ని యుద్ధాలూ ఆధారపడి ఉంటాయి. అందుకే కురుపాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధాన్ని మనం నేటికీ గుర్తుంచుకుంటున్నాం. బీజేపీ, కాంగ్రెస్‌లు తీవ్రంగా తలపడనున్న 5 రాష్ట్రాలు మాత్రమే 2019 ఎన్నికల్లో కురుక్షేత్రంగా మిగలనున్నాయి. వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ఈ–మెయిల్ : drppullarao@yahoo.co.in పెంటపాటి పుల్లారావు -
అవిశ్వాస తీర్మానంతో ఆశించిన ఫలాలు దక్కాయా?
అవిశ్వాస తీర్మానం వల్ల ఆశించిన ఫలాలు దక్కకపోగా, కాంగ్రెస్‌తోపాటు తెలుగుదేశం, ఆ పార్టీ నేత చంద్రబాబు కూడా వ్యతిరేక ఫలితాలనే చవిచూడాల్సివస్తోంది. హోదాపై హఠాత్తుగా మాట ఎందుకు మార్చారన్న మోదీ ప్రశ్నకు జవాబు లేకుండాపోయింది. ఈ తీర్మానం ఫలితంగా, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో బాబుకు ఎలాంటి ప్రయోజనం చేకూరే అవకాశాలు లేవు. అవిశ్వాస తీర్మానాన్ని తమ సభ్యులతో చంద్రబాబు ప్రవేశపెట్టించారేగాని, దాని వ్యతిరేక పర్యవసానాల గురించి ఆయన ఆలోచించనే లేదు. వాస్తవానికి ఇబ్బందుల్లో ఈదులాడుతున్న మోదీ ప్రభుత్వానికి అనుకోకుండా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ హాయిగా ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చాయి. నరేంద్రమోదీ సర్కారుపై తెలుగుదేశం ఎలాంటి వ్యూహం లేకుండా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అది వీగిపోతే పర్యవసానాలేంటో కూడా అలోచించ లేదు. కేవలం ప్రచారం కోసం, ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లను ఆకట్టుకోవడానికే పది రోజుల క్రితం ప్రవేశపెట్టిన ఈ తీర్మానం వీగిపోవడం ఆశ్చర్యం కలిగించదు. లోక్ సభలో కేవలం 16 మంది మాత్రమే సభ్యులున్న టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో తీర్మానం ప్రవేశపెట్టిందిగాని కనీసం ఈ డిమాండ్‌పై సమగ్రంగా చర్చ జరగలేదు. తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఈ పార్టీ ఎంపీల్లో మంచి వక్త ఎవరూ లేకపోవడంతో ప్రత్యేక హోదా అవసరంపై ఎవరి దృష్టిని ఆకర్షించలేకపోయారు. ఈ ఏడాది ఫిబ్ర వరిలో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో కోల్పోతున్న జనాదరణ మళ్లీ సంపాదించే ప్రయత్నంలో భాగంగానే అవి శ్వాసం ఎత్తుగడ వేసి, చివరికి విఫలమయ్యారు. వాస్తవానికి ప్రత్యేక హోదా అంశంపై మొదట ఎన్డీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి గట్టి ప్రయత్నంచేసిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెసే. తీర్మానంపై చర్చ మొదలయ్యాక సభలో జరి గిన చర్చలో అసలు విషయం మరుగున పడిపోయింది. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు తమ సొంత ఎజెండాలను చర్చకు తీసు కొచ్చాయి. కాంగ్రెస్‌కు కూడా ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చే విష యంపై ఆసక్తి లేదు. ఈ తీర్మానం ఫలితంగా ఒడిశాలో పాలక పక్షం బీజేడీ, తెలంగాణను పాలిస్తున్న టీఆర్ఎస్, ఏఐఏడీఎంకేతో టీడీపీ సంబంధాలు దెబ్బదిన్నాయి. చర్చలో పాల్గొన్న ఈ మూడు పార్టీల సభ్యులూ ఏపీ సర్కారు, టీడీపీ తీరును విమర్శించారు. తమ రాష్ట్రాల సమస్యలు ప్రస్తావనకు వచ్చిన ప్పుడు టీడీపీ ఎప్పుడూ తమకు మద్దతు ఇవ్వలేదని వారు దుయ్యబట్టారు. ఇతర ప్రాంతీయపక్షాలతో ఇలా సమన్వయం లేకుండా తెలుగు దేశం వ్యవహరించిన ఫలితంగా 90 మంది ప్రతిపక్ష ఎంపీలు తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు. తీర్మానం వల్ల రాష్ట్రానికి ఏ మాత్రం మేలు జరగకపోగా కీడు జరిగిందనే చెప్పవచ్చు. అవిశ్వాస తీర్మానంపై చర్చ వల్ల బాగా లబ్ధి పొందిన పార్టీ కాంగ్రెస్. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్డీఏ సర్కారుపై విమ ర్శల వర్షం కురిపించారు. ప్రసంగం చివర్లో ఆయన ప్రధాని మోదీ దగ్గరకు పోయి ఆలింగనం చేసుకోవడం ఆ రోజంతా పెద్ద వార్తగా ప్రచారం పొందింది. ప్రత్యేక హోదా విషయం తప్ప సభలో ఇతర విష యాలన్నీ చర్చకు వచ్చాయి. మీడియాలో అర్హతకు మించిన ప్రచారం సంపాదించిన కాంగ్రెస్ ఈ విషయంలో తెలుగుదేశాన్ని ఓడించింది. సభలో తీర్మానంపై చర్చ మొదలైన వెంటనే బిజూ జనతాదళ్ సభ్యులు వాకౌట్ చేశారు. తీర్మానంపై బీజేడీ మద్దతు సంపాదించడానికి ఆ పార్టీ నేత, ఒడిశా సీఎం నవీన్ పట్నా యక్తో మాట్లాడటానికి టీడీపీ ప్రయత్నించనే లేదు. అంటే తీర్మా నానికి వీలైనంత ఎక్కువ మంది సభ్యుల మద్దతుగాని, చర్చను ప్రత్యక్ష ప్రసారం చేసిన టెలివిజన్ చానళ్లలో ప్రచారం పొంద డానికిగానీ టీడీపీ ఆసక్తి ప్రదర్శించలేదు. కాంగ్రెస్ విషయానికి వస్తే రాహుల్ ప్రసంగం, మోదీతో ఆలింగనం వల్ల ఈ పార్టీకి జరిగింది నష్టమే. రాహుల్ ‘కౌగిలింత’కు విపరీత ప్రచారమైతే వచ్చిందిగాని ఆయన ఈ వింత చర్యతో విమర్శల పాలయ్యారు. తోటి ప్రతిపక్షాల నేతలు సైతం ఆయనను తప్పుపట్టారు. తన ప్రసంగంతో మోదీ సర్కారును రాహుల్ గట్టిగా నిలదీశారు. కాని, ఆయనకు ప్రతిపక్షాలకు నాయకత్వం వహించాలంటూ ‘కిరీటం’ పెట్టడానికి ఏ పార్టీ ముందుకు రాలేదు. ప్రతిపక్షాల నేత ఎవరో 2019 ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ కలవరపడింది. బీజేపీయేతర నేత ఎవరైనా ప్రధాని కావడానికి కాంగ్రెస్ సిద్ధమని వెంటనే ప్రకటిం చింది. లోక్‌సభలో గుర్తింపుపొందిన ప్రతిపక్షంగా లేకున్నా కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తోందనే అభి ప్రాయం రాహుల్ ప్రసంగం వల్ల వ్యాపించింది. దీని తక్షణ పర్య వసానం ఏమంటే రాహుల్ ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి అయ్యే అవకాశం కోల్పోవడం. దీంతో ఇప్పుడు మమతా బెనర్జీ నుంచి మాయావతి, శరద్ పవార్ వరకూ అందరూ ప్రధాని పదవికి అభ్యర్థులే. అవిశ్వాస తీర్మానం వల్ల ఆ«శించిన ఫలాలు దక్కకపోగా, కాంగ్రెస్‌తోపాటు తెలుగుదేశం, ఈ పార్టీ నేత చంద్రబాబు కూడా వ్యతిరేక ఫలితాలనే చవిచూడాల్సివస్తోంది. తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ జవాబిస్తూ, ప్రత్యేక హాదాకు బదులు ప్రత్యేక ప్యాకే జీకి బాబు అంగీకరించారని, ప్యాకేజీ ఇస్తున్నందుకు కేంద్రానికి కృతజ్ఞలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేయడం టీడీపీకి ఇబ్బంది కలిగించింది. హోదాపై హఠాత్తుగా మాట ఎందుకు మార్చారన్న మోదీ ప్రశ్నకు జవాబు లేకుండాపోయింది. ఈ తీర్మానం ఫలితంగా, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో బాబుకు ఎలాంటి ప్రయోజనం చేకూరే అవకా శాలు లేవు. ఎన్నికల లోపు పార్లమెంటులో ఏపీ సమస్యపై టీడీపీ సభ్యులు అప్పుడప్పుడు మాట్లాడినా సాధించేదీమీ ఉండదు. అవి శ్వాస తీర్మానాన్ని తమ సభ్యులతో చంద్రబాబు ప్రవేశపెట్టించారే గాని, దాని వ్యతిరేక పర్యవసానాల గురించి ఆయన ఆలోచించనే లేదు. అదీగాక, పార్టీ తరఫున సీనియర్ ఎంపీలతో చర్చలో మాట్లాడించే ప్రయత్నం చేయకపోవడం తెలుగుదేశం నేత చేసిన పెద్ద పొరపాటు. చివరికి మాజీ కేబినెట్ మంత్రి పి.అశోక్‌గజపతి రాజుతో మాట్లాడించాలన్న యోచనే రాలేదు. అనుభవంలేని ముగ్గురు జూనియర్ ఎంపీలకు ప్రాధాన్యం ఇచ్చారు. వారు తమ ప్రసంగాల్లో చెప్పిన విషయాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌పై సభలో మంచి అభిప్రాయం కలగలేదు. గత నాలుగేళ్లుగా సాగిన అపసవ్య పాలనను కప్పిపుచ్చుకోవ డానికే తెలుగుదేశం లోక్‌సభలో గొడవ చేసిందనేది అందరికీ అర్థమైంది. అన్ని సమస్యలకూ బీజేపీ సర్కారే కారణమన్న నింద వల్ల తెలుగదేశం ప్రభుత్వానికే నష్టం చేస్తుంది. వాస్తవానికి పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ఆర్థిక వ్యవస్థకు బీజేపీ కీడు చేసింది. అవిశ్వాస తీర్మానం వల్ల బీజేపీయే బలప డింది. సభలో తనకు సంఖ్యాబలం ఉందని నిరూపించుకుంది. వాస్తవానికి ఇబ్బం దుల్లో ఈదులాడుతున్న మోదీ ప్రభుత్వానికి అనుకోకుండా తెలు గుదేశం, కాంగ్రెస్ పార్టీ హాయిగా ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చాయి. ప్రత్యేక హోదా డిమాండ్‌ను లేవనెత్తడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ల ఆధిపత్య కులాల మధ్య పోటీ, కుల వివక్ష వంటి అంశా లను కప్పిపుచ్చాలని తెలుగుదేశం భావించింది. వచ్చే ఎన్నికల్లో కొన్ని కులాల ఆధిపత్యం అతి పెద్ద అంశంగా వచ్చే అసెంబ్లీ ఎన్ని కల్లో జనంలోకి చర్చకు వస్తుంది. పెంటపాటి పుల్లారావు ,వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ఈ–మెయిల్ : drppullarao@yahoo.co.in -
సీఎం వ్యాఖ్యలు దారుణం: పెంటపాటి
ఏలూరు: సిఎం చంద్రబాబుకు సామాజికవేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు ఓ ప్రకటనలో కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును ఆపడానికి తాను ప్రధానమంత్రిని కలిశానని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఐదు లక్షల మంది నిర్వాసితుల సమస్య ఉందన్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ప్రధానిని కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరానని తెలిపారు. నిర్వాసితులకు అందాల్సిన సొమ్ము కేంద్ర చట్టాల ప్రకారం రావాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, సామాన్యులు కోర్టుకు వెళ్లడాన్ని తప్పుపడుతున్న చంద్రబాబు విభజన హామీలపై కోర్టును ఆశ్రయిస్తామని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. -
కళ్లు తెరవడమే కాంగ్రెస్ కర్తవ్యం
మోదీ ఘోర తప్పిదాలు చేసే వరకు మిన్నకుండటమే రాహుల్ చేయవలసిన పని. దీనితోపాటు 2004-2014 మధ్య యూపీఏ గాఢ నిద్రలో ఉండిపోయిన సంగతినీ, ఆ కాలంలోనే మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాస్తవాన్నీ గుర్తించాలి. మధ్యతరగతిని విస్మరించినందుకు, ఎగువతరగతి వారిని విలన్లుగా చూసినందుకు, తన బావ భూకుంభకోణాలకు జాతికి క్షమాపణ చెప్పాలి. ఆ తరువాతనే మోదీ మీద విమర్శకు దిగాలి. దిగ్విజయ్, మధుసూదన్ మిస్త్రీ, మోతీలాల్ ఓరా, అంబికా సోనీ, మొయిలీ వంటి దివాలాకోరు సలహాదారులను తిరస్కరించాలి. సోనియా, ప్రియాంకల మాట వినడం కూడా అనవసరం. రాహుల్ గాంధీ నలభై నాలుగేళ్ల నడివయసులో ఉన్నారు. ఆయన తండ్రి రాజీవ్ 39 ఏళ్లకే ప్రధాని పదవి చేపట్టారు. 32 ఏళ్లకు కన్నుమూసిన గ్రీస్ చక్ర వర్తి అలెగ్జాండర్ 24 ఏళ్లకే ప్రపంచ విజేతగా నిలిచాడు. మొగల్ వంశ స్థాప కుడు బాబర్ 23 ఏళ్లకే ఢిల్లీ, ఆగ్రాల మీద తన పతాకను ఎగురవేశాడు. చెం ఘిజ్ఖాన్ 22వ ఏటనే మంగోల్ రాజ్యాధిపతి అయ్యాడు. నెపోలియన్ బోనా పార్టి తన 28వ ఏట ఈజిప్ట్ మీద విజయం సాధించాడు. వీరంతా యౌవన ప్రాదుర్భావంలోనే శత్రువులను జయించి, స్వశక్తితో నేతలుగా అవతరిం చారు. వీరు ఎవరికో వారసులు కారు. తమను తాము శిల్పించుకున్నవాళ్లే. కానీ రాహుల్ గాంధీ తెచ్చుకున్న కీర్తిప్రతిష్టలు స్వార్జితాలు కావు. ఆయన ఒక ప్రముఖ కుటుంబం ద్వారా వచ్చిన ప్రాభవాన్ని అందుకున్నవాడే. కొత్త ఇమేజ్ కోసం తపన రాహుల్ 2004లో రాజకీయాలలో ప్రవేశించారు. తమ కుటుంబం నియమిం చిన డాక్టర్ మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉండడంతో దేశంలోనే అత్యంత పలు కుబడి కలిగిన వ్యక్తిగా అవతరించారు. యూపీఏ అధికారంలో ఉన్న ఆ పదేళ్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రపంచంలోనే ఈ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో నిరపేక్ష అధికారాన్ని చలాయించారు. అధికారంలో కొనసాగడం కోసం సామాజిక, ఆర్థిక వ్యవస్థలను ఒక ఆట ఆడించారు. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిని, ఏటా పది శాతం ద్రవ్యోల్బణం పెరిగింది. పదకొండు కోట్ల మంది నిరుద్యోగులు మిగిలారు. కానీ ఇందుకు మన్మోహన్‌ను నిందిం చలేం. యూపీఏ కులాలూ, మతాల కోసం చట్టాలు చేసింది. ఒక వర్గం మీద మరో వర్గాన్నీ, ఒక మతం మీద మరో మతాన్నీ రెచ్చగొట్టే విధంగా కూడా వ్యవహరించింది. 2014 ఎన్నికలలో ఓటమి తరువాత ఏకే ఆంటోనీ చేసిన వ్యాఖ్య చూడండి! తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేసిందని దేశంలో మెజారిటీ వర్గం భావించడం వల్లనే ఓటమి ఎదురైందని అన్నారు. పార్టీ కూడా సామాజికాంశాల మీదనే ఎక్కువ దృష్టి సారించామనీ, దీనితో ఆర్థిక వ్యవస్థ పట్ల అలక్ష్యం వహించామనీ అంగీకరించింది. రాహుల్ వాస్తవిక ఓటమి ఈ ఎన్నికలలోనే ఉంది. ఆయన అధికారమంతా కునారిల్లిపోయింది. ఇప్పుడు మాత్రం రాహుల్ శక్తియుక్తులను చాటడానికి ప్రసార మాధ్యమా లను ఉపయోగించుకోవడానికి అవసరమైన వ్యూహం కోసం కాంగ్రెస్ అన్వే షిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ వార్తలూ, ఫొటోలూ రాహుల్ దేశం కోసం తపన పడుతున్నారన్న అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నాయి. రాహు ల్ను కొత్త రూపంలో చూపాలని యత్నిస్తున్నాయి. మొత్తంగా చూస్తే మోదీని విమర్శిస్తే చాలు, ప్రజానీకం కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందన్న అభిప్రాయంతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఐదు శాతం ఓట్లు కనుక తగ్గితే బీజేపీ ఓడిపోతుందని రాహుల్ భావన. కాబట్టి ఆ మేరకు బీజేపీ ప్రాభవాన్ని తగ్గించగలిగితే, 2019 సంవత్సరానికయినా అధికారం నుంచి తప్పించవచ్చు. రాహుల్ ఏం చేస్తున్నారు? రాహుల్ పార్లమెంట్లో లేచి ఏదో వ్యాఖ్యానిస్తున్నారు. పేదల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీద ధ్వజమెత్తుతున్నారు. ఇది ప్రజల దృష్టినీ, మీడియా దృష్టినీ ఆకర్షిస్తున్నది. ఒక కొత్త పార్లమెంటేరియన్ ఆవిర్భ వించాడని మీడియా వ్యాఖ్యానిస్తున్నది. అయితే ఇది ఎంతో కాలం పని చేయదు. ఇది శ్రుతి మించితే వికటించే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే, ప్రస్తుతం భారతదేశంలో 70 శాతం అక్షరాస్యులు. అలాగే గడచిన పదేళ్లలో కాంగ్రెస్ చేసిన నిర్వాకం మరచిపోవడానికి వారు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఇన్ని సుద్దులు చెబుతున్న వీరు అధికారంలో ఉండగా ఏం చేశారు? అన్న ప్రశ్న వస్తున్నది. రాహుల్ రైతాంగం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మోదీ రైతాంగం గురించి అసలేమీ పట్టించుకోవడం లేదని రాహుల్ ఆక్రోశిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో, కొందరు రైతులను కలసి తన సానుభూతి కూడా తెలిపి వచ్చారు. కానీ గుర్తుంచుకోవలసినదేమిటంటే- యూపీఏ పదేళ్ల పాలనలో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పు డు రాహుల్ ఏమీ మాట్లాడలేదు. సోనియా అధ్యక్షతన పనిచేసిన జాతీయ సలహా మండలి సూపర్ ప్రభుత్వం మాదిరిగా పని చేసింది. ఇందులో మైనా రిటీలు, దళితులు, బీసీలు అంతా ఉన్నారు. కానీ ఒక్క రైతు ప్రతినిధికి కూడా స్థానం ఇవ్వలేదు. సోనియా, రాహుల్, మన్మోహన్ రైతాంగాన్ని కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంకుగానే పరిగణించారు. అలాగే భూచట్టం దేవుడిచ్చిన వరం అన్న తీరులో రాహుల్ మాట్లాడుతున్నారు. రైతుతో వారి సమస్యలతో ఏమాత్రం సంబంధం లేని జైరామ్ రమేశ్ దీనిని రూపొందించారు. 2004- 2014 మధ్య భూములు కోల్పోయిన ఏ రైతూ దీనితో పొందగలిగేది ఏమీ లేదు. తెలుగు రాష్ట్రాలలో ఏ రైతును అడిగినా ఈ సంగతి తెలుస్తుంది. రాహుల్ మధ్యతరగతి గురించి కూడా ఇప్పుడే మాట్లాడుతున్నారు. యూపీఏ అధికారంలో నుంచి వైదొలగినప్పుడు దేశంలో 11 కోట్ల విద్యావంతులైన నిరుద్యోగ యువతీయువకులు ఉన్నారు. ఆ పదేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, గాంధీలు కానీ ‘మధ్యతరగతి’ అని తమ నోటితో ఉచ్చరించ లేదు కూడా. అప్పుడు వారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం గురించి ఎక్కువగా మాట్లాడారు. దానితో కొందరికి రోజుకు 80 రూపాయలు దక్కాయి. ఆ వర్గాల ఓట్లు కాంగ్రెస్‌కు శాశ్వతంగా కావాలి. ఇది పరోక్షంగా అత్యంత ధనికులకు ఉపయోగపడింది. కానీ మన్మోహన్, లేదా కాంగ్రెస్ మధ్యతరగతి గురించి ఏనాడూ ప్రస్తావించిన పాపాన పోలేదు. కాంగ్రెస్ చేసిన తప్పిదాలతోనే కాదు, ప్రజలూ, కార్యకర్తలతో కూడా సంబంధం లేనట్టే రాహుల్ వ్యవహరిస్తున్నారు. అలా అని ఆయన చేసిన మంచిపనులు అసలేమీ లేవు అని అనలేం. కానీ అవన్నీ చాలా పరిమితమే కాక, ఎంతో ఆలస్యంగా జరిగాయి. అరుదుగానే అయినా రాహుల్ రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. పర్యావరణ మంత్రి జయంతి నటరాజన్ అవినీతికి పాల్పడ్డారని గుర్తించి, పదవి నుంచి తొలగించారు. కానీ ఆ పని ఇంకా ఎంతో ముందు చేసి ఉండవలసింది. జైరామ్ రమేశ్ వంటి వారు పార్టీకి మేలు కంటే కీడే ఎక్కువ చేశారని కూడా రాహుల్ గుర్తించారు. 2014 ఎన్నికలలో జైరామ్‌ను రాహుల్ ఎన్నికల ప్రచా రానికి దూరంగా ఉంచారు కూడా. అప్పుడు తెలం గాణ, ఆంధ్రాలలో ఆయన అంతకాలం తిష్ట వేయడానికి కారణం అదే. తెలుగు ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులంటే రాహుల్‌కు ఆట్టే విశ్వాసం లేదు. పంచాయతీ సర్పంచ్‌గా కూడా గెలవలేని వారంతా రాజ్య సభకు వచ్చి కూర్చోవడం రాహుల్‌కు వింతగానే ఉంది. ఢిల్లీ నాయకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తేవారే కీలక పదవులలో ఉన్న సంగతి కూడా ఆయనకు తెలియనిది కాదు. ఈ దుస్థితిని మార్చడానికి తన వంతు యత్నం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలను అభిమానించడం సహా, చాలా ఆశయాలు ఆయనకు ఉన్నాయి. కానీ వాటిని అమలు చేస్తే తల్లి నుంచి మద్దతు ఉంటుందా? లేక అసలు అంత పని చేపట్టడానికి తనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఈ సంగతి కూడా ఆయనకు తెలియదు. జాతికి క్షమాపణ చెప్పాలి రాహుల్ తన పర్యటనలతో, సమావేశాలతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారని మీడియా కథనాలు అల్లుతోంది. రాహుల్ పార్లమెంటులో గళం ఎత్తడం వల్లనే ఆయనను పెద్ద నేతగా చిత్రిస్తున్నది. పేదవర్గాలతో మమేకమవుతూ, ఇదే తీరులో పర్యటనలను సాగిస్తుంటే మంచిదని కూడా మీడియా సలహా ఇస్తు న్నది. కానీ ఇది అంత సులభమా? ఇవన్నీ ఎలా ఉన్నా, కాంగ్రెస్ యువనేత ఒక అంశం గుర్తుంచుకోవాలి. తప్పులు చేస్తున్న శత్రువును నిలువరించవద్దు అంటాడు నెపోలియన్. నరేంద్ర మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్న రాహుల్, ఆ తప్పులేవీ తీవ్రమైనవి కావని గుర్తించాలి. నిజానికి నిరంతర విమర్శలతో రాహుల్ మోదీకి మేలు చేసినవారవుతారు. ఆ విమర్శలతో మోదీ జాగ్రత్త పడతారు. ఆయన ఘోర తప్పిదాలు చేసే వరకు మిన్న కుండడమే రాహుల్ చేయవలసిన పని. దీనితో పాటు 2004-2014 మధ్య యూపీఏ గాఢ నిద్రలో ఉండిపోయిన సంగతినీ, ఆ కాలంలోనే మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాస్తవాన్నీ ఆయన గుర్తించాలి. మధ్యతరగతిని విస్మరించినందుకు, ఎగువ తరగతి వారిని విలన్లుగా చూసి నందుకు, తన బావ చేసిన భూకుంభకోణాలకు జాతికి క్షమాపణ చెప్పాలి. ఆ తరువాత మోదీ మీద విమర్శకు దిగాలి. దిగ్విజయ్, మధుసూదన్ మిస్త్రీ, మోతీలాల్ ఓరా, అంబికా సోనీ, మొయిలీ వంటి దివాలాకోరు సలహాదారు లను తిరస్కరించాలి. సోనియా, ప్రియాంకల మాట వినడం కూడా అనవ సరం. ఎందుకంటే వారివన్నీ పాత పంథాలే. మన్మోహన్, ఏకే ఆంటోనీ వంటి నిజాయితీపరులను ముందుకు తెచ్చుకోవాలి. వ్యవహార సరళి కాదు, విషయం ముఖ్యం. కొంతకాలం తరువాత వ్యవహార సరళిని కాదు, విష యాన్నే జనం పట్టించుకుంటారు. మోదీకైనా, రాహుల్‌కైనా ఇదే ముఖ్యం. (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) e-mail:Drpullarao1948@gmail.com -
స్వపక్ష సీఎంలతోనే శిరోభారం
విశ్లేషణ బీజేపీ సీఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లడం ద్వారా ప్రధాని మోదీ వ్యూహాత్మకంగానే తప్పిదం చేస్తున్నారు. తన జనరంజక నాయకత్వాన్ని ప్రదర్శించుకోవడమే ఆయన ఉద్దేశం. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రతి తప్పిదం మోదీ మెడకే చుట్టుకుంటోంది. ‘మంచి ప్రధాని కసాయివాడిగా ఉండాల’ని బ్రిటిష్ పూర్వ ప్రధాని మెక్‌మిలన్ చెప్పేవారు. అసమర్థ మంత్రులను తొలగించాలని దీని అర్థం. ప్రధాని మోదీ ఇప్పుడు ఈ పని ప్రారంభించకపోతే స్వపక్ష సీఎంలు, మంత్రులే ఆయన్ని వచ్చే ఎన్నికల్లో కిందికి లాగటం తప్పదు. ప్రపంచంలో ఓటమి అన్నదే ఎరుగని బలశాలి అచిల్లెస్ గురించి ప్రాచీన గ్రీకు గాథలు మనకు తెలియబర్చాయి. కానీ ఇంత బలాఢ్యుడికీ ఒక బలహీ నత ఉండేది. అతడి పాదమే ఆ బలహీనత. చరిత్రలో ఇది అచిల్లెస్ పాదంగా పేరొందింది. ఆ పాదంలోకి బాణం సంధించడం ద్వారా శత్రువులు అతడిని ఎట్టకేలకు చంపేశారు. మన దేశం విషయానికి వస్తే, నరేంద్రమోదీ, బీజేపీ 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే పథక రచనలో మునిగి తేలుతుం డగా బీజేపీ పాలిత రాష్ట్రాలు వారి అచిల్లెస్ పాదంగా తయారవుతున్నాయి. ఇంతవరకు ఉనికిలేని రాష్ట్రాల్లో అధికారం గెల్చుకోవడం ప్రస్తుతం బీజేపీ వ్యూహం. ఇదొక అద్భుత వ్యూహమే. కేరళ నుంచి తమిళనాడు వరకు అటునుంచి అస్సాం వరకు కూడా బీజేపీ ఈ విషయమై బాగానే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో, 2014 ఎన్నికల్లో అద్భుత విజ యాలు సాధించిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని, మద్దతును కూడా నిలుపు కోవాలి. అసాధారణ విజయాలను అందించిన ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ ప్రజాదరణను కోల్పోతుండటం గమనార్హం. వీలైనన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పర్చాలన్నది బీజేపీ అభిమతం. కానీ రాష్ట్రాలను గెల్చుకోవడమనేది రెండంచుల కత్తిలాంటిది. ఒక రాష్ట్రాన్ని బీజేపీ గెల్చుకుందనుకోండి. తర్వాత ఆ రాష్ట్ర సీఎం పాలన అసమర్థంగా తయా రవుతుంది. సీఎం అప్రతిష్ట మోదీ ప్రజాదరణను దెబ్బతీస్తుంది. మోదీ ప్రజా దరణ మాత్రమే కాదు.. బీజేపీ సీఎంల ప్రాచుర్యం కూడా కీలకమే. బీజేపీ సీఎంలు అస్తవ్యస్త పాలన చేస్తే, మోదీ ఆ రాష్ట్రాలలో గెలుపు సాధించలేరు. గర్వాతిశయానికి మూల్యం తప్పదు ఒక రాజకీయ పార్టీ పార్లమెంట్ స్థానాలను గెల్చుకోవాలనుకుంటే, రాష్ట్రాల్లో తన బలంపైనే ఆధారపడుతుంది. పార్లమెంటుకు, అసెంబ్లీకి ప్రజలు వేర్వేరుగా ఓటేయరు. ఉదాహరణకు: సీపీఎం ప్రతి సార్వత్రిక ఎన్నికలోనూ పశ్చిమబెంగాల్లోని 42 ఎంపీ స్థానాల్లో కనీసం 28 సీట్లు గెల్చుకునేది. కాని అధికారం కోల్పోగానే సీపీఎంకి కేవలం 2 ఎంపీ స్థానాలే దక్కాయి. 2004లో, 2009లో కూడా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కాంగ్రెస్‌కు అత్యధిక ఎంపీ స్థానాలను గెలిపించగలిగారు. కర్ణాటకలో యడ్యూరప్ప విషయానికి వద్దాం. తను సీఎం కానంతవరకు బీజేపీకి ఆ రాష్ట్రంలో బలం పెరుగుతూ వచ్చింది. కానీ, యడ్యూరప్ప దుష్పరిపాలన పార్టీని ఘోరంగా దెబ్బతీసింది. 2014లో బీజేపీ కర్ణాటకలో అధికారంలో లేనప్పటికీ మొత్తం 28 ఎంపీ స్థానాల్లో 16 సీట్లను బీజేపీ గెల్చుకోగలిగింది. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఉండకపోవడమే ఏ పార్టీకయినా మంచిది. వాస్తవానికి, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, అసోమ్, హరియాణా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 2009లో 208 ఎంపీ స్థానాలు గెల్చుకుంది. అప్పట్లో అది ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్, మధ్యప్రదేశ్, తదితర అనేక రాష్ట్రాల్లో అధికారంలో లేదు. ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కలిగి ఉండక పోవడం అనేది జాతీయ పార్టీకి అనేక సార్లు అనుకూల పరిణామాలను తీసుకొచ్చేది. మోదీకి, బీజేపీకి ప్రధాన సమస్య ఏమిటంటే, మోదీ ఢిల్లీలో ఏం చేస్తారనే విషయం కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేస్తాయన్నదే. బహుశా కేంద్రంలో మోదీ బాగానే పనిచేయవచ్చు. కాని ప్రజాదరణ కోల్పోతున్న బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాల దుష్ఫలితాల మూల్యాన్ని మోదీ ఎదుర్కోవలసి ఉంటుంది. ఏదేమైనా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ జాగ్రత్తగా పరిశీలిం చవలసి ఉంటుంది. బీజేపీ సీఎంలు, మంత్రులు విఫలమైతే వారిని తొలగించాల్సిన సమస్య కూడా ప్రస్తుతం మోదీ మెడకు చుట్టుకుంటోంది. ఎవరిని తొలగించాలి, ఎవరిని నియమించాలి? అనే అంశాన్ని కూడా ఆయన తేల్చుకోవాలి. 2014లో మోదీ ప్రధాని అయినప్పుడు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలోనే బీజేపీ ముఖ్యమంత్రులు ఉండేవారు. మిగతా దేశమంతటా ఇతర పార్టీలు అధికారంలో ఉండేవి. కాబట్టే మోదీ అప్పట్లో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం పైనా దాడి చేసేవారు. కానీ ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలను మోదీ కాపాడుకోవాలి. 2014 తర్వాత బీజేపీ మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణాలను గెల్చుకుంది. పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వామ్యం పుచ్చుకుంది. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్‌లో వసుంధరా రాజే, ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్, గుజరాత్లో ఆనందీబెన్ పటేల్ బీజేపీ సీఎంలుగా ఉన్నారు. 2005 నుంచి నేటివరకు ప్రతి ఎన్నికలోనూ బీజేపీని గెలిపిస్తూ వస్తున్న శివరాజ్ సింగ్ బీజేపీ సీఎంలలో ఉత్తమ సీఎంగా పేరొందారు. తరచుగా శివరాజ్ వివాదాల్లో చిక్కుకుం టున్నప్పటికీ వాటిని అధిగమిస్తు న్నారు. ఆయన నిస్సందేహంగా మోదీకి, బీజేపీకి విలువైన సంపదే మరి. అలాగే 2003 నుంచి ఛత్తీస్‌గఢ్‌లో ఓటమన్నదే ఎరుగని రమణ్‌సింగ్ కూడా బీజేపీకి వరం లాంటివారే. ఇక రాజస్థాన్ సీఎం వసుంధరారాజే మోదీ ఆధారపడదగ్గ నేతగా లేరు. పైగా వచ్చే ఎన్నికల్లో ఆమె పార్టీని ఓటమివైపు నెట్టనున్నారని అంచనా. అనుభవం నుంచి నేర్చుకోని వసుంధరవల్ల రాజస్థాన్‌లో బీజేపీ రక్తమోడ్చవలసిందే. ఇక మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొత్తవాడే కానీ ఏమాత్రం పాలనానుభవం లేనివాడు. మహారాష్ట్ర రాజకీయంగా అత్యంత ప్రాముఖ్యం గల రాష్ట్రం. 1999 నుంచి గడచిన 15 ఏళ్లుగా కాంగ్రెస్-ఎన్సీపీ పాలనలో ఆరుగురు సీఎంలు మారారు. ఇక్కడ శరద్‌పవార్ వంటి రాజకీయ దిగ్గజంతో ఫడ్నవీస్ తలపడవలసి ఉంటుంది. బీజేపీ ఇక్కడ శివసేన మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పర్చింది. ఈ రెండు పార్టీల మధ్య దాంపత్యం గిల్లికజ్జాలతోనే నడుస్తోంది. గొడ్డుమాంసంపై నిషేధం విధించటం మినహా ఫడ్నవీస్ ఇక్కడ చేసిందేమీ లేదు. ఆ ఒక్కటి కూడా వివాదాన్ని రేపింది. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం కానీ, ఇలాగే కొనసాగితే బీజేపీ 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 48కి గాను 42 ఎంపీస్థానాలను గెల్చుకోవడం కల్లే. బీజేపీకి పాలనాపరంగా సరిపోని వ్యక్తిగా ఫడ్నవీస్ మిగిలి పోనున్నారు. ఇక జార్ఖండ్‌లో బీజేపీ సీఎం రఘుబర్ దాస్ గత అనుభవం లేని తొలి సీఎం. ఈ చిన్న రాష్ట్రంలోని 14 ఎంపీ స్థానాల్లో 13 సీట్లను బీజేపీ గెల్చుకుంది. కాని ఇలాంటి ఫలితాలు భవిష్యత్తులో రాకపోవచ్చు. ఎందుకంటే దాస్ అద్భుతాలు సృష్టించే కార్యకర్త కాదు. బహుశా, బీజేపీ పార్టీలో అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి హరియాణా సీఎం జగదీష్ ఖట్టర్. తను కూడా తొలిసారి ఎమ్మెల్యే, సీఎంగా అయ్యారు. ప్రతిరోజూ ఈ రాష్ట్రంలో ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. హరి యాణా భౌగోళికంగా ఢిల్లీకి దగ్గరగా ఉన్నందున ప్రతి వివాదమూ మీడి యాకు తెలిసిపోతోంది. ఖట్టర్ అత్యంత ప్రాచుర్యం గల ఐఏఎస్ అధికారి ఖెమ్కాను బదిలీ చేయడమే కాకుండా, కశ్మీర్లో కన్నుమూసిన సైనికుల కుటుంబ సభ్యులతో మొరటుగా వ్యవహరించి అప్రదిష్ట మూటగట్టుకు న్నారు. చివరకు మంత్రుల గౌరవం కూడా పొందని ఖట్టర్‌ను ఇప్పుడే తొలగించాలా లేక హరియాణాలో బీజేపీని అతడు నిండా ముంచిన తర్వాతే తొలగించాలా అనేది మోదీనే నిర్ణయించుకోవాలి. తెలుగు రాష్ట్రాలు : బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీకి ఇద్దరు మంత్రులు ఉన్నా రు. ఇద్దరు మంత్రులతోనే సంతృప్తిపడాలా లేదా మరిన్ని పదవులు కోరాలా? అనే ప్రశ్న ఆ పార్టీ ముందుంది. ఇద్దరు మంత్రులతో బీజేపీ ఏపీలో టీడీపీకి బానిసగానే ఉంది. అధికారంలో ఉన్నవారు ప్రస్తుతానికయితే సౌకర్యంగా నూ, సంతోషంగానూ కనబడుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి వైదొలిగి బయటనుంచి మద్దతు ఇవ్వడం బీజేపీకి ఉత్తమంగా ఉంటుంది. ఆంధ్రాలో తాను సొంతంగా ఎదగాలా లేదా 1999లో టీడీపీతో జట్టుకట్టి ఆనక అదృశ్య మైనట్లు నిండా మునగాలా అన్నది బీజేపీయే తేల్చుకోవాలి. ఇక తెలంగాణ లో సొంతంగా ఎదగాలంటే బీజేపీ ఇప్పటికైతే పొత్తులకు దూరంగా ఉండాలి. ఎన్నికల నాటికి ఎవరితో జత కట్టాలో నిర్ణయించుకోవచ్చు. తెలంగాణలో బీజేపీ పంజరంలో మేతలేని పక్షిలాగా ఉండగా, ఆంధ్రాలో కొంత మేత ఉన్న చిలుకలాగా ఉంటోంది. పక్షులు అడవిలో పెరగాలి కాని పంజరాల్లో కాదు. పొంచి ఉన్న ప్రమాదం హరియాణా, కశ్మీర్, పంజాబ్, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్గర్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. ఇక్కడ బీజేపీ బలహీనపడితే కాంగ్రెస్‌కు అది బలం అవుతుంది. కాంగ్రెస్ మోదీని దెబ్బ తీసే స్థితిలో లేదు. కానీ, మోదీని అనేక రాష్ట్రాల్లో తన పార్టీ వ్యక్తులే దెబ్బతీయగలరు. మోదీ తప్పకుండా అచిల్లెస్ను గుర్తు చేసుకుని తన పాదాన్ని కాపాడుకోవాలి. కాంగ్రెస్ కంటే బీజేపీలోని తన అనుయాయులే మోదీకి అత్యంత ప్రమాదకారులుగా ఉంటున్నారు. (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ఈమెయిల్: Drpullarao1948@gmail.com) -
హస్తిన పైనే అందరి కన్నూ
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే పర్యవసానాలు దేశవ్యాప్తంగా ఉంటాయి. పోటాపోటీగా సాగనున్న ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు సరితూగే కిరణ్‌బేడీని రంగంలోకి దించి ఆమ్ఆద్మీనే కాక, కాంగ్రెస్‌ను కూడా బీజేపీ ఖంగు తినిపించింది. మోదీ పట్ల ప్రజలు అసంతృప్తితో లేరు. అలా అని సంతోషంగానూ లేరు. స్టాక్ మార్కెట్లను, కార్పొరేట్ రంగాన్ని సంతృప్తి పరిస్తే చాలదు. ప్రజలను కూడా తృప్తి పరచాలి. మోదీ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారితే బీజేపీ దేశవ్యాప్తంగా కుప్పకూలుతుంది. అమెరికా, ఇంగ్లండ్, రష్యా లేదా ఫ్రాన్స్ దేశాల రాజధాని నగరాల మేయర్లు ఎవరో ఎవరూ పట్టించుకోక పోవడం విచిత్రం. అంతదాకా ఎందుకు, హైదరాబాద్ లేదా ముంబై మేయర్ ఎవరో గుర్తుందా? ఆ నగరాలలో చాలావాటికంటే ఢిల్లీ చిన్నది. కానీ ఆ ఎన్నికలే రాజకీయవేత్తలందరికీ అతి కీలకమైనవి. మీడియా సైతం మిగతా రాష్ట్రాలన్నిటికీ కలిపి ఇచ్చే దాని కంటే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఢిల్లీకి ఇస్తుంది. పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత 2013లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ, ఆ పార్టీని నిర్ణయాత్మకంగా ఓడించింది. దాని ఓటు బ్యాంకులన్నిటినీ కొల్లగొట్టింది. ఢిల్లీ శాసనసభ 70 స్థానాల్లో బీజేపీ 31, ఆప్ 28, గెలుచుకోగా, కాంగ్రెస్ 8 స్థానాలకు పరిమితమైంది. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న షీలా దీక్షిత్ సైతం ఓటమిపాలై, ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోలేదు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని 7 స్థానాలను భారీ ఆధిక్యతతో గెలుచుకుంది. కానీ రాష్ట్ర స్థాయి ఎన్నికలు అందుకు భిన్నమైనవి. హఠాత్తుగా కేజ్రీవాల్ బాగానే గడబిడ చేస్తున్నారు. కాంగ్రెస్ సైతం తిరిగి పూర్వప్రాభవం గురించి కలలు కంటోంది. షీలా దీక్షిత్‌ను పక్కకు తప్పించి అజయ్ మాకెన్‌ను ప్రచార సారథిని చేసింది. పార్లమెంటు ఎన్నికల తదుపరి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచింది. ఢిల్లీలో ఓడిపోతే, ఆ పార్టీకి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. పార్టీ వృద్ధిని నిరోధిస్తుంది. ఏది ఏమైనా బీజేపీని నిలువరిం చాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలుగుదేశం, శివసేన, అకాలీదళ్ వంటి బీజేపీ మిత్రపక్షాలు సైతం అది ఓడిపోతేనే అదుపులో ఉంటుందని సంతోషిస్తాయి. నిజానికి రిటైరయిన బీజేపీ సీనియర్ నాయకత్వం ఢిల్లీలో ఓడిపోవాలనే కోరుకుంటుంది. ఇక కాంగ్రెస్ 2013లో దక్కించుకున్న 8 సీట్ల కంటే మెరుగ్గా రాణించాలి. అప్పుడే రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధ్యక్షులు కాగలుగుతారు. మోదీ విజయాలు, నాయకత్వ శైలి గాంధీ కుటుంబంలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. జైల్లో ఉండాల్సింది పోయి ఆయన ప్రధాని అయ్యారు. అవమానానికి లేదా నిర్లక్ష్యానికి గురికావడానికి గాంధీ కుటుంబం అలవాటు పడినది కాదు. అందుకే ఓటమిని జీర్ణించుకోలేక పోతోంది. ఇక కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలి. లేకపోతే భారీగా నష్టపోయి, మరపునపడి పోతారు. అధికార వర్గేతర పార్టీ ఆమ్ఆద్మీ కేజ్రీవాల్ నేతృత్వాన ఢిల్లీలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడం గొప్ప రాజకీయ ప్రయోగం. ఈ ఎన్నికల్లో ఓటమిపాలైతే అలాంటి ప్రయోగం తిరిగి మరెన్నడూ జరగదు. కాబట్టి ఢిల్లీ ఎన్నికలు కాంగ్రెస్, కేజ్రీవాల్‌లకు అస్తిత్వ సమస్య. ఇక బీజేపీ ఓటమి పాలవడం అంటే మోదీ, అమిత్‌షాలు ప్రతిష్టను కోల్పోవడం. ఇక బీజేపీని నిలవరించడానికి ప్రతిపక్షాలు ఒక్కటవుతాయి. కాంగ్రెస్ వ్యూహం కాంగ్రెస్‌కు అపార నిధులున్నాయి. ఢిల్లీలో పెద్ద క్యాడరూ ఉంది. ఆ పార్టీ నేతలు గత 60 ఏళ్లుగా అంతులేని అధికారాన్ని అనుభవించినవారు. సానుభూతి లభిస్తుందేమోనన్న ఆశతో ఈసారి ఆ పార్టీ ప్రతిచోటా సీనియర్ నేతలను బరిలోకి దించుతోంది. దురదృష్టవశాత్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తమ పుత్రిక శర్మిష్ట ముఖర్జీని కాంగ్రెస్ తరఫున పోటీకి దిగనిచ్చారు. ఆయన కుమారుడు బెంగాల్ నుంచి ఎంపీ. ఆయనేమో రాష్ట్రపతి. మొత్తం కుటుంబ మంతా ఇలా అధికారానికి అర్రులు చాచడం మంచిది కాదు. కాంగ్రెస్ చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నందున మంచినీళ్ల ప్రాయంగా డబ్బు ఖర్చు చేస్తుంది. 2013లో వచ్చిన 24 శాతం కంటే తక్కువ ఓట్లు వస్తే ఆ పార్టీ పునరుజ్జీవనం ఇక కలే. అందుకే ఒకప్పటి కాంగ్రెస్ సానుభూతిపరులంతా ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో లబ్ధి పొందిన నామినేటెడ్ ఎంపీలు, గవర్నర్లు, కొందరు ‘మేధావులు’ కూడా వేచి చూస్తు న్నారు. ఓడ ఎప్పుడు మునిగిపోతుందో దాన్లో ఉన్న ఎలుకలు ముందుగా పసిగట్టి దుంకేస్తాయి. అలాగే చాలా మంది కాంగ్రెస్ నేతలు ఢిల్లీ ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. కేజ్రీవాల్ వ్యూహం, బలహీనతలు కేజ్రీవాల్ 2013 ఎన్నికలకు ముందు రెండేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ధూషించి, అవమానించిన తీరు సిగ్గుచేటైనది. అయినా ఆయన గొప్ప అద్భుతాలు చేసి కాంగ్రెస్, బీజేపీలను ఓడించి గెలుపొందారు. ముఖ్యమంత్రి అయ్యాక కేజ్రీవాల్ ఆమోదయోగ్యంకాని రీతిలోఅహంకారిగా తనను బయటపెట్టుకున్నారు. షాజియా ఇల్మీ, న్యాయవాది ప్రశాంత్‌భూషణ్, యోగేంద్ర యాదవ్ లు సహా వేలాది మంది ఇతరులు ఆయనను ఎందుకు వదలి పోయారు? అధికారంతో పాటూ సంక్రమించే అహంకారం వ్యక్తిని నాశనం చేస్తుంది. 2013లో ఆమ్ఆద్మీ పార్టీ తరఫున వేలాది మంది ప్రముఖులు ప్రచారం చేశారు. రాజకీయ కార్యకర్తలంతా జీతభత్యాలకు పనిచేసేవారుగా ఉన్న ఈ కాలంలో ఏ ప్రతిఫలం ఆశించకుండా తెలివి తేటలు, ఉత్సాహోత్తేజాలు గల వేలకొలది కార్యకర్తలు ఢిల్లీలో కేజ్రీవాల్‌కు లభించారు. కానీ ఆయన ఆత్మహత్యా సదృశమైన బాట పట్టి, జనాదరణ గలిగిన నేతలందరినీ అవమానించడం మొదలెట్టారు. చివరికి ఒంటరిగా మిగిలారు. అయినా ఆయనకింకా పేదలలో మంచి మద్దతుంది. కాకపోతే అయన శక్తియుక్తులు, నైపుణ్యం గలిగిన నేతలంతా బీజేపీకి చేరువయ్యారు. వారణాసి నుంచి మోదీకి వ్యతిరేకంగా పోటీ చేయడం, ఆయనపై విమర్శలు గుప్పిస్తుండటం వల్ల కేజ్రీవాల్‌కు ముస్లింల మద్దతు ఉంది. బీజేపీ మధ్య తరగతిని, దళితులను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి ఆయన ఆ వర్గాల మద్దతును కోల్పోవాల్సి వస్తుంది. ‘‘శత్రువు తప్పులు చేస్తున్నప్పుడు ఆటంకం కలిగించవద్దు’’ అని నెపోలియన్ చెప్పాడు. కేజ్రీవాల్ సరిగ్గా దానికి విరుద్ధంగా బీజేపీకి గొప్ప ముఖ్యమంత్రి అభ్యర్ధి లేడని దాడి సాగిస్తూ తప్పు చేశారు. విజయ్ గోయల్, విజేందర్ గుప్త, ముఖి తదితరులు జనాకర్షణ ఏమాత్రం లేని వారే. మిగతావారంతా పనికిరానివాళ్లు కాబట్టి ప్రజలు తననే ఎంచుకుంటారని కేజ్రీవాల్ భావించారు. కానీ అమిత్‌షా తమ తప్పును గ్రహించి షాజియా ఇల్మీ, కిరణ్బేడీలను రంగంలోకి దించారు. అదే పనిగా విమర్శిస్తుండటం అంటే ప్రత్యర్థి తప్పలు సరిదిద్దు కునేట్టు చేయడమేననే గుణపాఠం ఆయన నేర్చుకోవాల్సి ఉంది. ఒకప్పటి కేజ్రీవాల్ మద్దతుదార్లకూ ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్ష ఉంది. గత ఎన్నికల్లో ఆయనకు జీతభత్యాలు లేని కార్యకర్తలు ఉండేవారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ఉన్నది అత్యుత్సాహంతో ఉన్న శత్రువులే. బీజీపీ బలాలు, బలహీనతలు బీజేపీలో కేజ్రీవాల్‌కు సరితూగే నేతలెవరూ లేరని, ప్రజలు బలమైన, చైతన్యశీలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆ పార్టీ సర్వేల్లో వెల్లడైంది. అందుకే అది రిటైర్డ్ పోలీస్ అధికారి కిరణ్‌బేడీని పార్టీలో చేర్చుకుంది. ‘‘ఆశ్చర్యంలో ముంచెత్తడం గొప్ప సానుకూలతను కలుగజే స్తుంది’’ అని ప్రాచీన చైనా వ్యూహకర్త సున్ జు అన్నాడు. జనాదరణలో కేజ్రీవాల్‌కు సరితూగే కిరణ్‌బేడీని తెచ్చి బీజేపీ ఆప్ నేతనే కాదు, కాంగ్రెస్‌ను కూడా ఖంగు తినిపించింది. ఆకస్మికమైన ఈ ఆశ్చర్యకరమైన ఎత్తుగడతో బీజేపీ కొంత సానుకూలతను సాధించింది. ఇక బీజేపీకి నరేంద్రమోదీ ఎలాగూ ఉండనే ఉన్నారు. కేజ్రీవాల్‌ను అధికారంలోకి తేవడం వల్ల ఫలితం శూన్యమని, కేంద్రం మద్దతు లేనిదే ఆయనేమీ చేయలేడని ఢిల్లీలో చాలామంది భావిస్తున్నారు. పైగా దళిత, ముస్లిం ఓటర్లలో 2014 నాటికంటే ఇప్పడు బీజేపీ వ్యతిరేకత తక్కువగా ఉంది. కాంగ్రెస్ హయాంలో కంటే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది. చమురు ధరల తగ్గుదల పుణ్యమాని ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. ఈ సానుకూల పరిస్థితి బీజేపీకి ఉపయోగపడుతుంది. 2013లో కేజ్రీవాల్‌కు ఓటు వేసిన మధ్యతరగతి, యువత పెద్ద సంఖ్యలో బీజేపీ పక్షానికి చేరారు. నెల క్రితం వరకు బీజేపీ గెలుపుపై చాలా ధీమాగా ఉంది. కానీ మెజారిటీ దక్కకపోవచ్చునేమోనని ఇప్పడు ఆందోళన చెందుతోంది. ఢిల్లీలో అది ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే పర్యవసానాలు దేశవ్యాప్తంగా ఉంటాయి. కేరళ, తమిళనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో పార్టీని పెంపొందింపజేయాలన్న లక్ష్యానికి హాని కలుగుతుంది. ఈ ఏడాది నవంబర్‌లో బీహార్ శాసనసభ ఎన్నికల్లోనూ ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడమంటే కాంగ్రెస్, ప్రతి పక్షాలు నీరసపడిపోవడమే. దేశంలో అన్ని చోట్లా తమకు సరిపడేటంతమంది నేతలు లేరనే గుణపాఠాన్ని బీజేపీ ఢిల్లీ నుంచి నేర్చుకోవాల్సి ఉంది. పోటాపోటీగా సాగనున్న ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు ధీటైన నేత తమకు లేరు కాబట్టే కిరణ్ బేడీని ఆహ్వానించి పగ్గాలు అప్పగించాల్సి వచ్చింది. ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనూ బీజేపీ బలపడాలంటే ఇతర పార్టీల నేతలను ఆహ్వానించక తప్పదు. మోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు అసంతృప్తితో లేరు. అలా అని సంతోషంగానూ లేరు. ప్రధాని స్టాక్ మార్కెట్లను, కార్పొరేట్ రంగాన్ని సంతృప్తి పరిస్తే సరిపోదు. ప్రజలను కూడా తృప్తి పరచాలి. మోదీ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారితే బీజేపీ దేశవ్యాప్తంగా కుప్పకూలుతుంది. ఆ పార్టీ రేపు ఏ దిశగా సాగనున్నదో ఢిల్లీ ఫలితాలు సూచిస్తాయి. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) -
నీడలపై దాడి చేసిన నివేదిక
కాంగ్రెస్ భజనపరులనువదుల్చుకోలేకపోతోంది. 2004 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్‌ను చూస్తే 25 రాజ్యసభ స్థానాలు ఇక్కడ నుంచి భర్తీ అయినాయి. కానీ వీరిలో ఒక్కరు కూడా తెలంగాణ లేదా ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించలేకపోయారు. ఈ పరాన్నభుక్కులను వదుల్చుకుంటే పార్టీ మీద ఆశలు చిగురిస్తాయి. ఈ లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి కారణాలను అన్వేషించవలసిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏకే ఆంటోనీని కోరారు. ఆయన ఇచ్చిన నివేదిక పరమ గోప్యమైనది. అయినప్పటికీ, అడపాదడపా ఆంటోనీ ఇచ్చిన ప్రకటనలను బట్టి కొన్ని అంశాలు తెలిసిపోయాయి. పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, నాటి ప్రధాని మన్మోహన్సింగ్ లను ఆంటోనీ బాధ్యులను చేస్తారని అంతా ఊహించారు. చరిత్రలో మున్నెన్నడూ లేని రీతిలో పార్టీ ఓడిపోవడానికి ఆ ముగ్గురే కారణం అయినప్పటికీ, ఆంటోనీ దీనిని ఎలాంటి శషభిషలూ లేకుండా వెల్లడిస్తారని అనుకోవడం పిల్లచేష్టే అవుతుంది. లోపాలను అధ్యయనం చేసి, దిద్దుబాటుకు కూడా ఆయన సలహాలు ఇవ్వవలసి ఉంది. ఆయన ఎక్కడ వైఫల్యం ఉందో చెప్పారు గానీ, వాటికి బాధ్యులెవరో, వారి పేర్లను మాత్రం బాహాటంగా వెల్లడించలేదు. కానీ ఓటమికి ఆంటోనీ మూడు కారణాలను పేర్కొన్నారు. ఆ విధంగా ఆ ముగ్గురినీ ఒక విధంగా బాధ్యులను చేశారు. సోనియా, మన్మోహన్, రాహుల్ తప్పిదాలు మైనారిటీ వర్గాలవైపు మొగ్గుచూపి, కాంగ్రెస్ మెజారిటీ వర్గానికి (హిందువులు) వ్యతిరేకం అనిపించేటట్టు వ్యవహరించిందనీ, ఇది ఓటమికి కారణమనీ ఆంటోనీ బాహాటంగానే వ్యాఖ్యానించారు. ఇందుకు పార్టీ అధిష్టానం, సలహాదారులే కారణమని అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ పరిస్థితి గురించి పార్టీ పెద్దలకు పూర్తిగా అర్థమైనా ఎవరూ పెదవి విప్పలేదని కూడా ఆంటోనీ పేర్కొన్నారు. సోనియాకు వీర విధేయుడుగా కనిపించే, సదా వార్తలలో ఉండే దిగ్విజయ్ సింగ్ కూడా ఆంటోనీ అభిప్రాయంతో ఏకీభవించారు. నిజానికి ఇక్కడ ఆంటోనీ సోని యానే పరోక్షంగా తప్పుపట్టారు. మైనారిటీల వైపు మొగ్గు చూపినట్టు కనిపిం చడం వల్ల పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆంటోనీ అన్నారు. ఇలాంటి విధానం అమలు చేసినవారు పార్టీ జాతీయ సలహా మండలి సభ్యులే. ఈ మండలి సోనియా అధ్యక్షతనే పనిచేసింది. మైనారిటీలు, కొన్ని కులాల పట్ల పార్టీ మొగ్గు చూపుతున్నదన్న అభిప్రాయం ప్రజలలో నెలకొన్న ఫలితమే, ‘పోటీ సమీకరణ’మని కూడా ఆంటోనీ విశ్లేషించారు. ఈ విధానం వల్ల ఓటు బ్యాంకు ఏర్పడుతుందని సోనియా భావించారే తప్ప, మెజారిటీ వర్గంలో కాంగ్రెస్ వ్యతిరేక భావనలు బలపడగలవని ఊహించలేక పోయారు. మైనారిటీ ఓటు బ్యాంకుల ఆలోచన వికటించి, కాంగ్రెస్ మట్టికొట్టుకుపోయింది. దేశంలో మొదటిసారి మైనారిటీ ఓటు బ్యాంకుల ఆలోచనకు పోటాపోటీగా ఓటు బ్యాంకుల ఏర్పాటు కార్యరూపం దాల్చింది. మంచి పాలన ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆంటోనీ పేర్కొన్నప్పుడు ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య, అవినీతి వంటి అంశాలను ప్రస్తావించారు. ఓటమికి కారణం ‘ప్రభుత్వ వైఫల్యమే’నని ఆంటోనీ స్పష్టం చేశారు. ఈ వైఫల్యమే ప్రజలను ఆగ్రహానికి గురి చేసిందని కూడా ఆయన అంచనా వేశారు. తనతో సహా మొత్తం ప్రభుత్వం మంచి పాలన అందించడంలో విఫలమైందని ఆంటోనీ నిష్కర్షగా పేర్కొన్నారు. కానీ, మన్మోహన్ పేరెత్తకుండా ఆంటోనీ యూపీఏ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం విశేషం. ఎన్నికల ప్రచారంలో అనేక లోటుపాట్లు ఉన్నాయని ఆంటోనీ నిగ్గు తేల్చారు. అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ విశేషంగా చెమటోడ్చినా విజయం సాధ్యం కాలేదని అన్నారు. ఇది ఆ ఇద్దరి వైఫల్యాలను చూపడం తప్ప మరొకటి కాబోదు. మొత్తంగా చూస్తే, పార్టీ పరాజయానికి మూడు అంశాలను ఆంటోనీ చూపారని అర్థమవుతుంది. అవి- మైనారిటీల వైపు మొగ్గు, మంచి పాలన ఇవ్వలేకపోవడం, ఎన్నికలలో దీటుగా ప్రచారం చేయలేకపోవడం. ముగ్గురినీ తప్పుపట్టిన ఆంటోనీ ఆంటోనీ నివేదికలో ఎలాంటి నిజాయితీ లేదని కొట్టిపారేయడం అన్యాయం. ఆంటోనీ ఒట్టి విధేయుడు కాదు. ఈ పదేళ్ల కాలంలో మన్మోహన్ సహా కాంగ్రెస్ నాయకులంతా రాహుల్ ప్రధాని పదవికి అర్హుడంటూ అనేక విధాలుగా పొగడ్తలలో ముంచెత్తారు. కాంగ్రెస్ శిబిరంలో ఒక్క ఆంటోనీయే అలాంటి భజన కార్యక్రమాన్ని చేపట్టలేదు. పార్టీ వైఫల్యానికి ఆయన మూడు అంశాలను గమనించి, అందుకు పరోక్షంగానే అయినా కారకులెవరో చూపగలిగారు. ఆ ముగ్గురు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదని చెప్పగలిగారు. ఇతరులు కొన్ని వందల పేజీలలో తప్ప చెప్పలేని విషయాన్ని, ఆంటోనీ కాబట్టి కొన్ని పదాలతో చెప్పగలిగారు. రాహుల్‌నే తీసుకుందాం. సోనియా అనుసరించిన మైనారిటీ అనుకూల విధాన రూపకర్త ఆయన కాదు. అలాగే ప్రభుత్వాన్ని మన్మోహన్ నడిపారు గానీ, రాహుల్ కాదు. నాయకుడిగా రాహుల్‌కు ఉండే బలహీనతలు ఆయనకీ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ వైఫల్యానికి గానీ, యూపీఏ ప్రభుత్వ తప్పిదాలకు గానీ ఆయన బాధ్యుడు కానేరడు. అయినా, ఈ తప్పిదంలో ఆయన భాగస్వామే. ఎందుకంటే, సోనియా, మన్మోహన్ చేస్తున్న తప్పిదాలను ఆయన నిరోధించలేకపోయారు. అయితే భారతదేశంలో రాజకీయ పక్షాలు అంత సులభంగా కనుమరుగు కావు. కానీ కాంగ్రెస్ పార్టీ మనుగడకు సంబంధించిన గట్టి ప్రశ్నను ఎదుర్కొంటున్న మాట నిజమే. నరేంద్ర మోడీ చాలా భిన్నమైన నాయకుడనీ, మిగిలిన బీజేపీ నేతలకంటె ప్రత్యేకత ఉన్నవారనీ గమనించినప్పటి నుంచి ఆయనంటే గాంధీలు ఇద్దరూ గడగడలాడిపోతున్నారు. మోడీని ఢిల్లీ పీఠం దాకా నిరోధించాలని సోనియా గడచిన నాలుగేళ్లు శత విధాలా ప్రయత్నించారు. కాంగ్రెస్ పరివారం మొత్తం మోడీ మీదే తమ దృష్టిని సారించి దాడి చేసింది. అదంతా మోడీ ప్రతిష్టను పెంచిందే తప్ప, నిరోధించలేకపోయింది. అయితే మోడీ ఒకటి గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్‌పార్టీకి 44 స్థానాలు లభించాయి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మేజిక్ నంబర్ 272 సీట్లు అవసరం లేదు. చిన్న ఆశ, అనేక సమస్యలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కొన్ని అవకాశాలు ఉన్నాయి. బీజేపీని మాత్రమే ఎదుర్కొనవలసిన రాష్ట్రాలు ఇంకా కొన్ని మిగిలాయి. బీజేపీ లోక్‌సభ ఎన్నికలలో ఘనవిజయం సాధించినప్పటికీ చాలా రాష్ట్రాలలో ఆ పార్టీకి బలం లేదు. ఇవి లాభించేవే అయినా, కాంగ్రెస్‌కు ప్రతికూలాంశాలే ఎక్కువ. వంశపారంపర్య పాలనతో ప్రజలు రోతెత్తి ఉన్నారు. గడచిన పదేళ్లుగా పార్టీ ప్రదర్శించిన అహంభావ పూరిత వైఖరితో మధ్యతరగతి దూరమైంది. దీనికి తోడు ఆ పార్టీ దర్బారు సంస్కృతిని పెంచి పోషిస్తున్నది. గాంధీల కుటుంబాన్ని అంటకాగడమన్న ఒక్క లక్షణం తప్ప ప్రజలలో ఎలాంటి మద్దతు లేని నాయకులే రాజ్యసభ స్థానాలూ, ఇతర పదవులూ తన్నుకుపోతున్నారు. ఇంకా, పార్టీ నేతలు 1970 నాటి ఇందిర వ్యూహాలనే నమ్ముకుంటూ, ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితమవుతూ, అవినీతి ఆరోపణలనీ, మధ్యతరగతినీ పట్టించుకోవడం లేదు. మోడీ మధ్య తరగతినీ, మధ్యతరగతిగా ఎదగాలన్న ఆకాంక్ష ఉన్న వర్గాలను ఆకర్షించారు. కానీ కాంగ్రెస్ భజనపరులను వదుల్చుకోలేకపోతోంది. 2004 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్‌ను చూస్తే 25 రాజ్యసభ స్థానాలు ఇక్కడ నుంచి భర్తీ అయినాయి. కానీ వీరిలో ఒక్కరు కూడా తెలంగాణ లేదా ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించలేకపోయారు. ఈ పరాన్నభుక్కులను వదుల్చుకుంటే పార్టీ మీద ఆశలు చిగురిస్తాయి. ప్రజలలో ఏమాత్రం పలుకుబడి లేని జైరాం రమేశ్, మధుసూదన్ మిస్త్రీ, దిగ్విజయ్ సింగ్, సీపీ జోషీ వంటి నేతలనే సోనియా విశ్వసిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆశ ఒక్కటే. నరేంద్ర మోడీ తప్పిదాలు చేస్తారు. దాని నుంచి లబ్ధి పొందవచ్చు. మోడీ కూడా ఎవరి మాటనూ లెక్క చేయకుండా తానొక సూపర్‌మ్యాన్ అని భావించుకుంటున్నారు. కానీ మోడీని నిరంతరం విమర్శిస్తూ ఆయన తప్పు చేయకుండా ఉండేలా మళ్లీ కాంగ్రెస్ పార్టీయే వ్యవహరిస్తోంది. చూద్దాం! ఎవరు నెగ్గుతారో? (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) - పెంటపాటి పుల్లారావు -
మసకబారుతున్న తెలుగు ‘చంద్రులు’
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగుజాతి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కీచులాటలు మానుకోవాలి. స్వల్ప విషయాలపై ఘర్షణ పంథాకు స్వస్తి చెప్పాలి. విశాల హృదయంతో వ్యవహరించేవారి స్థాయి పెరుగుతుంది. జాతీయ మీడియా, రాజకీయ పార్టీలు ఇదంతా వినోదంగా చూస్తున్నాయి. కేంద్రంలో నెల రోజుల పాలన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ట పెరిగింద న్న అభిప్రాయం ప్రధానంగా వ్యక్తమవుతోంది. అందరి అంచనాలను మించి ఆయన పనిచేస్తున్నారు. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల గురించి కూడా ఒకసారి మదింపు వేయాల్సిన అవసరం ఉంది. మోడీ సర్కారుకు నెల రోజులపాటు ‘రాజకీయ హనీ మూన్’ వ్యవధి లభిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఒక్కరోజు కూడా ఊపిరి తీసుకోడానికి తీరికలేకుండా పోయింది. బీజేపీని గతంలో ఎన్నడూ సమర్థించని చిన్న రాష్ట్రాలు కూడా మోడీ ప్రధాని అయ్యాక ఆయనకు ఎంతో ప్రాధాన్యమివ్వడం ప్రారంభించాయి. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల వైఖరుల కారణంగా తెలుగువారి ప్రతిష్ట మసకబారుతోంది. ఇది సాటి తెలుగువారికి ఎంతో ఆందోళన కలిగించే విషయం. ఆంగ్లేయులు ‘విభజించు-పాలించు’ సూత్రంతో భారత్‌ను పాలించగా, కే చంద్రశేఖరరావు, చంద్రబాబునాయుడు కీచులాడుకుంటూ కేంద్రం తలదూర్చేలా హాస్యాస్పదంగా వ్యవహారం చేస్తున్నారు. ఈ ఇద్దరు సీఎంలూ తాత్కాలిక పాలకులు. వీరు తమ విధానాలను చక్కదిద్దుకోకపోతే తెలుగువారి ప్రతిష్ట పూర్తిగా మంటగలిసిపోతుంది. ఇద్దరూ ఇద్దరే కేసీఆర్, చంద్రబాబు రాజకీయాలలో, పాలనాయంత్రాంగంలో రాటుదేలినవారే. ఏళ్ల తరబడి రాజకీయాలలో కొనసాగుతున్న ఈ రాజకీయ ద్వయానికి ఎత్తులు పైఎత్తులు బాగానే తెలుసు. తాము రచించుకునే వ్యూహాలను విజయవంతంగా అమలు చేయగలిగేవారే. వీరిలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ రకరకాల కారణాల వల్ల హస్తినలో మాత్రం వీరికి అంత సానుకూలత లేదనే చెప్పాలి. తెలంగాణలో పూర్తి మెజారిటీ సాధించినందున ప్రభుత్వాన్ని నడిపేం దుకు కేసీఆర్‌కు ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సమర్థిస్తానని ఎన్నికల ఫలితాలకు ముందు కేసీఆర్ ఒక సందర్భంలో అన్నారు. అంటే భవిష్యత్తులో కాంగ్రెస్‌తో తమకు రాజకీయ అవసరం పడుతుందన్న ఉద్దేశం అప్పట్లో ఆయన మనసులో ఉంది. అంతేకాదు, తమ సర్కారు ఏర్పాటుకు కాంగ్రెస్ తోడ్పాటు అవసరమొస్తుందని భావించి మోడీకి దూరమయ్యారు. టీఆర్ఎస్కు పార్లమెంట్లో 11 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వారికి కేసీఆర్‌తో తూగగల రాజకీయ స్థాయి, వ్యూహ నిపుణత వంటి లక్షణాలు లేవు. టీఆర్ఎస్ ఎంపీలపై బీజేపీకి కూడా పెద్దగా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు కేసీఆర్ అనుసరించిన ఎత్తుగడలు సరిగా లేవని చెప్పాలి. ఆయనవి అన్నీ ప్రతికూల డిమాండ్లే! ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినవన్నీ కచ్చితంగా తెలంగాణకూ ఇవ్వాలన్నట్టుగా డిమాండ్ చేస్తున్నారు. ఆయన ప్రతికూల వైఖరి అవలంబిస్తున్నారు. ఈ పద్ధతి జాతీయస్థాయిలో నడవదు. ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన సాయం అందించాల్సిందిగా కేసీఆర్ అడుగుతూనే... అదే సమయంలో తమ రాష్ట్రమైన తెలంగాణకు కావల్సిన డిమాండ్లు చేస్తే బాగుండేది. ప్రతి విషయంలో అడుగడుగునా ఆంధ్రప్రదేశ్‌కు అడ్డుతగులుతూ, ఆయన తన ప్రతిష్టను దిగజార్చుకున్నారు. అంతేగాదు, సమస్యలే కాని చిన్నాచితకా విషయాలను పెద్ద సమస్యలుగా సృష్టించి కేసీఆర్ తన ఇమేజ్ను మసకబార్చుకున్నారు. సచివాలయం, ఇతర కార్యాలయాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించడం పిల్లచేష్టలుగా కనిపిస్తాయి. సెటిలర్స్‌ను బెదిరించడం వల్ల తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. మీడియాతో ఘర్షణ పంథా వల్ల జాతీయ మీడియాలో టీఆర్ఎస్ సర్కారుకు ఇప్పటికే చెడ్డ పేరు వచ్చింది. మజ్లిస్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకట్టుకునేందుకు కేసీఆర్ చేసే ప్రయత్నాలు బట్టి ఒక విషయాన్ని ఊహించవచ్చు. అతి త్వరలో రాజకీయ తిరుగుబాటు జరగవచ్చన్న భయం ఆయన్ని పట్టి పీడిస్తూ ఉండవచ్చు. టీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి జనరంజకంగా పాలిస్తే ఆయన దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. కాని టీఆర్ఎస్లో కొన్ని సామాజిక వర్గాలు ఉన్నందున ఆయనలో కొంత భయం గూడుకట్టుకుని ఉంది. నిరంతరం సమస్యలను సృష్టించడం, ఆందోళనలు నడపడం ద్వారా ప్రభుత్వంలో భిన్నవైఖరులకు తావులేకుండా చూసుకోవాలన్నది ఆయన వ్యూహం. కేంద్రంలో బీజేపీ సర్కారు మాదిరిగా టీఆర్ఎస్లో కూడా రాజకీయ హేమాహేమీలు, చెప్పుకోదగిన ప్రముఖులెవరూ లేరు. 1978లో రాజకీయాలలో ప్రవేశించిన చంద్రబాబునాయుడు కేంద్రంలో దేవెగౌడ, ఐకే గుజ్రాల్ సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత వాజ్‌పేయి సర్కారుకు కూడా మద్దతునిచ్చారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో గడిపిన తర్వాత ఇటీవలే అధికారంలోకి వచ్చారు. గత 45 రోజుల్లో తెలుగువారు రెండు భిన్నరకాల చంద్రబాబులను చూశారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి అవసరమైన అనుభవం తనవద్ద ఉందని పదేపదే చెప్పారు. అయితే ఆ అనుభవం సరిపోతుందా అన్నది చర్చనీయాంశమే. గానుగెద్దుకు కూడా తన జీవితంలో ఎన్నో చుట్లు తిరిగిన విస్తృతానుభవం ఉంటుంది. అంతమాత్రాన అది సరిపోదు కదా! చంద్రబాబులో కొత్తగా ఎలాంటి ఐడియాలు లేవు. 30 ఏళ్ల క్రితం ఆయన చుట్టూ తిరిగిన వారే ఇప్పుడూ ఉన్నారు. వీరు కొత్తగా ఎలాంటి మార్పులు తీసుకురాలేరు. అవసరానికి మించిన అనుభవం ఆంధ్రప్రదేశ్ కొంపముంచేలా ఉంది. ఢిల్లీ చుట్టూ చంద్రబాబు చక్కర్లు అనుభవం తక్కువగా ఉన్న కేసీఆర్‌కు భిన్నంగా చంద్రబాబు మాటిమాటికీ ఢిల్లీకి చక్కర్లు కొడుతూ నిధుల కోసం దేబిరించడం చూడడానికే ఇబ్బందికరంగా ఉంది. రాజకీయంగా సీనియర్ నేత అయిన చంద్రబాబు కొంచెం హుందాగా వ్యవహరించి తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టాలి. కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతిల ముందు ఆయన మోకరిల్లాల్సిన అవసరమేముంది? ముఖ్యమంత్రులు జయలలిత, నవీన్ పట్నాయక్‌లు కేంద్రానికి దూరంగా ఉంటున్నప్పటికీ వారు అడిగిన పనులను మోడీ సర్కారు గౌరవంగా చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎదుగుతుందని ఆ పార్టీ గట్టి విశ్వాసంతో ఉంది. సామరస్యంగా సమస్యల పరిష్కారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగుజాతి విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కీచులాటలకు స్వస్తి చెప్పాలి. విద్యార్థుల స్కాలర్షిప్లు, మరుగుదొడ్లు, క్యాంటీన్లు వంటి విషయాల్లో ఘర్షణ పంథాకు స్వస్తి చెప్పాలి. విశాల హృదయంతో వ్యవహరించేవారి స్థాయి పెరుగుతుంది. జాతీయ మీడియా, రాజకీయ పార్టీలు ఇదంతా వినోదంగా చూస్తున్నాయి. స్వల్ప విషయాలపై ఘర్షణపడడం మానుకోవాలి. సమస్యలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించుకోవాలి. ముఖ్యంగా విద్యుత్, నదీ జలాలు, ఇతర సమస్యలను నేరుగా మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. ఉమాభారతి, పీయూష్ గోయల్ వంటి జూనియర్ మంత్రులకు వీటిని పరిష్కరించే సత్తా ఏమీ లేదు. రెండు రాష్ట్రాల సీఎంలు తమ ఢిల్లీ పర్యటనలకు తగిన సందర్భాలలో ప్రతిపక్ష నాయకుల్ని కూడా వెంటబెట్టుకుని తీసుకువెళ్లాలి. దీనివల్ల కేంద్రానికి సానుకూల సంకేతాలు పంపినట్టవుతుంది. లోక్‌సభలో ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎందుకు గట్టిగా పట్టుబడుతున్నారో తెలుసా? రాజకీయాలలో ‘ఇమేజ్’కు ఆమె ఇస్తున్న విలువే దీనికి కారణమని చెప్పాలి. రాజకీయాలలో ఇమేజ్ను కోల్పోతే అంతా కోల్పోయినట్టే. కేసీఆర్, చంద్రబాబునాయుడు కూడా రాజకీయాలలో ప్రతిష్ట విలువ గురించి ఇకనైనా తెలుసుకోవాలి. ప్రతిష్ట మంటగలిసాక, రాజకీయాల్లో నవ్వులపాలయ్యాక ఎవరూ లెక్కచెయ్యరు మరి! (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) పెంటపాటి పుల్లారావు -
సరైన దారిలో మోడీ అడుగులు
తమిళనాడు రాజకీయ నేతల ఒత్తిళ్లకు వెరవకుండా శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించడం ద్వారా మోడీ తానేమిటో రుజువు చేసుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఇలాంటి తెగువను ప్రదర్శించలేకపోయారు. విదేశీ వ్యవహారాల విషయానికి వచ్చేసరికి కేంద్రం, స్థానిక రాజకీయాలకూ, ఒత్తిళ్లకూ లొంగదనీ ప్రధాని స్పష్టంగా చెప్పకనే చెప్పారు. నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధాని అవుతారని ఏడాది క్రితం ఎవరూ ఊహించలేదు. బీజేపీకి ఇంత సులభంగా మెజారిటీ వస్తుందని కూడా ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. త్రిశంకు సభ ఏర్పడుతుందనీ, ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ పండితులు వేసిన లెక్కలు తప్పాయి. ఎన్నో రాజకీయ ప్రణాళికలు రచించుకున్న నవీన్ పట్నాయక్, జయలలితలు హెచ్చులకుపోకుండా వినయంగా, మర్యాదపూర్వకంగా మోడీని కలిశారు. తనను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోడీ పోల్చుకున్నారు. కాని అత్యంత విఫలుడైన అధ్యక్షుడిగా ఆయన అమెరికా చరిత్రలో నిలిచిపోతారన్న విషయాన్ని మోడీ అర్థం చేసుకుంటే మంచిది. ఒబామా చేసే అద్భుత ప్రసంగాలతో ప్రజలు విసిగిపోయారు. వారికి ఫలితాలు కావాలి. ఆ విషయం మోడీ గ్రహించాలి. తమ కేబినెట్ సహచరులు తొలి 100 రోజుల్లో చేయాల్సిన పనుల గురించి ప్రధాని అప్పుడే మార్గనిర్దేశనం చేశారు. ‘ఏదైనా పని సవ్యంగా ప్రారంభిస్తే సగం పూర్తయినట్టే’నని గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పారు. దీని నుంచి స్ఫూర్తి తెచ్చుకున్నారు కాబోలు ప్రధాని తన ప్రభుత్వం ముందు ఉన్న 10 ప్రధాన లక్ష్యాలను ప్రకటించారు. మోడీ శుభారంభం చేయడంతో ఎంతో ఆశ్చర్యపోయిన కాంగ్రెస్ నేతల నోటమాట రాలేదు. ఆరంభంలోనే ప్రత్యేక ముద్ర తన ప్రమాణ స్వీకారోత్సవానికి మోడీ సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడం ఆయన విమర్శకులను సైతం దిగ్భ్రాంతి కలిగించింది. పొరుగు దేశాల పట్ల మోడీ దౌత్యం పాటించబోరని, దుందుడుకు విదేశాంగ విధానం అనుసరిస్తారని వారు భావించారు. మోడీ తీసుకున్న చొరవను జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ప్రశంసించారు. మోడీ చిన్న కేబినెట్ ఏర్పాటు చేయడం కూడా ప్రజలను ఆశ్చర్యపరిచింది. గతంలో ఐదు ప్రభుత్వాలు శాఖలను విడగొట్టి పదవుల పందేరం చేసి జెంబో కేబినెట్ ఏర్పాటు చేశాయి. సంకీర్ణ సర్కారులలో మిత్రపక్షాలు కీలకమైన శాఖలను దక్కించుకోగా ఏ రాజా, టీఆర్ బాలు లాంటి మంత్రులు బాహాటంగా అవినీతికి పాల్పడినా ప్రధాని ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవల్సి వచ్చింది. శివసేనలాంటి మిత్రపక్షాల ఒత్తిళ్లకు సైతం లొంగకుండా మోడీ చిన్న కేబినెట్‌తో సరిపుచ్చారు. తమిళనాడు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు వెరవకుండా శ్రీలం క అధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించడం ద్వారా మోడీ తానేమిటో రుజువు చేసుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఇలాంటి తెగువను ప్రదర్శించలేకపోయారు. విదేశీ వ్యవహారాల విషయానికి వచ్చేసరికి కేంద్రం స్థానిక రాజకీయాలకూ, ఒత్తిళ్లకూ లొంగదనీ ప్రధాని స్పష్టంగా చెప్పకనే చెప్పారు. బంధుప్రీతికి దూరం గతంలో వాజ్‌పేయ్ కేబినెట్లో పనిచేసి విఫల రాజకీయ నేతలుగా ముద్రపడిన సీనియర్లను మోడీ పక్కన పెట్టారు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. గతంలో ఆరేళ్లు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా వీరి పనితీరు గొప్పగా ఏమీ లేదు కాబట్టి ఈసారి తీసుకోనవసరం లేదని మోడీ భావించారు. ఇక సుష్మా స్వరాజ్ విషయానికి వస్తే ఆమెను కొంతకాలం నిరీక్షింప చేసిన తర్వాత చివరి క్షణంలో కేబినెట్లో తీసుకునేందుకు మోడీ అంగీకరించారు. ప్రధాని కొన్ని మంత్రిత్వ శాఖలను మరికొన్నింటిలో కలిపేశారు. దీనివల్ల ఏ మేరకు మేలు జరుగుతుందో చూడాలి. ఆయన విద్యాధికులైన బీజేపీ ఎంపీలకు మంచి అవకాశం ఇచ్చారు. వాణిజ్య, విద్యుత్, పెట్రోలియం, పర్యావరణం వంటి అంశాలకు స్వతంత్ర శాఖలను ఏర్పాటు చేసి వాటిని కొత్తవారికి ఇచ్చారు. పార్టీ మంచి పనితీరు కనబరచని రాష్ట్రాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం ఇవ్వడానికి నిరాకరించారు. ఈ కోణంలో తెలంగాణ, కేరళ నుంచి ఎవరికీ మంత్రి పదవి రాలేదు. అవినీతిలో నిండామునిగిన యడ్యూరప్పను కూడా తీసుకోలేదు. అంతేకాదు సోనియా-రాహుల్ కుటుంబ పాలన గురించి తీవ్రంగా విమర్శలు చేసిన మోడీ తన కేబినెట్లో నేతల బంధుప్రీతికి తావివ్వలేదు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తన కుమారుడు దుష్యంత్ సింగ్‌నూ, మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్ సింగ్‌ను ఓడించిన సోనారామ్ చౌదరినీ మంత్రులుగా చేయాల్సిందిగా కోరగా... ప్రధాని నిర్మొహమాటంగా తిరస్కరించారు. అలాగే ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ తన కుమారుడు అభిషేక్ సింగ్‌కు మంత్రి పదవి ఇప్పించుకోలేకపోయారు. అధికార యంత్రాంగానికి స్వేచ్ఛ అధికార యంత్రాంగానికి ప్రధాని మార్గనిర్దేశనం చేశారు. నిర్ణయాలు తీసుకునేందుకు వారికి తగిన స్వేచ్ఛనిచ్చారు. సాచివేత ధోరణిని సహించబోనని, నిర్దిష్ట సమయానికి ఫలితాలను రాబట్టాలని స్పష్టంగా చెప్పారు. మన్మోహన్ సింగ్ హయాంలో అక్రమార్కులు ఆడింది ఆటగా సాగేది. నిజాయితీ, సమర్థులైన వారు భయంతో నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకంజ వేసేవారు. అధికార యంత్రాంగానికి స్వేచ్ఛనివ్వడం ద్వారా మోడీ సరైన సంకేతాలు పంపినట్టయ్యింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా సూచించిన విధానాలతో ద్రవ్యలోటు తీవ్రతరం కావడం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం కళ్లారా చూసిన మోడీ అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కసరత్తు ప్రారంభించారు. పర్యావరణ శాఖ అనుమతులు పెండింగ్‌లో పెట్టిన కారణంగా దాదాపు రూ. రెండు లక్షల కోట్ల దాకా విలువైన ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఫైళ్లు అనుమతి ఇవ్వడానికి అప్పటి పర్యావరణ మంత్రి జయంతి నటరాజన్ భారీగా ముడుపులు వసూలు చేస్తున్నారంటూ గత ఏడాది డిసెంబర్లో మోడీ విమర్శించడమే కాకుండా, ఆయన దానికి ‘జయంతి ట్యాక్సు’గా పేరు కూడా పెట్టారు. దీన్ని అవమానంగా భావించి ఆ మరునాడే జయంతి నటరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. దీనితో తాను ప్రధాని అయిన తర్వాత పర్యావరణ శాఖ అనుమతులపై ఆయన ప్రత్యేక దృష్టిని పెట్టారు. సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోడీ ఆదేశాలు జారీ చేస్తున్నారు. సమాలోచనలు, సమీక్షలు జరుపుతున్నారు. అన్నింటికన్నా పాలనలో, కార్యాచరణలో వేగం ముఖ్యం. లక్ష్యాలు సాధించిన వారిని ప్రోత్సహించడం ఎంత ప్రధానమో, చేవలేని వారిని శిక్షించడం కూడా అంతే ప్రధానం. ఇది మంత్రులకూ సమానంగా వర్తిస్తుంది. మంత్రుల పనితీరును మదింపు వేయడంలో ప్రధాని సమదృష్టితో ఉండాలి. ఒకవేళ అసమర్థుల్ని తొలగించాల్సి వస్తే వెనుకాడకూడదు. భవిష్యత్‌లో మరిన్ని సవాళ్లు భవిష్యత్తులో కేబినెట్‌ను విస్తరిస్తే మోడీ చుట్టూ భజనబృందం చేరుతుంది. ఇతర నాయకుల్లాగే ఆయన్నీ వారు కీర్తించడం మొదలెడతారు. దీంతో మోడీ పతనం ప్రారంభమవుతుంది. పాలన వ్యవహారాలలో తన ముద్ర కోసం తపించే ఆర్ఎస్ఎస్ తెరవెనుక ఉంటూ వివాదాలు సృష్టిస్తూనే ఉంటుంది. మోడీకి భవిష్యత్తులో అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన అనుసరించిన విధానాలు మిత్రులనే కాదు, ప్రత్యర్థుల్ని సైతం ఆశ్చర్యచకితుల్ని చేశాయి. అయితే ఒబామా అనుసరించదగిన ఆదర్శ నాయకుడేమీ కాదు. పనితీరు బాగా లేకపోతే గొప్ప ఉపన్యాసాలు సైతం చికాకు కలిగిస్తాయి. మాటలకు తగిన పటుతరమైన చేతలు తోడైతేనే విజయం వరిస్తుంది. దీంట్లో ఏది శ్రుతి మించినా వికటిస్తుంది. ప్రధానిగా మోడీ తన సత్తా నిరూపించుకునేందుకు ఎంతో కాలం ఉంది. కాని ఏ పనైనా బాగా మొదలుపెడితే సగం పూర్తయినట్టే కదా. (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) పెంటపాటి పుల్లారావు -
ఓటమికి బలిపశువు సిద్ధం
విశ్లేషణ 2009 వరకు యూపీఏ ప్రభుత్వం పనితీరు బావుందని అంతా అంగీకరిస్తారు. మన్మోహన్ సంక్షేమ వ్యయాలను నియంత్రించారు. డీఎంకేలాంటి ప్రాంతీయ పార్టీల ఆదేశాలకు విదేశాంగ విధానం లోబడకుండా ఉండేట్టు చూశారు. అ తర్వాతే కాంగ్రెస్‌కు కళ్లు నెత్తికెక్కాయి. ఆర్థిక వ్యవస్థ నెత్తురోడడం మొదలైంది. పది మంది సభ్యులు అనుభవం లేకున్నా మన్మోహన్ మంత్రివర్గ నిర్ణయా లను తోసి రాజన్నారు. అసాధ్యమైన డిమాండ్లను ముందుంచి, చట్టాలను చేయించారు, నిధులను మంజూరు చేయించారు. చాలా మంది మంత్రులు ఎన్ఏసీ సభ్యులను చాటుమాటుగా దుమ్మెత్తిపోశారు. కానీ సోనియా ముందు నోరు విప్పే ధైర్యం చేయలేదు. ఎన్ఏసీ సూచనలపై ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇది ద్రవ్యోల్బణాన్ని సృష్టించింది. సోనియా తప్పులకు మన్మోహన్ బాధ్యులు! ఎన్ఏసీ ఒక వర్గానికి అనుకూలంగా ఉన్న మతకల్లోలాల వ్యతిరేక చట్టాన్ని తెచ్చింది. దానికి వివిధ సెక్షన్ల నుంచి విశాలమైన వ్యతిరేకత వచ్చింది. అలాంటి చట్టం అవసరమైతే ఆ పనిని న్యాయ నిపుణుల, సీనియర్ నేతల సలహాలతో చేయాల్సింది. అందుకు బదులుగా ఎన్ఏసీలోని ఔత్సాహిక ఎన్జీవోలు దాన్ని రూపొందించాయి. ఈఒక్క చర్యే మెజారిటీలో ఆందోళనను రేకెత్తించాయి. ఓటు బ్యాంకు రాజకీయాలుగా దాన్ని వారు పరిగణించారు. ఈ మతపరమైన కేంద్రీకరణకు మన్మోహన్‌ను ఏవిధంగానూ తప్పు పట్టడానికి వీల్లేదు. మన ఆర్థిక సమస్యలన్నింటికీ బహిర్గత అంశాలే కారణమని కాంగ్రెస్ పార్టీ అదే పనిగా చెప్పింది. కానీ మన బడ్జెట్ వైకల్యపూరితంగా తయారైంది. 30 శాతం వార్షిక కోశ (ఆర్థిక) లోటుకు, ద్రవ్యోల్బణానికి దారి తీసింది. విపరీత ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అనే రెండు అంశాలపైనే ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సోనియా బలవంతం మీదనే మన్మోహన్ సంక్షేమ వ్యయాలకు భారీ నిధులను కుమ్మరించి భారీ బడ్జెట్ లోట్లను అనుమతిం చారు. ఆ సంక్షేమ పథకాలే నిరర్ధకంగానూ, విషతుల్యంగానూ పరిణమించి అధిక ధరలకు, నిరుద్యోగానికి కారణమయ్యాయి. గత మూడేళ్లుగా అన్నాహజారే, కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక పోరాటా లను పెద్ద ఎత్తున నిర్వహించారు. వాటితో ఎలా వ్యవహరించాలో తెలియని సోనియా వారిని తిట్టిపోసి, వేధించమని మంత్రులను ఉసిగొల్పారు. వాళ్లింకా బలవంతులయ్యారు. చివరికి అవినీతిగ్రస్త ముద్రాంకితగా యూపీఏ ప్రభుత్వం నిలిచింది. విషాదమేమంటే చివరికి ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా అవినీతి ఒక సమస్యగా ముందుకు వచ్చింది. అందుకు కూడా మన్మోహన్‌ను ఎలా తప్పు పడతారు? 2008లో యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడినప్పటి నుంచి ములాయంసింగ్‌తో మన్మోహన్‌కు మంచి సంబంధాలుండేవి. సోనియా.. ములాయం, అమర్‌సింగ్‌లను ఎప్పుడూ అవమానిస్తూ వచ్చారు. అత్యంత శక్తివంతురాలు, పెళుసు స్వభావి మమతా బెనర్జీతో సర్దుబాటు చేసుకుపోవడానికి మన్మోహన్ సిద్ధంగా ఉండేవారు. సోనియా చేజేతులారా ఇద్దరు రాజకీయమిత్రులను దూరంగా తరిమిపా రేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన రాష్ట్రంలో కాంగ్రెస్ పునాదులను తుడిచి పెట్టేసింది. దాదాపు రెండేళ్లపాటూ అది కేంద్ర ప్రభుత్వాన్ని చికాకుపెట్టింది. వివాదాస్పదమైన ఏపీ రాష్ట్ర విభజన నిర్ణయం పూర్తిగా సోనియాదే. విభజనతో తెలంగాణలో కాంగ్రెస్‌కు కనీసం 16 మంది ఎంపీలు లభిస్తారని ఆమె అంచనా వేశారు. రాష్ట్ర విభజన ఎత్తుగడ పారి వుంటే ఆ ఘనత ఆమెకు దక్కేదే. కానీ అది విఫలం కావడంతో ఆమె మౌనంగా ఉన్నారు. మంచి పాలనను అందించడానికి బదులుగా ఆమె అడ్డదారిని ఆశ్రయించారు. అందుకు తప్పు పట్టాల్సింది ఆమెను మాత్రమే. అవాస్తవిక అంచనాలతోనే తిప్పలు భారత ప్రజల సంగతి తనకు బాగా తెలుసని సోనియా నమ్మారు. నిత్యమూ నరేంద్రమోడీని తిట్టిపోస్తే చాలు ఆయన అంతు చూసేయొచ్చని ఆమె అనుకున్నారు. విరుద్ధ ఫలితం కలిగింది. ఆమె ఎంతగా తిట్టిపోస్తే మోడీ అంత బలవంతునిగా ముందుకొచ్చారు. దేశంలో చాలా మంది మోడీలా ఆలోచిస్తున్నారని, సోనియా మాటలు వినడానికి వారు సిద్ధంగా లేరని ఆమె గ్రహించలేదు. సోనియా ఆయనపై సీబీఐని ప్రయోగించాలని చూశారు. అది ఆమెకే బెడిసికొట్టింది. సోనియాయే స్వయంగా తనను ఓడించనున్న శత్రువును సృష్టించారు. భజనపరులు సోనియా అత్త ఇందిరాగాంధీ, భర్త రాజీవ్‌గాంధీలకు చెరుపు చేశారని ఆమెకు తెలుసు. కానీ కుమారుడ్ని ప్రధానిని చేయాలన్న కలలకు ఆమె బానిసయ్యారు. సోనియా, రాహుల్ తమ తప్పిదాలకు ఇతరులను తప్పు పడుతున్నారు. రేపటి ఓటమికి బలిపశువుగా మన్మోహన్‌ను సిద్ధం చేశారు. పెంటపాటి పుల్లారావు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు