అవిశ్వాస తీర్మానం వల్ల ఆశించిన ఫలాలు దక్కకపోగా, కాంగ్రెస్‌తోపాటు తెలుగుదేశం, ఆ పార్టీ నేత చంద్రబాబు కూడా వ్యతిరేక ఫలితాలనే చవిచూడాల్సివస్తోంది. హోదాపై హఠాత్తుగా మాట ఎందుకు మార్చారన్న మోదీ ప్రశ్నకు జవాబు లేకుండాపోయింది. ఈ తీర్మానం ఫలితంగా, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో బాబుకు ఎలాంటి ప్రయోజనం చేకూరే అవకాశాలు లేవు. అవిశ్వాస తీర్మానాన్ని తమ సభ్యులతో చంద్రబాబు ప్రవేశపెట్టించారేగాని, దాని వ్యతిరేక పర్యవసానాల గురించి ఆయన ఆలోచించనే లేదు. వాస్తవానికి ఇబ్బందుల్లో ఈదులాడుతున్న మోదీ ప్రభుత్వానికి అనుకోకుండా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ హాయిగా ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చాయి.
నరేంద్రమోదీ సర్కారుపై తెలుగుదేశం ఎలాంటి వ్యూహం లేకుండా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అది వీగిపోతే పర్యవసానాలేంటో కూడా అలోచించ లేదు. కేవలం ప్రచారం కోసం, ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లను ఆకట్టుకోవడానికే పది రోజుల క్రితం ప్రవేశపెట్టిన ఈ తీర్మానం వీగిపోవడం ఆశ్చర్యం కలిగించదు. లోక్ సభలో కేవలం 16 మంది మాత్రమే సభ్యులున్న టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో తీర్మానం ప్రవేశపెట్టిందిగాని కనీసం ఈ డిమాండ్‌పై సమగ్రంగా చర్చ జరగలేదు. తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఈ పార్టీ ఎంపీల్లో మంచి వక్త ఎవరూ లేకపోవడంతో ప్రత్యేక హోదా అవసరంపై ఎవరి దృష్టిని ఆకర్షించలేకపోయారు. ఈ ఏడాది ఫిబ్ర వరిలో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో కోల్పోతున్న జనాదరణ మళ్లీ సంపాదించే ప్రయత్నంలో భాగంగానే అవి శ్వాసం ఎత్తుగడ వేసి, చివరికి విఫలమయ్యారు. వాస్తవానికి ప్రత్యేక హోదా అంశంపై మొదట ఎన్డీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి గట్టి ప్రయత్నంచేసిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెసే. తీర్మానంపై చర్చ మొదలయ్యాక సభలో జరి గిన చర్చలో అసలు విషయం మరుగున పడిపోయింది. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు తమ సొంత ఎజెండాలను చర్చకు తీసు కొచ్చాయి. కాంగ్రెస్‌కు కూడా ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చే విష యంపై ఆసక్తి లేదు. ఈ తీర్మానం ఫలితంగా ఒడిశాలో పాలక పక్షం బీజేడీ, తెలంగాణను పాలిస్తున్న టీఆర్‌ఎస్, ఏఐఏడీఎంకేతో టీడీపీ సంబంధాలు దెబ్బదిన్నాయి. చర్చలో పాల్గొన్న ఈ మూడు పార్టీల సభ్యులూ ఏపీ సర్కారు, టీడీపీ తీరును విమర్శించారు. తమ రాష్ట్రాల సమస్యలు ప్రస్తావనకు వచ్చిన ప్పుడు టీడీపీ ఎప్పుడూ తమకు మద్దతు ఇవ్వలేదని వారు దుయ్యబట్టారు. ఇతర ప్రాంతీయపక్షాలతో ఇలా సమన్వయం లేకుండా తెలుగు దేశం వ్యవహరించిన ఫలితంగా 90 మంది ప్రతిపక్ష ఎంపీలు తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు. తీర్మానం వల్ల రాష్ట్రానికి ఏ మాత్రం మేలు జరగకపోగా కీడు జరిగిందనే చెప్పవచ్చు.
అవిశ్వాస తీర్మానంపై చర్చ వల్ల బాగా లబ్ధి పొందిన పార్టీ కాంగ్రెస్. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్డీఏ సర్కారుపై విమ ర్శల వర్షం కురిపించారు. ప్రసంగం చివర్లో ఆయన ప్రధాని మోదీ దగ్గరకు పోయి ఆలింగనం చేసుకోవడం ఆ రోజంతా పెద్ద వార్తగా ప్రచారం పొందింది. ప్రత్యేక హోదా విషయం తప్ప సభలో ఇతర విష యాలన్నీ చర్చకు వచ్చాయి. మీడియాలో అర్హతకు మించిన ప్రచారం సంపాదించిన కాంగ్రెస్ ఈ విషయంలో తెలుగుదేశాన్ని ఓడించింది. సభలో తీర్మానంపై చర్చ మొదలైన వెంటనే బిజూ జనతాదళ్ సభ్యులు వాకౌట్ చేశారు. తీర్మానంపై బీజేడీ మద్దతు సంపాదించడానికి ఆ పార్టీ నేత, ఒడిశా సీఎం నవీన్ పట్నా యక్‌తో మాట్లాడటానికి టీడీపీ ప్రయత్నించనే లేదు. అంటే తీర్మా నానికి వీలైనంత ఎక్కువ మంది సభ్యుల మద్దతుగాని, చర్చను ప్రత్యక్ష ప్రసారం చేసిన టెలివిజన్ చానళ్లలో ప్రచారం పొంద డానికిగానీ టీడీపీ ఆసక్తి ప్రదర్శించలేదు. కాంగ్రెస్ విషయానికి వస్తే రాహుల్ ప్రసంగం, మోదీతో ఆలింగనం వల్ల ఈ పార్టీకి జరిగింది నష్టమే. రాహుల్ ‘కౌగిలింత’కు విపరీత ప్రచారమైతే వచ్చిందిగాని ఆయన ఈ వింత చర్యతో విమర్శల పాలయ్యారు. తోటి ప్రతిపక్షాల నేతలు సైతం ఆయనను తప్పుపట్టారు.
తన ప్రసంగంతో మోదీ సర్కారును రాహుల్ గట్టిగా నిలదీశారు. కాని, ఆయనకు ప్రతిపక్షాలకు నాయకత్వం వహించాలంటూ ‘కిరీటం’ పెట్టడానికి ఏ పార్టీ ముందుకు రాలేదు. ప్రతిపక్షాల నేత ఎవరో 2019 ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ కలవరపడింది. బీజేపీయేతర నేత ఎవరైనా ప్రధాని కావడానికి కాంగ్రెస్ సిద్ధమని వెంటనే ప్రకటిం చింది. లోక్‌సభలో గుర్తింపుపొందిన ప్రతిపక్షంగా లేకున్నా కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తోందనే అభి ప్రాయం రాహుల్ ప్రసంగం వల్ల వ్యాపించింది. దీని తక్షణ పర్య వసానం ఏమంటే రాహుల్ ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి అయ్యే అవకాశం కోల్పోవడం. దీంతో ఇప్పుడు మమతా బెనర్జీ నుంచి మాయావతి, శరద్ పవార్ వరకూ అందరూ ప్రధాని పదవికి అభ్యర్థులే.
అవిశ్వాస తీర్మానం వల్ల ఆ«శించిన ఫలాలు దక్కకపోగా, కాంగ్రెస్‌తోపాటు తెలుగుదేశం, ఈ పార్టీ నేత చంద్రబాబు కూడా వ్యతిరేక ఫలితాలనే చవిచూడాల్సివస్తోంది. తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ జవాబిస్తూ, ప్రత్యేక హాదాకు బదులు ప్రత్యేక ప్యాకే జీకి బాబు అంగీకరించారని, ప్యాకేజీ ఇస్తున్నందుకు కేంద్రానికి కృతజ్ఞలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేయడం టీడీపీకి ఇబ్బంది కలిగించింది. హోదాపై హఠాత్తుగా మాట ఎందుకు మార్చారన్న మోదీ ప్రశ్నకు జవాబు లేకుండాపోయింది. ఈ తీర్మానం ఫలితంగా, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో బాబుకు ఎలాంటి ప్రయోజనం చేకూరే అవకా శాలు లేవు. ఎన్నికల లోపు పార్లమెంటులో ఏపీ సమస్యపై టీడీపీ సభ్యులు అప్పుడప్పుడు మాట్లాడినా సాధించేదీమీ ఉండదు. అవి శ్వాస తీర్మానాన్ని తమ సభ్యులతో చంద్రబాబు ప్రవేశపెట్టించారే గాని, దాని వ్యతిరేక పర్యవసానాల గురించి ఆయన ఆలోచించనే లేదు. అదీగాక, పార్టీ తరఫున సీనియర్ ఎంపీలతో చర్చలో మాట్లాడించే ప్రయత్నం చేయకపోవడం తెలుగుదేశం నేత చేసిన పెద్ద పొరపాటు. చివరికి మాజీ కేబినెట్ మంత్రి పి.అశోక్‌గజపతి రాజుతో మాట్లాడించాలన్న యోచనే రాలేదు. అనుభవంలేని ముగ్గురు జూనియర్ ఎంపీలకు ప్రాధాన్యం ఇచ్చారు. వారు తమ ప్రసంగాల్లో చెప్పిన విషయాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌పై సభలో మంచి అభిప్రాయం కలగలేదు.
గత నాలుగేళ్లుగా సాగిన అపసవ్య పాలనను కప్పిపుచ్చుకోవ డానికే తెలుగుదేశం లోక్‌సభలో గొడవ చేసిందనేది అందరికీ అర్థమైంది. అన్ని సమస్యలకూ బీజేపీ సర్కారే కారణమన్న నింద వల్ల తెలుగదేశం ప్రభుత్వానికే నష్టం చేస్తుంది. వాస్తవానికి పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ఆర్థిక వ్యవస్థకు బీజేపీ కీడు చేసింది. అవిశ్వాస తీర్మానం వల్ల బీజేపీయే బలప డింది. సభలో తనకు సంఖ్యాబలం ఉందని నిరూపించుకుంది. వాస్తవానికి ఇబ్బం దుల్లో ఈదులాడుతున్న మోదీ ప్రభుత్వానికి అనుకోకుండా తెలు గుదేశం, కాంగ్రెస్ పార్టీ హాయిగా ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చాయి. ప్రత్యేక హోదా డిమాండ్‌ను లేవనెత్తడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌ల ఆధిపత్య కులాల మధ్య పోటీ, కుల వివక్ష వంటి అంశా లను కప్పిపుచ్చాలని తెలుగుదేశం భావించింది. వచ్చే ఎన్నికల్లో కొన్ని కులాల ఆధిపత్యం అతి పెద్ద అంశంగా వచ్చే అసెంబ్లీ ఎన్ని కల్లో జనంలోకి చర్చకు వస్తుంది.
పెంటపాటి పుల్లారావు ,వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు
ఈ–మెయిల్ : drppullarao@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment