తెలంగాణకు బియ్యం కోటాను పెంచాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన శుక్రవారం కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా తమ రాష్ట్రం ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని, ఈ పథకంతో పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని ఇందుకు తమకు ఆసరాగా బియ్యం కోటాను పెంచాల్సిందిగా కోరారు. 14 వ ఆర్థిక సంఘం పన్నుల్లో రాష్ట్రానికి 42శాతం వాటా ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
తెలంగాణకు బియ్యం కోటా పెంచండి
Published Fri, Feb 27 2015 12:42 PM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM
Advertisement
Advertisement