![PM Modi, Sonia Gandhi Pay Tributes To Mahatma Gandhi In Parliament - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/3/Untitled-2.jpg.webp?itok=Z5FPaXOe)
ఢిల్లీలోని ‘గాంధీ స్మృతి’లో నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి కోవింద్, ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీజీకి మోదీ నివాళి
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశం ఘనంగా నివాళులర్పించింది. రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీలు బుధవారం రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. వీరితోపాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ గాంధీకి నివాళులు అర్పించారు. పార్లమెంటులోని సెంట్రల్ హాలులో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి 115వ జయంతి సందర్భంగా ఆయనకు కూడా నివాళులు అర్పించారు. జై జవాన్, జై కిసాన్ అన్న నినాదాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన లాల్ బహదూర్‌కు నివాళులు అంటూ మోదీ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment