సాక్షి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఓఖీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నిన్న రాత్రి మంగళూరు చేరుకున్న ప్రధాని ప్రత్యేక మిలటరీ విమానంలో లక్షద్వీప్‌లో చేరుకున్నారు. ఏరియల్ సర్వే ద్వారా ఓఖీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఓ స్కూల్ విద్యార్థులతో మాట్లాడారు. ఆ తర్వాత కేరళలోని త్రివేండ్రం చేరుకుని ఓఖీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
అక్కడి నుంచి తమిళనాడుకు చేరుకున్న ప్రధాని ఓఖీతో నష్టపోయిన బాధితులను పరామర్శించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేశారు. మోదీ కి కేరళ సీఎం పినరయ్ విజయన్, తమిళనాడు సీఎం పలనిస్వామి, గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ స్వాగతం పలికారు. కన్యాకుమారితో పాటూ ఇతర ప్రాంతాల్లో గత నెలలో ఓఖీ తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment