Ockhi
-
ఓక్కి బాధిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటన
తిరువనంతపురం/ చెన్నై: ఓక్కి తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. సాధ్యమైనంత మేర కేంద్రప్రభుత్వం సాయం అందిస్తుందని బాధిత రాష్ట్రాలకు ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం ముందుగా మోదీ లక్షద్వీప్ రాజధాని కవరట్టి చేరుకున్నారు. సహాయ, పునరావాస చర్యల కోసం రూ.150 కోట్ల సాయం అందించాలని అక్కడి ఉన్నతాధికారులు మోదీని కోరారు. అనంతరం మోదీ తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నారు. అక్కడ సీఎం పళనిస్వామితో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రూ.9,302 కోట్ల సాయం అందించాలని సీఎం పళనిస్వామి నష్టం నివేదిక అందజేశారు. అనంతరం మోదీ కేరళ రాజధాని తిరువనంతపురానికి 20కి.మీ. దూరం లో ఉన్న పూన్తురా అనే మత్స్యకార గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. కనిపించకుండా పోయిన మత్స్యకారులను క్రిస్ట్మస్ పండుగలోగా స్వస్థలాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు.రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు రూ.7,340 కోట్లు అందించాలని సీఎం పినరయి విజయ్ కోరారు. -
'ఓఖీ' ప్రభావిత ప్రాంతాల్లో మోదీ పర్యటన
సాక్షి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఓఖీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నిన్న రాత్రి మంగళూరు చేరుకున్న ప్రధాని ప్రత్యేక మిలటరీ విమానంలో లక్షద్వీప్‌లో చేరుకున్నారు. ఏరియల్ సర్వే ద్వారా ఓఖీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఓ స్కూల్ విద్యార్థులతో మాట్లాడారు. ఆ తర్వాత కేరళలోని త్రివేండ్రం చేరుకుని ఓఖీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి నుంచి తమిళనాడుకు చేరుకున్న ప్రధాని ఓఖీతో నష్టపోయిన బాధితులను పరామర్శించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేశారు. మోదీ కి కేరళ సీఎం పినరయ్ విజయన్, తమిళనాడు సీఎం పలనిస్వామి, గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ స్వాగతం పలికారు. కన్యాకుమారితో పాటూ ఇతర ప్రాంతాల్లో గత నెలలో ఓఖీ తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. -
కుమారికి.. రాహుల్ గాంధీ
సాక్షి, చెన్నై: కన్యాకుమారిలో ఓఖి బాధితుల్ని పరామర్శించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రాహుల్‌గాంధీ వెళ్తున్నారు. గురువారం ఆయన పర్యటన సాగనుండడంతో కుమరిలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఓఖి ప్రళయ తాండవానికి కన్యాకుమారి సర్వం కోల్పోయిన విషయం తెలిసిందే. కడలిలోకి వెళ్లిన వందలాది మంది జాలర్ల జాడ కాన రాలేదు. ఆదుకుంటామన్న భరోసాను ప్రభుత్వం ఇచ్చినా బాధితులు మాత్రం పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే కేంద్రం తరఫున రక్షణ మంత్రి నిర్మల సీతారామన్, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతలందరూ బాధితుల్ని పరామర్శించి ఓదార్చి వచ్చారు. ఈనేపథ్యంలో కొద్ది రోజులుగా గుజరాత్ ఎన్నికల బిజీగా ఉన్న రాహుల్ గాంధీ ప్రస్తుతం కుమరిలో పర్యటించేందుకు నిర్ణయించారు. నేడు రాక : ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రాహుల్‌గాంధీ కన్యాకుమారిలో పర్యటించనుండడంతో కాంగ్రెస్ వర్గాలు ఆయన దృష్టిలో పడేందుకు సిద్ధమయ్యాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు కుమరికి బుధవారమే తరలి వెళ్లారు. అయితే, పార్టీ వర్గాలతో ఎలాంటి పలకరింపులకు అవకాశం లేకుండా, కేవలం బాధిత ప్రాంతాల్లో పర్యటించే విధంగా రాహుల్ కుమరికి వచ్చేందుకు నిర్ణయించారు. ఆ మేరకు తిరువనంతపురం నుంచి హెలికాప్టర్లో కుమరి తూత్తురులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు ఉదయం 11గంటల సమయంలో చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన పర్యటన సాగనుంది. తొలుత చిన్నదురైలో బాధితుల్ని పరామర్శించనున్నారు. ఆ తదుపరి పంట పొలాలు, జాలర్ల గ్రామాల్లో ఆయన పర్యటన సాగనుంది. అలాగే, జాలర్లు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యే విధంగా రాహుల్ పర్యటనను రూపొందించారు. రాహుల్ పర్యటనతో కుమరిని నిఘా నీడలోకి తెచ్చారు.ఆయన పర్యటన సాగే ప్రాంతాల్లో భద్రతను పెంచారు. తిరునల్వేలి, తూత్తుకుడిల నుంచి అదనపు బలగాలను రంగంలోకి దించారు. కడలిలోకి వెళ్లిన వారిలో 662 మంది జాలర్ల జాడ ఇంత వరకు కాన రాలేదని, వారి మీద ఆశలు సన్నగిల్లుతున్నట్టు జాలర్ల కాంగ్రెస్ అధ్యక్షుడు గుణనాథన్ ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో బాధితుల్ని ఆదుకోవాలని నినదిస్తూ బుధవారం జాలర్ల కాంగ్రెస్ నేతృత్వంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. -
ఓక్కి తుపాను ప్రభావం నిరాశతో వెనుదిరిగిన గజరాజు
-
ఓక్కి తుపాను ఎఫెక్ట్.. నిరాశతో వెనుదిరిగిన గజరాజు
కోయంబత్తూరు: పెను తుపానుగా మారిన ఓక్కి సృష్టించిన విధ్వంసానికి తమిళనాడు, కేరళలు విలవిలలాడాయి. ఓక్కి తుపాను దెబ్బకి ప్రజలతో పాటూ జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కోయంబత్తూరులోని పెరియనాయకన్పాల్యంలో ఓ ఏనుగు తన పిల్ల ఏనుగుతో కలిసి ఆహారం కోసం ఓ ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. అయితే ఆహారం దొరక్కపోవడంతో ఆ ప్రాంతంలో ఎలాంటి నష్టం కలిగించకుండానే రెండు ఎనుగులు నిరాశతో వెనుదిరిగాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఓక్కి తుపాను ప్రభావం దక్షిణ తమిళనాడు, కేరళ తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉండటంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. కన్యాకుమారి జిల్లా దారుణంగా దెబ్బతింది. అలాగే తిరునల్వేలి, తూత్తుకూడి, పుదుకోట్టై, రామనాథపురం, విరుదునగర్ జిల్లాలు నష్టపోయాయి. కావేరీ డెల్టాలో కుండపోత వర్షాలతో లక్ష ఎకరాల వరి పంట దెబ్బతింది. -
ఓక్కి తుఫాన్ బీభత్సం