ప్రధాని మోదీ కొత్త ఏడాది కానుక | PM Modi's new year gift: Delhi-Meerut expressway foundation stone on Dec 31 | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ కొత్త ఏడాది కానుక

Published Tue, Dec 29 2015 7:37 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

ప్రధాని మోదీ కొత్త ఏడాది కానుక - Sakshi

ప్రధాని మోదీ కొత్త ఏడాది కానుక

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కొత్త సంవత్సరం కానుకగా ఈ నెల 31న దేశ రాజధాని ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేకు శంకుస్థాపన చేయనున్నారు. ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న ట్రాఫిక్ను నియంత్రించాలానే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.

ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరం.. ఢిల్లీకి ఈశాన్యదిశగా 70 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దేశ రాజధాని ప్రాంతంలో ఇదే అతి పెద్ద నగరం. మీరట్-ఢిల్లీ జాతీయ రహదారి 58 నిత్యం రద్దీగా ఉంటుంది. ఢిల్లీ పరిసరాల్లో ట్రాఫిక్ను నియంత్రించడం కోసం గత నెలలో మోదీ 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఢిల్లీ మహా నగరాన్ని అనుసంధానం చేసే మూడు హైవే ప్రాజెక్టులను ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement