
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ సడలింపు, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. రేపు (సోమవారం) మధ్యాహ్నాం 3 గంటలకు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ సీఎంలతో మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య శాఖ మంత్రి, వైద్య శాఖ కార్యదర్శి, హోం మంత్రి హోంశాఖ కార్యదర్శి కూడా హాజరుకానున్నారు. రాష్ట్రాల వారిగా కోవిడ్ నివారణకు చేపడుతున్న చర్యలను మోదీ తెలుసుకోనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పలు సూచనలు, సలహాలు కూడా మోదీ ఇవ్వనున్నారు. (కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు)
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వనరులు పూర్తిగా మూసుకుపోవడంతో ప్రత్యక ప్యాకేజీ ప్రకటించాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment