పీఎంఈఏసీ చైర్మన్ సి. రంగరాజన్ రాజీనామా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి (పీఎంఈఏసీ) చైర్మన్ చక్రవర్తి రంగరాజన్ సోమవారం రాజీనామా సమర్పించారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఘోర ఓటమి పాలైన నేపథ్యంలో రంగరాజన్ రాజీనామా సమర్పించారు.
రంగరాజన్ రాజీనామా చేశారు. మరో నెలపాటు విధులను నిర్వర్తిస్తారు అని పీఎంఈఏసీ అధికారులు మీడియాకు వెల్లడించారు. పీఎంఈఏసీ చైర్మన్ పదవికాలం ప్రధాని పదవీకాలానికి సమాంతరంగా ఉంటుంది. ప్రధాని మే 17 తేదిన రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే.
పీఎంఈఏసీ సౌమిత్ర చౌదరీ, వీఎస్ వ్యాస్, పులిన్ బీ నాయక్, దిలిప్ ఎం నాచానే సభ్యులు కూడా రాజీనామాలు సమర్పించారని అధికారులు తెలిపారు.