'కేరళ హౌస్‌పై అసలు దాడి చేయలేదు' | police did not raid kerala house, says delhi commissioner bs bassi | Sakshi
Sakshi News home page

'కేరళ హౌస్‌పై అసలు దాడి చేయలేదు'

Published Wed, Oct 28 2015 12:06 PM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM

'కేరళ హౌస్‌పై అసలు దాడి చేయలేదు'

'కేరళ హౌస్‌పై అసలు దాడి చేయలేదు'

అందరూ చెబుతున్నట్లుగా అసలు తమ పోలీసు సిబ్బంది కేరళ హౌస్ మీద దాడి చేయనేలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. అక్కడ బీఫ్ వండి వడ్డిస్తున్నట్లు పోలీసు కంట్రోల్ రూంకు తప్పుడు ఫోన్ కాల్ వచ్చిందని, అయితే ఇలాంటి సందర్భంలో మతపరమైన అల్లర్లు జరిగే ప్రమాదం ఉన్నందున తమ సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లిన మాట వాస్తవమే గానీ, వాళ్లు అక్కడ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా మాత్రమే వెళ్లారన్నారు. విష్ణుగుప్తా, అతడి అనుచరులు అక్కడ ఏమైనా వివాదం సృష్టిస్తే అడ్డుకునేందుకు మాత్రమే వాళ్లు వెళ్లారన్నారు.

కేరళ హౌస్‌పై అసలు పోలీసులు దాడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కంట్రోల్ రూంకు ఫోన్ చేసిన విష్ణు గుప్తా అనే వ్యక్తి ఇప్పటికే పోలీసుల దృష్టిలో ఉన్నాడని, కానీ ఈ ఘటన విషయంలో ఎవరూ అతడిపై ఫిర్యాదు చేయలేదని బస్సీ చెప్పారు. అయినా సెక్షన్ 182 (తప్పుడు సమాచారం) కింద అతడిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement