
సాక్షి, చెన్నై: ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి యువతిని మోసగించిన కేసులో పోలీసు అధికారిపై కేసు నమోదైంది. కృష్ణగిరి జిల్లా ఊత్తంకరై తాలూకా సింగారపేటకు చెందిన తమిళరసన్ (25). ఇతను నెల్లై జిల్లా మణిముత్తారు 9వ బెటాలియన్‌లో పోలీసుగా పని చేస్తున్నాడు. రెండేళ్ల కిందట ఇతనికి చెన్నై రాయపేటకు చెందిన యువతి (27)తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.
తరువాత ఇద్దరు ప్రేమించుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో తమిళరసన్ వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెను మోసంగించాడు. తరువాత తల్లిదండ్రులను ఒప్పించి వస్తానని వెళ్లిన తమిళరసన్ తిరిగి రాలేదు. దీనిపై బాధితురాలు నెల్లై జిల్లా ఎస్పీ అరుణ్‌శక్తి కుమార్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న తమిళరసన్ కోసం గాలింపు చేపట్టారు.