అరుదైన బంగారు బల్లికి అంత రేటా..! | Police seize a rare golden lizard worth Rs 20 crore | Sakshi
Sakshi News home page

అరుదైన బంగారు బల్లికి అంత రేటా..!

Published Fri, Mar 10 2017 5:25 PM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

అరుదైన బంగారు బల్లికి అంత రేటా..!

అరుదైన బంగారు బల్లికి అంత రేటా..!

గువాహటి: మనం కనివినీ ఎరుగనంత విలువ చేసే ఓ అరుదైన జాతి బల్లిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యంత అరుదుగా కనిపించే కోట్ల రూపాయల విలువ చేసే బంగారు బల్లిని గుర్తుతెలియని వ్యక్తి అక్రమ రవాణా చేస్తూ అసోం పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అరుదైన జాతి బల్లిని రవాణా చేస్తున్న వ్యక్తి కదలికపై అనుమానం వచ్చిన కొందరు ప్రయాణికులు గువాహటి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే గువాహటి రైల్వే స్టేషన్‌కు చేరుకుని చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అతడి వద్ద ఉన్న లగేజీని పరిశీలించగా అందులో ఓ అరుదైన జాతి బంగారు బల్లి ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ దాదాపు రూ. 20 కోట్లు ఉంటుందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. అతడికి ఏ ముఠాతో సంబంధాలున్నాయి, మరే ఇతర జాతి జీవులను అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడో తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బల్లులకు ఈ స్థాయిలో కోట్ల విలువ ఉంటుందానని స్థానికలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి సమాచారంతో పాటు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement