
నిందితుడిని అరెస్టు చేసన పోలీసులు
సాక్షి, ఆదోని: కర్నూల్ జిల్లా ఆదోని మండలం బైచిగేరిలో జరిగిన హత్యకు వివాహేతర సంబంధమే కారణమైనట్లు తేలింది. శనివారం తాలూకా సీఐ మురళీ, ఎస్‌ఐ సునీల్ కుమార్ వివరాలు వెల్లడించారు. బైచిగేరి గ్రామానికి చెందిన మహదేవకు మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన రాజేశ్వరితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే అదే గ్రామానికి చెందిన తెలుగు రంగన్న(51)తో తన భార్యకు వివాహేతర సంబంధమున్నట్లు మహదేవ అనుమానించాడు.
కొన్ని రోజుల క్రితం ఇదే విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈక్రమంలో ఈనెల 18న మహదేవ రంగన్నతో కలిసి మద్యం సేవించి గొడవకు దిగాడు. క్షణికావేశంలో రంగన్నపై గొడ్డలి, కర్రతో దాడి చేసి చంపేశాడు. మృతుడి భార్య అంజినమ్మ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment