సాక్షి, న్యూఢిల్లీ : నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణిస్తూ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపడంతో ఆమె దిగివచ్చారు. తన వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరించాయని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని శుక్రవారం పార్లమెంట్‌లో కోరారు. తనపై ఎలాంటి ఆధారాలు లేకున్నా ఉగ్రవాది అన్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీరును తప్పుపట్టారు. ఉగ్రవాది ప్రజ్ఞా సింగ్ మరో ఉగ్రవాది గాడ్సేను దేశ భక్తుడని కొనియాడారని గురువారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞా సింగ్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ నుంచి బీజేపీ తప్పించింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకూ పార్టీ ఎంపీల సమావేశాలకు అనుమతించరాదని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment