భోపాల్ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో తలపడుతున్న బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సోమవారం భోపాల్‌లో నామినేషన్ దాఖలు చేశారు. తన న్యాయవాదితో పాటు ముగ్గురు మద్దతుదారులు వెంటరాగా రిటర్నింగ్ అధికారికి ఆమె తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. 2008, సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలెగావ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రజ్ఞా సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కాగా బాబ్రీ మసీదు విధ్వంసంలో తాను పాలుపంచుకున్నానని ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బాబ్రీ మసీదుపై ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈసీని డిమాండ్ చేశారు. షోకాజ్ నోటీసులు జారీ చేసి ఈసీ చేతులు దులుపుకుంటే సరిపోదని, ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఈసీ పతనమవడానికి ప్రధాని నరేంద్ర మోదీయే కారణమని ఆమె మండిపడ్డారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు విధ్వంసంలో తానూ పాల్గొనడం పట్ల గర్వపడుతున్నానని ప్రజ్ఞా సింగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment