Bhopal Airport
-
సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రయాణిస్తున్న విమానం మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎయిర్ పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వారి విమానం భోపాల్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ్ చారీ మిశ్రా పీటీఐ వార్తా సంస్థకు తెలియజేశారు. అయితే ఎయిర్‌ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రతికూల వాతావరణమే కారణంగా తెలుస్తోంది. కాగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బెంగళూరులో జరిగిన విపక్ష నేతల సమావేశంలో పాల్గొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు తెలిసింది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ విషయమై వివరాలు తెలుసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శోభ ఓజా తెలిపారు. -
అక్రమ చొరబాటు.. హెలికాప్టర్ ధ్వంసం..!
-
అక్రమ చొరబాటు.. హెలికాప్టర్ ధ్వంసం..!
భోపాల్ : భోపాల్‌లోని రాజభోజ్ విమానాశ్రయంలో ఆదివారం కలకలం రేగింది. ఓ వ్యక్తి ఎయిర్‌పోర్టులోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా.. ప్రైవేటు హెలికాప్టర్‌ను ధ్వంసం చేశాడు. అనంతరం టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్ విమానం ముందు బైఠాయించాడు. వెంటనే స్పందించిన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) అతన్ని అదుపులోకి తీసుకుని.. స్థానిక పోలీసులకు అప్పగించింది. ఆగంతకుణ్ణి యోగేశ్ త్రిపాఠీ (20)గా గుర్తించారు. యోగేశ్ దాడి చేసిన హెలికాప్టర్ రాధాస్వామి సత్సంగ్ బియాస్‌కు చెందినది కావడం గమనార్హం. రాళ్లతో దాడి చేయడంతో హెలికాప్టర్ ముందు భాగం ధ్వంసమైంది. యోగేశ్ ఏ ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడ్డాడో తెలియాల్సి ఉంది. అయితే, గత కొన్ని రోజులుగా అతను మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని సమాచారం. ఇక ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఉద్రిక్తత నేపథ్యంలో.. ఉదయ్‌పూర్‌కు వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం గంట ఆలస్యంగా నడిచిందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. -
భోపాల్‌లో ప్రజ్ఞా సింగ్ నామినేషన్
భోపాల్ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో తలపడుతున్న బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సోమవారం భోపాల్‌లో నామినేషన్ దాఖలు చేశారు. తన న్యాయవాదితో పాటు ముగ్గురు మద్దతుదారులు వెంటరాగా రిటర్నింగ్ అధికారికి ఆమె తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. 2008, సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలెగావ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రజ్ఞా సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా బాబ్రీ మసీదు విధ్వంసంలో తాను పాలుపంచుకున్నానని ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బాబ్రీ మసీదుపై ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈసీని డిమాండ్ చేశారు. షోకాజ్ నోటీసులు జారీ చేసి ఈసీ చేతులు దులుపుకుంటే సరిపోదని, ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఈసీ పతనమవడానికి ప్రధాని నరేంద్ర మోదీయే కారణమని ఆమె మండిపడ్డారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు విధ్వంసంలో తానూ పాల్గొనడం పట్ల గర్వపడుతున్నానని ప్రజ్ఞా సింగ్ చెప్పారు. -
మరో విమానం అత్యవసర ల్యాండింగ్
భోపాల్: ఎయిరిండియాకు చెందిన విమానంలో ఓ ఇంజిన్ చెడిపోడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బుధవారం ఉదయం ఎయిరిండియా విమానం 634ను భోపాల్‌లోని రాజ భోజ్ విమానాశ్రయంలో సురక్షితంగా దింపారు. ఈ రోజు ఉదయం 8:15 గంటలకు ఈ విమానం భోపాల్ విమానాశ్రయం నుంచి ముంబైకి బయల్దేరింది. అయితే మార్గమధ్యంలో ఇంజిన్ చెడిపోవడంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. విమానాశ్రయ సిబ్బంది వెంటనే మరమ్మత్తు చేయడంతో కాసేపటి తర్వాత విమానం ముంబైకి బయల్దేరింది. కాగా సాంకేతిక, ఇతర సమస్యల వల్ల ఎయిరిండియా విమానాలు గమ్యస్థలం చేరకుముందే మార్గమధ్యంలో వెనక్కివచ్చిన సంఘటనలు ఉన్నాయి.